Homeజిల్లాలుఅల్లూరి సీతారామ రాజువిద్యార్థులకు విద్య సామగ్రి పంపిణీ

విద్యార్థులకు విద్య సామగ్రి పంపిణీ

- Advertisement -

విశాలాంధ్ర- డుంబ్రిగుడ : మండలంలోని కండ్రుం ప్రాథమికోన్నత పాఠశాల 108 మంది విద్యార్థులకు అక్షర ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ విశాఖపట్నం ఫౌండర్ ప్రియ బాంధవి ఆధ్వర్యంలో సోమవారం గణతంత్ర దినోత్సవ పురస్కరించుకొని మండల విద్యాశాఖ అధికారి 2 గెన్ను చేతులు మీదుగా విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఉచితంగా విద్యాసామాగ్రిని అందించిన వెల్ఫేర్ సొసైటీ కు కృతజ్ఞతలు తెలిపారు. అందించిన విద్యాసామగ్రిని విద్యార్థులు సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పారు. అనంతరం విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎందుకు జరుపుకుంటారు అన్న అంశంపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూర్యనారాయణ పడాల్, పాఠశాల ఉపాధ్యాయులు సంజీవరావు, నిరంజన్, కొండబాబు, రాంబాబు, అక్షర ఎడ్యుకేషనల్ వెల్ పర్ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు