Homeజిల్లాలుశ్రీ సత్యసాయిదళితుల స్మశానానికి దారి లేదు… పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద దళితుల ఆవేదన

దళితుల స్మశానానికి దారి లేదు… పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద దళితుల ఆవేదన

- Advertisement -

విశాలాంధ్ర పుట్టపర్తి:- దళితుల స్మశాన వాటికకు దారి ఏర్పాటు చేయాలని దళితులు కోరారు. సోమవారం చిలమత్తూరు మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన దళితులు పుట్టపర్తి కలెక్టరేట్ ఛాంబర్ లో బైఠాయించి నిరసన తెలిపి జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ, ఎస్సీ,ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు సాకే హరిలు మాట్లాడుతూ దళితవాడలో ఎవరు చనిపోయినా ఆరడుగుల జాగా లేక వంక గట్లు మీద పాతి పెట్టాల్సి వస్తుందన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కొర్లకుంటలో నలుగురు వ్యక్తులు చనిపోతే ఆ మృతదేహాలు ఖననం చేసేందుకు దారి లేక ఇళ్ల ముందే మృతదేహాలతో ఎదురుచూపులు చూడాల్సి రావడం పాలకులకు కనిపించలేదా అని ప్రశ్నించారు. చరిత్ర కలిగిన కుటుంబంలో పుట్టి హిందూపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నందమూరి బాలకృష్ణకు ఈ విషయం తెలిసిన ఎందుకు పరిష్కరించడం లేదన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు జిల్లాకు వచ్చి వెళుతున్నారు కానీ దళితుల గోడు వినిపించలేదా అని వాపోయారు. హైటెక్ యుగం అంటారు, టెక్నాలజీ అంటారు చంద్రమండలంలో ఇల్లు కట్టబోతున్నామని చెబుతున్న పాలకులు, దళితులు చనిపోతే ఆరడుగుల జాగా లేకుండా చేయడం అభివృద్ధి అంటారా అని ప్రశ్నించారు. కొర్లగుంట దళితవాడలో ఇన్ని రోజులు ఎవరు చనిపోయినా మృతదేహాలు ఖననం చేసేందుకు నానా పాట్లు పడుతూ వచ్చామని, భవిష్యత్తులో గ్రామంలో ఎవరు చనిపోయినా ఆ మృతదేహాలను పుట్టపర్తి కలెక్టరేట్ వద్దకు తీసుకువచ్చి నిరసన తెలియజేస్తామని, అవసరమైతే ఆ మృతదేహాన్ని ఇక్కడే ఖననం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిఎంసి మెంబర్ రామాంజినప్ప,గోపాలకృష్ణ, పెనుగొండ రవికుమార్, సిహెచ్ ఈశ్వర్, ఊటుకూరు నాగరాజ్, పైడేటి రాందాస్,నరేష్, నారాయణ,రాజశేఖర్ మరియు కొర్లకుంట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు