Homeజిల్లాలుకర్నూలుపొదుపు సంఘాలకు రుణాలు ఇవ్వని బ్యాంకు మేనేజర్ పై చర్యలు తీసుకోవాలి

పొదుపు సంఘాలకు రుణాలు ఇవ్వని బ్యాంకు మేనేజర్ పై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పొదుపు సంఘాలకు సకాలంలో రుణాలు ఇవ్వని బ్యాంకు మేనేజర్ పై చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం పెద్దకడబూరులోని స్థానిక ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఉన్న పొదుపు సంఘాలకు, రైతులకు రుణాలు మంజూరు చేయడంలో ఘోరంగా విఫలం చెందారని ఆరోపించారు. పొదుపు మహిళలు తమకు ఇచ్చిన రుణాలు సకాలంలో చెల్లిస్తే వెంటనే మళ్లీ రుణాలు మంజూరు చేసేవారని తెలిపారు. కానీ రుణాలు చెల్లించినా ఇక్కడి బ్యాంకు మేనేజర్ డబ్బులు లేవు రెండు నెలలు, మూడు నెలల తర్వాత రండి అంటూ కలెక్టర్ కు చెప్పండి అంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పొదుపు మహిళలు తమ అవసరాల నిమిత్తం రుణాల కోసం బ్యాంకు చుట్టూ తిరిగుతున్నా మేనేజర్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ మేనేజర్ ఏ కారణం లేకుండానే వినియోగదారుల ఖాతాలను బ్లాక్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి రుణాలు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న బ్యాంకు మేనేజర్ పై చర్యలు తీసుకొని బదిలీ చేయాలని లేని పక్షంలో పొదుపు మహిళలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరేష్, అంజినయ్య, రామాంజని, బాబు, కాశిం, హనుమంతు, ఉరుకుందు, మబ్బు అంజినయ్య, మాబువలి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు