విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : కూటమి ప్రభుత్వం ఎన్నికలల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని,జీఓ నెం 108,77ను రద్దుచేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి.వలరాజు, బందెల నాసర్ జీ లు డిమాండ్ చేశారు. సోమవారం ఏఐఎస్‌ఎఫ్ కలెక్టరేట్ సమీపంలోని విజయపాలడైరీ వద్ద ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అద్యక్షుడు సోమన్న అద్యక్షత నిర్వహించిన బహిరంగ సభలో వారు ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఏఐఎస్‌ఎఫ్ ఆద్వర్యంలో చేపట్టిన ఇచ్చాపురం నుండి హిందూపురం బస్సుజాత సోమవారం కర్నూలుకుచేరుకుంది ఈ సందర్భంగా సీపీఐ కార్యాలయం నుండి వరకు బారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిని బహిరంగ సభ నుద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విద్యార్థులకు అనేక హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద విద్యార్థుల కష్టాలు తీరుస్తామని చెప్పిన ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఎన్నికలలో విద్యార్థులకు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెల రోజుల్లో పెండిరగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 6400 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ ఆ హామీ దాదాపు ఒకటిన్నర సంవత్సరం ప్రభుత్వ పరిపాలన పూర్తవుతా ఉన్నా నిధులు విడుదల చేయలేదన్నారు.ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు సర్టిఫికేట్‌లు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. 4111 సాఠశాలలు మూసివేశారని 3,63,000 మంది విద్యార్థులు విద్యకు దూరం అయ్యారని ఏ ఒక్కపాఠశాలను తెరిపించలేదన్నారు.రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేసిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 100% మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో ఉన్న రాయలసీమ క్లస్టర్ ఉర్దూ యూనివర్సిటీల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈనెల 12వ తేదీ అనంతపురంలో ముగింపు సభ నిర్వహిస్తామని ఈ సభ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి ఎన్.లెనిన్ బాబు,మాజీ జిల్లా కార్యదర్శి ఎస్ మునెప్ప, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు జి.చంద్రశేఖర్,మాజీ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పీ రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ మస్తాన్,ఫణీంద్ర,చలపతి నాగభూషణం గర్ల్స్ కమిటీ సభ్యులు హరిత, రాష్ట్ర నాయకులు యశ్వంత్, మాధవ,అమర్,అభి, జిల్లా కార్యదర్శి షాబీర్ భాష తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల హామీలు అమలు చేయాలి మెడికల్ కళాశాల పిపిపి విధానాన్ని రద్దు చేయాలి. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి.వలరాజు,నాసర్ జీ
- Advertisement -
RELATED ARTICLES


