Sunday, December 7, 2025
Homeజిల్లాలువిజయనగరంసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

- Advertisement -

విశాలాంధ్ర, నెల్లిమర్ల: జనసేన కూటమి ఎమ్మెల్యే లోకం నాగ మాధవి చేతుల మీదుగా పసుపులేటి భాను ప్రసాద్ తల్లిదండ్రులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేయడం జరిగింది. 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు భాను ప్రసాద్ ఆరోగ్యం బాగోక తీవ్ర స్థితికి చేరుకున్నారు. ఎన్నికల అనంతరం లోకం నాగ మాధవి కూటమి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, ఆమె ప్రత్యేక శ్రద్ధతో సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తును ముందుకు తీసుకెళ్లారు. రెండుసార్లు తిరస్కరించబడిన దరఖాస్తును పట్టుదలతో ముందుకు నెట్టి చివరికి ఆమోదం పొందేలా చేసిన ఎమ్మెల్యే మాధవి కృషి ప్రశంసనీయమని గ్రామస్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి నారాయణస్వామి, కొమ్మూరు నూకరాజు, బి. రాక నరేష్, గుడాల రమణ, వేళుపూరి బంగారి, దొండపాటి హరి, కొండక కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు