విశాలాంధ్ర – కడియం : సుమారు సంవత్సర కాలంగా జేగురుపాడు గ్రామ పంచాయతీ గ్రేడ్ 1 కార్యదర్శిగా పనిచేస్తున్న అయినవిల్లి శ్రీనివాసరావును 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ పి ప్రశాంతి చేతులమీదుగా బెస్ట్ సర్వీసెస్ అవార్డు అందుకున్నందుకు గాను, గ్రామ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ ఆధ్వర్యంలో, గ్రామంలో వివిధ శాఖల సిబ్బంది ఘనంగా సత్కారించారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్టాలిన్ మాట్లాడుతూ జేగురుపాడుకు ఇప్పటివరకు జాతీయస్థాయి మరియు రాష్ట్రస్థాయి అవార్డులు రావడం జరిగిందని, ఇప్పుడు శ్రీనివాసరావు కు బెస్ట్ సర్వీసెస్ అవార్డు రావడం గ్రామస్థులందరికి సంతోషంగా ఉందని తెలిపారు. గ్రామ ఎంపీటీసీ సభ్యులు నాగిరెడ్డి రామకృష్ణ, ఆకుల సుధాకర్, పంచాయతీ మెంబర్లు రంకిరెడ్డి చిట్టియ్య, మోహన్, బోనం నాగయ్య, మర్రెడ్డి రమేష్, కర్రీ చిన్నబాబు, ఫిషర్మెన్ సొసైటీ ప్రెసిడెంట్ సాక కిరణ్ కుమార్, మోటిక మునియ్య, దూదే శివ తదితరులు శ్రీనివాసరావు ను దుశాలువాలతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
అవార్డు గ్రహీతకు ఘన సన్మానం.
- Advertisement -
RELATED ARTICLES


