Thursday, January 15, 2026
Homeజిల్లాలుకర్నూలుమంటల్లో కాలిబూడిదైన లారీ

మంటల్లో కాలిబూడిదైన లారీ

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబళం సమీపంలో ఉన్న మాధవరం ప్రధాన రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. నాప బండల లోడుతో వెళుతున్న లారీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో వాహనం దగ్ధమైంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాండూరు నుంచి కేరళకు నాప బండల లోడుతో వెళుతుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు