విశాలాంధ్ర, కళ్యాణదుర్గం… తిరుపతి కి చెందిన న్యాయవాది ఎ. రాజశేఖర్‌పై పుత్తూరు కోర్టు ఆవరణలో జరిగిన దాడికి నిరసనగా మంగళవారం కళ్యాణదుర్గం న్యాయవాదులు కోర్టు విధులకు గైర్హాజయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. పుత్తూరు కోర్టు ఆవరణలో జరిగిన ఈ దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, న్యాయవాదుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి.పార్ధసారధి చౌదరి, కార్యదర్శి కె.శ్రీనివాసులు, కోశాధికారి బి.తిప్పేస్వామి, ఉపాధ్యక్షులు రామాంజనేయులు, న్యాయవాదులు వెంకటేశులు, కరణం తిప్పేస్వామి, దేవేంద్ర, పరిపూర్ణావతి, , హరి చక్రవర్తి, పట్టాభి, రవికుమార్, ముత్యాలప్ప, ఎర్రిస్వామి, దిలీప్, నారా హనుమంతరాయుడు, రామాంజనేయులు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.


