Sunday, December 7, 2025
Homeఆంధ్రప్రదేశ్హిందూపురంలో ఎఐఎస్ఎఫ్ బహిరంగ సభ – ప్రభుత్వంపై మండిపడ్డ ఎస్.ఎఫ్ నేతలు

హిందూపురంలో ఎఐఎస్ఎఫ్ బహిరంగ సభ – ప్రభుత్వంపై మండిపడ్డ ఎస్.ఎఫ్ నేతలు

- Advertisement -

విశాలాంధ్ర – హిందూపురం:రాష్ట్రవ్యాప్తంగా విద్యా రంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం నుంచి ప్రారంభమైన రాష్ట్రవ్యాప్త బస్సు జాతా మంగళవారం 21వ రోజు హిందూపురం పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా చర్చి గ్రౌండ్‌లో వందలాది మంది విద్యార్థుల సమక్షంలో బహిరంగ సభను జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, కార్యదర్శి శేషం మహేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సభకు ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు వేమయ్య యాదవ్, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వలరాజు, నాసర్ జీ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు బండి చలపతి, షాబీర్ భాష, ఫణీంద్ర, నాగభూషణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కుమార్, మస్తాన్, రాష్ట్ర మహిళా నాయకులు హారిక, మౌనిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాధవ్, యశ్వంత్, ప్రవీణ్, రాష్ట్ర సమితి సభ్యులు అమర్నాథ్, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం రాష్ట్రానికి గూగుల్ కంపెనీని తీసుకువచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నా, మరోవైపు పార్వతీపురం ప్రాంతంలో నీటి కొరతతో విద్యార్థులు మరణిస్తున్నా స్పందించడం లేదని మండిపడ్డారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర వ్యాపితంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పిపిపి పద్ధతిలో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలన్న ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 107, 108 జీవోలను రద్దు చేస్తామని యువగలంలో హామీ ఇచ్చిన నారా లోకేష్, ఇప్పుడు వైద్య విద్యను పూర్తిగా ప్రైవేటీకరిస్తున్నారని విమర్శించారు.అలాగే 6400 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, గతంలో మూతపడిన 4,500 ప్రభుత్వ పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని వారు కోరారు.ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టి ఫీజు నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో 3480 ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పెరిగిన ధరలకు అనుగుణంగా మేస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని, ప్రతి మండలంలో ఒక్క జూనియర్ కళాశాల, ప్రతి నియోజకవర్గంలో ఒక్క డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.బస్సు జాతా ముగిసిన అనంతరం విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జాతా నాయకులు అభి, చరణ్, శ్రీ సత్య సాయి జిల్లా నాయకులు అరవింద్, తేజ, గౌరీ శంకర్, చరణ్, సాయి, యశ్వంత్, కార్తీక్, అశోక్, లోకేష్, యాలాద్రి, కిరణ్, గణేష్, ఖలీమ్, అశోక్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు