Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచేనేత దినోత్సవం రోజున చేనేతలకు ఉచిత కంటి వైద్య శిబిరం..

చేనేత దినోత్సవం రోజున చేనేతలకు ఉచిత కంటి వైద్య శిబిరం..

- Advertisement -

రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలో ఆగస్టు ఏడవ తేదీ చేనేత దినోత్సవ వేడుకను పురస్కరించుకొని చేనేత కార్మికులకు ఉచితంగా కంటి వైద్య శిబిరం ఎస్బిఐ కాలనీ మధు కంటి వైద్యశాలలో నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా తన స్వగృహమునందు శిబిరమునకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చేనేత కార్మికులకు కన్ను చాలా ముఖ్యమైనదని తెలిపారు. కంటిపట్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఎంతైనా ఉందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకొని చక్కటి చూపుతో తమ వృత్తిని కొనసాగించుకోవలసినదిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రతినిధి, బీసీ మహిళ రాష్ట్ర నాయకురాలు సంకారపు జయశ్రీ, పట్టు చీరల వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవి, పట్టణ తోగట వీర సంక్షేమ సంఘం అధ్యక్షులు గుద్దిటి రామచంద్ర, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పరిసే సుధాకర్, స్థానిక చేనేత నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు