విశాలాంధ్ర -చాట్రాయి : వినిమయ సంస్కృతి పెరుగుతున్న టీవీలు సెల్ ఫోన్ లు సామాజిక మాధ్యమాల హడావుడి ఎంత ఉన్న గురుభట్లగూడెం వారి చెక్కభజన కోటపాడు గ్రామస్తులను అలరించింది. చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో దేవి నవరాత్రులు సందర్భంగా చింతలపూడి మండలం గురుబట్లగూడెం గ్రామంలోని శ్రీ రామాంజనేయ చెక్కభజన మండలి వారిచే భజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మారుతున్న కాలక్రమంలో పురాతన జానపద సాంప్రదాయ కళాయిన చెక్కభజన గ్రామస్తులను అలరించింది. ఈ సందర్భంగా భజన మండలి ఆర్గనైజర్ కమ్మంపాటి బద్రి నారాయణ మాట్లాడుతూ.మా పూర్వికుల నుండి చెక్క భజన ఒక సాంప్రదాయంగా పరిచయం చేసుకుంటూ వస్తున్నామని పురాతన కళను సజీవంగా నిలిపి భావితరాలకు అందించాలని చారిత్రక వైభవాన్ని నిలపాలనేది తమ ధ్యేయమన్నారు. బృందంలో ఖమ్మంపాటి బద్రీనారాయణ హరిబాబు కృష్ణయ్య నాగేశ్వరరావు వెంకటేశ్వరరావు అడ్డూరి శ్రీనివాసరావు బండి గోపాలరావు నందిగాం వెంకట సుబ్బారావు తదితరులు ఉన్నారు.


