విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : ఎస్సీ బాలికల వసతి గృహాల అభివృద్ధికి సంబంధిత ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాదేవి పేర్కొన్నారు. మండలంలో పరింపూడి గ్రామంలో ఉన్న వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహం శిధిలావస్థకు చేరుకుంటుందని సంబంధిత అధికారులు వసతి గృహ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. వసతి గృహాన్ని ఆమె గురువారం సందర్శించారు. వసతి గృహంలో ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహం లోని మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి అని ఆమె ఆరా తీశారు. వసతి గృహంలో గోడలు బీటలు వాచ్చి కాంపౌండ్ వాల్ చుట్టూ ఉన్న గోడ శిథిలవస్థకు చేరుకోవడం, గేటు పడిపోవడం, విద్యార్థిని లు వినియోగించే బాత్రూంలు తక్కువగా ఉండడంతో విద్యార్థినిలు అనేక అవస్థలు పడుతున్నారని ఆమె తెలుసుకున్నారు. కనీసం వసతి గృహానికి రంగులు కూడా లేకుండా శిధిలవస్థకు చేరుకోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా సంబంధిత అధికారులు వసతి గృహాలు పై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండటం సరికాదని అధికారులను హెచ్చరించారు. వసతి గృహాలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని ఆమె సంబంధిత అధికారులను కోరారు.


