విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం) : ఉరవకొండ పట్టణంలో సెంట్రల్ హైస్కూల్లో (1985-86) విద్యా సంవత్సరంలో ఏడవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక బెంగళూరులోని వెన్యూ రెస్టారెంట్లో ఘనంగా నిర్వహించారు.సెంట్రల్ హైస్కూల్లో చదివిన పూర్వ విద్యార్థి పార్థసారథి కూతురు పెళ్లి నిశ్చితార్థం కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు ఒకరిని ఒకరు కలుసుకొని వారి వారి పాత జ్ఞాపకాలను యోగక్షమలను కుటుంబాల పరిస్థితులను, అడిగి తెలుసుకున్నారు. ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన రోజుల్లో గత స్మృతులను నెమరు చేసుకున్నారు. పాఠశాల విద్యను అభ్యసించిన రోజులు ఎంతో విలువైన రోజులని ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు తమ మనోభావాలను వ్యక్తపరిచారు. 39 సంవత్సరాల తర్వాత పాఠశాలలో చదివిన విద్యార్థులు అందరూ కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు.


