Homeజిల్లాలుశ్రీ సత్యసాయివితంతువును ప్రేమ పేరుతో మోసం – బిడ్డతో కనిపించని వ్యక్తి..

వితంతువును ప్రేమ పేరుతో మోసం – బిడ్డతో కనిపించని వ్యక్తి..

- Advertisement -

విశాలాంధ్ర, పుట్టపర్తి: వితంతువుని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్‌కి వినతి పత్రం అందజేసింది.బాధితురాలు పసుపులేటి పావని మాట్లాడుతూ కురుబలకోట మండలం రిషి వ్యాలీకి చెందిన తనకు ధర్మవరానికి చెందిన వినోద్ కుమార్‌తో వివాహం జరిగిందన్నారు . ఐదేళ్ల దాంపత్య జీవితం తర్వాత వినోద్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందడంతో తన స్వగ్రామంలో ఉండిపోయానని తెలిపారు. తరువాత మదనపల్లిలో వైద్యం కోసం వెళ్లిన సమయంలో టీ. సదుం గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు పరిచయమై, తాను వివాహం చేసుకుంటానని చెప్పి ప్రేమ తో దగ్గరయ్యాడని తెలిపింది. తనకు అప్పటికే పెళ్లయిందనే విషయం శ్రీకాంత్ దాచిపెట్టాడని, 2023లో కదిరిలో తనతో కాపురం పెట్టాడని పేర్కొంది.ఈ క్రమంలో తాను గర్భం దాల్చిన తర్వాత అబార్షన్ చేయించుకోవాలని చాలాచోట్ల ఆస్పత్రులకు తిప్పాడన్నారు. తన అంగీకారం లభించకపోవడంతో బిడ్డ పుట్టిన తరువాత “ఈ బిడ్డ నా ఆస్తికి అడ్డుగా మారతాడేమో” అనే అనుమానంతో బిడ్డతో కలిసి శ్రీకాంత్ కనిపించకుండా పోయాడని పావని కన్నీటి పర్యంతమైంది . ఇదే విషయమై బి.కొత్తకోట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు .జిల్లా ఎస్పీ స్పందించి నాకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు