Sunday, July 13, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిటిడిపి సుపరిపాలనలో తొలి అడుగు…

టిడిపి సుపరిపాలనలో తొలి అడుగు…

విశాలాంధ్ర :చిలమత్తూరు (శ్రీ సత్య సాయి జిల్లా) : మండల కేంద్రంలో శుక్రవారం హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు మండల్ కన్వీనర్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో టిడిపి సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసులు హాజరై శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం లో పూజా కార్యక్రమం నిర్వహించి తెలుగుదేశం పార్టీ నాయకులు సూపరిపాలన లో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. అనంతరం ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి ఈ ఏడాది పరిపాలనలో కూటమి ప్రభుత్వం అందించిన పథకాల గురించి వివరిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ ఆనందం చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బేకరీ గంగాధర్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఆనంద్ కుమార్, మార్కెట్ యాడ్ చైర్మన్ అశ్వర్థ రెడ్డి, శ్రీదేవి, అంజనమ్మ, లక్ష్మీదేవి, స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు