విశాలాంధ్ర -చిలమత్తూరు (శ్రీ సత్య సాయి జిల్లా) : మండల కేంద్రంలోని ప్రధాన రహదారి సుంకు రఘు దుకాణం ప్రక్కన బ్రాహ్మణ వీధి ప్రారంభంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది, మండల కేంద్రానికి ప్రతి చిన్న విషయానికి ప్రతి రోజు వేలమంది వాహనదారులు, పాదచారులు పశువులు, వెళుతూ వస్తూ ఉంటాయి అసలే వర్షాకాలం కావడంతో ఈ విద్యుత్ లైన్ పొరపాటున పాదచారులు పశువులు వాహనదారులు ఈ ప్రదేశంలో విద్యుత్ ఘాతానికి గురి అయ్యే అవకాశం ఉన్నది, మండల కేంద్రములో ప్రధాన రహదారిలో ఇలా ఉంటే మరి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఎన్నోసార్లు ఈ రహదారిలో ఆ శాఖ అధికారులు వెళుతున్నాను ఈ దృశ్యం అగుపించలేదా అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిర్లక్ష్యపు ధోరణిని వదిలిపెట్టి ప్రజలు విద్యుత్ ఘాతానికి గురి కాకుండా సేవలు అందించాల్సిన అవసరం ఉంది.
విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దం…
RELATED ARTICLES