విశాలాంధ్ర ధర్మవరం; పట్టణం లోని రంగనాయకులు, ఓబులమ్మ, అనే నిరుపేద కుటుంబానికి ఆర్థిక పరిస్థితి బాగాలేదని జీవన ఉపాధి కోసం సహకారం కావాలని సోషల్ మీడియా ద్వారా వారు తెలియజేశారు. ఈ సమాచారాన్ని అందుకున్న పుట్టపర్తికి చెందిన సుందరవల్లి, జ్ఞాపకం వారి కుటుంబ సభ్యులు, గోరంట్ల మండలానికి చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయు అవార్డు గ్రహీత జగదీశ్వరరావు, సహకారంతో నిరుపేద కుటుంబానికి తోపుడు బండి సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సమాజ సేవకులు కేతా లోకేష్, మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కీర్తిశేషులు సుందరవల్లి, మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం అని తెలిపారు.ఈ రోజున కీర్తిశేషులు సుందరవల్లి, వారి జ్ఞాపకార్థంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం నిజంగా సంతోషించేదగ్గ విషయం అని తెలిపారు. రక్త బంధం ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కన్నా వెంకటేష్ మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన దాతలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటివి మరెన్నో నిరుపేద కుటుంబాలకి దాతలు ద్వారా సహకారం అందిస్తామని తెలియజేశారు.ఈ యొక్క కార్యక్రమంలో , పోల శ్రీనివాసులు,, ఉదయ్ కుమార్, రామంజి, నాగరాజు, హరికృష్ణ, జయశంకర్, తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద కుటుంబానికి జీవన ఉపాధికి తోపుడు బండి పంపిణీ
RELATED ARTICLES