Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి

ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి

- Advertisement -

యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : విద్యాహక్కు చట్టం సెక్షన్ నుండి 23(1) మార్పు చేయాలని అదే సందర్భంలో ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ పరీక్ష నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, రామకృష్ణ నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా
పట్టణంలోని యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ టెట్ అర్హత సాధించాల్సిందేనని తీర్పు చెప్పిందని తెలిపారు. 2028 ఆగస్టు 31 తేదీ వరకు టెట్ అర్హత సాధించడానికి అవకాశం ఇస్తామని తెలిపిందని తెలియజేశారు. అప్పటికే 30 సంవత్సరాలు సర్వీస్ పూర్తిచేసిన వారు కూడా టెట్ రాయాలంటే చాలా ఆందోళనతో ఉన్నారని తెలిపారు. ఉపాధ్యాయులు యొక్క ఆందోళన దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి విద్యాహక్కు చట్టం 23(1) లో సవరణ చేసే ప్రయత్నం చేయాలని, అప్పటి లోగా ప్రభుత్వ ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించడానికి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాలని కోరారు. అందుకే ఉపాధ్యాయుల్లో ఉన్న ఆందోళన ను గమనించిన యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ విద్యా హక్కు చట్ట సవరణ కోసం, ప్రత్యేక టెట్ నిర్వహణ కోసం ఆందోళన కార్యాచరణ ప్రకటించిందని తెలిపారు. టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని కోరుతూ కార్యాచరణ లో జూన్ 10 నుండి 12 వరకు పాఠశాల విద్యాశాఖ అధికారులకు ప్రాతినిత్యాలు చేయడం,జూన్ 13 నుంచి 16 వరకు రాష్ట్రంలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు ప్రాతినిధ్యం చేయడం,జూన్ 30వ తేదీ ఒకరోజు మండల కేంద్రాల్లో నిరసన దీక్ష, జూలై రెండవ తేదీ జిల్లా స్థాయిలో ఒకరోజు నిరాహార దీక్షలు,జూలై 15 రాష్ట్రస్థాయి నిరాహార దీక్ష చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు k.భూతన్న, జిల్లా కోశాధికారి సి .లక్ష్మీనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్స్ సి.తాహిర్వలి, ఎం.మేరీ వరకుమారి, జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి సుధాకర్ జిల్లా కార్యదర్శులు పి.అమర్ నారాయణరెడ్డి డీ.,నరసింహప్ప, ఎం .బాబు, నాగేంద్రమ్మ, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు