గుంటూరు జీజీహెచ్‌లో మరో మహిళ మృతి
రెండో జీబీఎస్ మరణంగా ధ్రువీకరించిన వైద్యులు
గుంటూరు సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో ఈ నెల 2న గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్) లక్షణాలతో చేరిన షేక్ గౌహర్ జాన్ అనే మహిళ బుధవారం మరణించారు. ఈ ఆసుపత్రిలో జీబీఎస్ సంబంధిత మరణం ఇది రెండవదని వైద్యులు ధ్రువీకరించారు. ఇంతకు ముందు, ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ కూడా ఇదే ఆసుపత్రిలో జీబీఎస్‌కి చికిత్స పొందుతూ మరణించింది. గుంటూరు జీజీహెచ్‌లో మరికొందరు జీబీఎస్ రోగులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో జీబీఎస్ కేసులు పెరుగుతున్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్య అధికారులు, మంత్రులు జీబీఎస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నప్పటికీ, రాష్ట్రంలో జీబీఎస్ కేసులు క్రమంగా పెరుగుతుండటం, రెండు మరణాలు సంభవించడంతో ప్రజల్లో కలకలం రేగుతోంది.
ఏపీలో జీబీఎస్‌తో మరో మరణం నమోదు
RELATED ARTICLES