Sunday, December 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిహిందూపురం పోలీసుల నిఘాలో.. చిక్కిన బైక్ దొంగలు

హిందూపురం పోలీసుల నిఘాలో.. చిక్కిన బైక్ దొంగలు

- Advertisement -

విశాలాంధ్ర – హిందూపురం :హిందూపురం పట్టణంలో ఇటీవల పెరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనాలపై కొంతకాలంగా పోలీసులు నిఘా ఉంచారు. ఎస్పీ యస్. సతీష్ కుమార్, డీఎస్పీ కెవి. మహేష్ పర్యవేక్షణలో హిందూపురం 1 టౌన్ సీఐ కె. రాజగోపాల్ నాయుడు, ఎస్‌ఐ శ్రీధర్, ఏఎస్‌ఐ మద్దిలేటి నేతృత్వంలోని పోలీసు బృందం మంగళవారం తెల్లవారుజామున గుడ్డం అండర్ బ్రిడ్జ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులను చూసి పారిపోబోయిన దుండగులను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అరెస్టయినవారు మహమ్మద్ గౌస్, షేక్ ఇస్మాయిల్, షేక్ అబ్దుల్ మరియు మరో నలుగురు ఉన్నారు. వీరి వద్ద నుండి దొంగిలించిన 20 ద్విచక్ర వాహనాలు, సుమారు ₹15 లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.అరెస్టయిన వారిని హిందూపురం జెఎఫ్‌సిఎం కోర్టుకు హాజరుపరచారు, మిగతా బాల దొంగలను అనంతపురం జువెనైల్ కోర్ట్ కు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు