Homeజిల్లాలుఅనంతపురంచంద్రబాబు ఎన్నికల హామీలు మరిచిపోయారా! – స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి..

చంద్రబాబు ఎన్నికల హామీలు మరిచిపోయారా! – స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి..

- Advertisement -

వామపక్ష పార్టీల సంయుక్త నిరసన ధర్నా

విశాలాంధ్ర- అనంతపురం : వామపక్ష రాజకీయ పార్టీలైన సిపిఐ, సిపిఐఎం, సిపిఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ), సిపిఐ ఎంఎల్, ఎస్‌యూసీఐ (సి) సంయుక్తంగా, నిరసిస్తూ మంగళవారం అనంతపురం పాతూరు నందు పవర్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు సిపిఎం నగర కార్యదర్శి రామి రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు నాగరాజు నాయక్ ఎస్ సి ఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర సిపిఐ ఎంఎల్ నాయకులు చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ చార్జీల భారం వివాదాస్పద స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలన్నారు.
ఎన్డీఏ కూటమిలో భాగమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలానికే విద్యుత్ చార్జీలను పెంచడం ప్రజావ్యతిరేక చర్యగా ఖండిస్తున్నామన్నారు. ప్రజల గోప్యత, ఆర్థిక భద్రతను హరించేలా ప్రజలపై బలవంతంగా రుద్దుతున్న స్మార్ట్ మీటర్లు మామూలు వినియోగదారులపై మరింత భారంగా మారుతోందన్నారు. కేంద్రం కార్పొరేట్ లాభాల కోసం రాష్ట్రాలపై స్మార్ట్ మీటర్లను బలవంతంగా రుద్దుతోందని అని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ ప్రజలకు ఇచ్చిన హామీలను వామపక్షాలు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
“స్మార్ట్ మీటర్లు, విద్యుత్ చార్జీలు, నిత్యావసర ధరలు తగ్గిస్తాం” అని చెప్పిన వాళ్లే,
ఇప్పుడు అధికారంలోకి వచ్చి ప్రజలపై స్మార్ట్ మీటర్లను రుద్దడం ఘోరమైన మోసమని పేర్కొన్నారు.
“ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగిస్తే మీటర్లాని పగలగొట్టాలి” అని గతంలో నారా లోకేష్ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ప్రజలకు గుర్తే ఉన్నాయని, ఇప్పుడు అదే వారు అధికారంలోకి వచ్చి అదే చర్యలకు మార్గం వేసే విధంగా వ్యవహరించడాన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు . విద్యుత్ చార్జీలను తగ్గించాలని,స్మార్ట్ మీటర్ల అమలును పూర్తిగా రద్దు చేయాలన్నారు. ,విద్యుత్ రంగాన్ని ప్రజా ప్రయోజనాల కోసమే నడపాలి కానీకార్పొరేట్ లాభాల కోసమే కాదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు జాన్సన్ బాబు సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజారెడ్డి, కేశవరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య,రమణ,పద్మావతి,సంతోష్ కుమార్,రాజేష్. నగర సహాయ కార్యదర్శి వీ. కృష్ణుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగేంద్ర, సీఐటీయూ జిల్లానాయకులు, గోపాల్ మంత్రి వరలక్ష్మి, రాజు, ఏ ఐ వై ఎఫ్, డి వై ఎఫ్ ఐ,ఏ ఐ డి ఎస్ ఒ,ఏఐటీయూసీ, మహిళా సమాఖ్య నాయకులు వామపక్షాల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు