Wednesday, February 19, 2025
Homeజిల్లాలుకర్నూలుమూడు పొట్టేళ్లను పొట్టన పట్టుకున్న చిరుత పులి?

మూడు పొట్టేళ్లను పొట్టన పట్టుకున్న చిరుత పులి?

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలో కటికె మిన్నుల్లాకు చెందిన 60 వేలు విలువ చేసే మూడు పొట్టేళ్లను చిరుత పులి పొట్టన పెట్టుకుందని బాధితుడు గురువారం కన్నీరు మున్నీరుగా విలపించారు. దేవుడి కోసం మూడు పొట్టేళ్లను పెంచినట్లు, అయితే రాత్రి ఇంటి వద్ద కట్టేసి ఉండగా మూడు పొట్టేళ్లను చిరుత పులి చంపేసిందని వాపోయారు. చిరుత పులి తిరిగిన ఆనవాలు ఉన్నాయని, చిరుత పులే చంపి ఉంటుందన్నారు. కావున సంబంధిత అధికారులు స్పందించి తనకు నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు