విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ : జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ( అనంతపురం) ఉపకులపతిగా ఆచార్య హెచ్. సుదర్శన్ రావు ను నియమిస్తూ గవర్నర్ మంగళవారం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. 1983లో జేఎన్టీయూ అనంతపురం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ,1986 లో ఎంటెక్ పూర్తిచేసి.. తొలి ర్యాంకును కైవసం చేసుకునే విద్యనభ్యసించి, తనదైన ముద్రను వేసుకున్నారు. 1996లో పీహెచ్డీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై , 37 సంవత్సరాలుగా బోధనా రంగంలో అనుభవం,215 జాతీయ అంతర్జాతీయ ప్రచురణలు, ఆవిష్కరణలు , విద్యార్థులలో దాగివున్న సృజనాత్మక ను వెలికి తీసి సమాజ అభ్యున్నతకు తోడ్పాటును అందించారు. గతంలో పరిపాలనజేఎన్టీయూ రెక్టార్, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్గా పనిచేశారు. సుదీర్ఘ అనుభవం కలిగిన సుదర్శన్ రావు ను నియామకం పట్ల అధ్యాపక బృందం, బోధ నేతర ఉద్యోగులు అభినందనలు తెలిపారు.