ఒడిస్సా కార్యదర్శి చలపతితో సహా 16మంది హతం
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 16 మంది మావోయిస్టులు మృతిచెందారు. మరణించిన వారిలో ఒడిస్సా రాష్ట్ర కార్యదర్శి చలపతితో సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. సోమవారం సాయంత్రం నుంచి గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గరియాబంద్ అటవీ ప్రాంతంలో పోలీసులకు నక్సల్స్ తారసపడ్డారు. దీంతో ఇరుపక్షాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మరణించారు. అదేవిధంగా నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మృతిచెందగా, కోబ్రా బెటాలియన్‌కు చెందిన ఓ జవాన్ గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌లో గరియాబంద్ డీఆర్‌జీ, ఒడిశా ఎస్‌వోజీ దళాలు, 207 కోబ్రా బెటాలియన్, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.