విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పెత్తందార్లకే యూరియా సరఫరా చేస్తున్న గ్రామ వ్యవసాయ సహాయకులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్ డిమాండ్ చేశారు . మంగళవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని గ్రామ వ్యవసాయ సహాయకులు పవన్ యూరియాను పెత్తందార్లకే సరఫరా చేస్తూ అసలైన పేద రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి యూరియా ఇస్తున్నారన్నారు. పెత్తందార్లు ఫోన్ చేస్తే వెంటనే వారికి ఇస్తున్నారని తెలిపారు. ఇదేమని రైతులు అడిగితే ఎవరికి చెప్పకుంటావో చెప్పుకో అని రైతులను తిట్టి పంపిస్తున్నారన్నారు. నేను ఇచ్చిన వారే యూరియా తీసుకోవాలంటూ ఇస్టానుసారంగా ప్రవర్తుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి గ్రామ వ్యవసాయ సహాయకులు పవన్ పై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.
పెత్తందార్లకే యూరియా సరఫరా చేస్తున్న వీఏఏ పై చర్యలు తీసుకోవాలి
- Advertisement -
RELATED ARTICLES


