విశాలాంధ్ర నందిగామ:-స్మార్ట్ మీటర్ల నియామక ప్రక్రియ వెంటనే నిలుపుదల చేయాలని పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వామపక్షా పార్టీలు సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వామపక్ష నాయకులు నందిగామ నియోజకవర్గ కార్యదర్శి చుండూరు సుబ్బారావు, సిపిఎం నాయకులు కటారపు గోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనైతికంగా చేస్తున్న స్మార్ట్ మీటర్ల బిగించే ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ స్మార్ట్ మీటర్లను పగలగొట్టామని నేడు అదే ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించడం చాలా దుర్మార్గమైన చర్య అని అంతేకాకుండా గతంలో బాదుడే బాదుడు పేరుతో అప్పటి ప్రభుత్వం వసూలు చేస్తున్న ట్రూ ఆఫ్ చార్జీలు రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు కోవాప్ చార్జీలు మరియు సుంకాల పేరుతో ప్రజలపై మరో 1150 కోట్లను మోపిందని అన్నారు కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు మరిచిపోయిందని ఎద్దేవా చేశారు అంతేకాకుండా స్మార్ట్ మీటర్ల వలన పీక్ స్టేజి ఒక విధమైన చార్జీలు వసూలు చేస్తారని ఎనిమిది వేల నుండి 13వేల వరకు వాయిదా పద్ధతిలో ప్రతినెలా చెల్లించాల్సి ఉంటుందని ఇక ప్రజలపై ఇది భారమని సెల్ ఫోన్ లాగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని దీనిని ప్రజలందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించాలని, అదాని కంపెనీ వ్యక్తులు వచ్చినప్పుడు వారిని నిలుపుదల చేసి ప్రజలు ప్రతిఘటించాలని తిరస్కరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కట్టా చామంతి మండల కార్యదర్శి మన్నే హనుమంతరావు షేక్ మౌలాలి బలుసుపాటి రాంబాబు సిపిఎం నాయకులు చనుమూల సైదులు షేక్ ఖాసిం పలువురు ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు…
స్మార్ట్ మీటర్ల ప్రక్రియ నిలుపుదల చేయాలని సిపిఐ,సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా
- Advertisement -
RELATED ARTICLES


