జే టి సి. తిరుపతి.. బి. కృష్ణవేణి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములో, నేషనల్ హైవే రోడ్ లో ఇకనుంచి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలను చేపట్టాలని జేటిసి. తిరుపతి.. బి. కృష్ణవేణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఆర్టీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులను వారు పరిశీలించారు. తదుపరి ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను వారు పరిశీలించారు. ప్రమాదాల నివారణకు తగు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. మున్ముందు ప్రమాదాలు జరగకుండా నివారణ మార్గాలను అన్వేషించాలని, ప్రమాదాలను పూర్తిస్థాయిలో తగ్గించాలని, ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన సదస్సులను నిర్వహించాలని, నివారణ చర్యలు మాత్రమే ప్రమాదాలను రక్షిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాణి, ఆర్ టి ఓ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టండి..
RELATED ARTICLES