విశాలాంధ్ర – (అనంతపురం)జేఎన్టీయూ ఏ:పారిశ్రామిక ప్రమాదాల నివారణ, పరిశోధన పై అవగాహన ఒప్పందం చేసుకొ న్నట్లు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శనరావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య పేర్కొన్నారు. జేఎన్ టీయూ, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలశాఖ మధ్య సోమవారం రాజధానిలో అవగా హన ఒప్పందం కుదుర్చుకున్నట్టు రిజిస్ట్రార్ తెలిపారు. రిజిస్ట్రార్ కృష్ణయ్య మాట్లాడుతూ.. జేఎన్టీయూ(అనంతపురం) కెమికల్ ఇంజనీరింగ్ , మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల పరిశ్రమల నిపుణు లతో సేఫ్టీ ప్రోగ్రాంలు నిర్వహిస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పరిశోధనలు నిర్వహిస్తామన్నారు. ప్రమా దాల నుంచి రక్షణకు ఉపయోగించే పరికరాలను ఎలా ఉపయోగించాలి అనే అంశంపై అధ్యయనం చేస్తామ న్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరిశ్రమల విభాగం అధికారులు శేష గిరిబాబు, గంధం చంద్రుడు, మోహన్రావు, జేఎన్ టీయూ డీఏపీ డైరెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.


