మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పట్టణ అభివృద్ధి దిశగా మరొక కీలక అడుగు కావడం జరిగిందని, కదిరి గేటు నుండి గోరీల వరకు గ్రావెల్ పరచడం ప్రారంభం కావడం శుభదాయకమని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు, ధర్మవరం పట్టణంలోని కదిరి గేటు నుండి గోరీల వరకు రహదారి మీద గ్రావెల్ పరచే పనులు ప్రారంభమయ్యాయి అయ్యాయని,ఈ పనులు రోడ్లు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అని తెలిపారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ పట్టణంలోని ప్రతి ప్రాంతంలో రహదారులు, డ్రైనేజీ, ఫ్లైఓవర్‌లు, పౌర సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కదిరి గేటు నుండి గోరీల వరకు ఆర్ అండ్ బి శాఖ ద్వారా జరుగుతున్న ఈ గ్రావెల్ పనులు పూర్తయిన తర్వాత ప్రజలకు ఎంతో సౌకర్యం కలుగుతుంది అన్నారు. కదిరి గేటు వద్ద నిర్మించబోయే కొత్త ఫ్లైఓవర్‌కు సంబంధించిన పలు సాంకేతిక, పరిపాలనా అంశాలు తుది దశకు చేరుకున్నాయి అన్నారు. త్వరలోనే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి అన్నారు. ఈ ఫ్లైఓవర్ పూర్తయితే ధర్మవరం పట్టణ రవాణా వ్యవస్థ మరింత సులభతరం అవుతుంది అన్నారు.ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది అన్నారు.
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన ధర్మవరం క్రీడాకారుల సన్మానం!.. మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు.
35వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ధర్మవరం నుండి ఎంపికైన ప్రతిభావంతులైన క్రీడాకారులను ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు మాట్లాడుతూ ధర్మవరం పట్టణం క్రీడా రంగంలో రాష్ట్ర స్థాయికి ప్రతినిధులుగా నిలుస్తున్న క్రీడాకారులు ఉండడం మనందరికీ గర్వకారణం అని తెలిపారు. యువత క్రీడలలో ప్రతిభ కనబరుస్తే, అది పట్టణం, జిల్లా మాత్రమే కాకుండా రాష్ట్రానికి గౌరవం తెస్తుంది అన్నారు. క్రీడలు క్రమశిక్షణ, ధైర్యం, పట్టుదల వంటి విలువలను పెంపొందిస్తాయి అన్నారు. మీ అందరి కృషి, పట్టుదల, క్రమశిక్షణ కారణంగానే ఈ స్థాయి వరకు రావడం జరిగిందన్నారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా మెరుగైన ప్రదర్శన చేసి, ధర్మవరం పేరును మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. అలాగే ఆయన తల్లిదండ్రులు, కోచ్‌లు, క్రీడాశాఖ అధికారులు, శిక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. యువత క్రీడలతో పాటు సమాజ సేవలో కూడా ముందుండాలి అన్నారు. బీజేపీ ప్రభుత్వం క్రీడా మైదానాల అభివృద్ధి, క్రీడా సామగ్రి సరఫరా, ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సాహక పథకాలు అందించే దిశగా కట్టుబడి ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం పట్టణానికి చెందిన కబడ్డీ క్రీడాకారులు బి. నవ్య, జి.ఎస్. సాజియా, హిమబిందు, శాంతి, మహమ్మద్ ఆసిఫ్, ఏసు రాజు, నవదీప్, నూరు మొహమ్మద్, 35వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన సందర్భంగా శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో కబడ్డీ కోచ్ పృద్వి, బీజేపీ నాయకులు పోతుకుంట రాజు, లక్ష్మీనారాయణ, క్రీడాభిమానులు, తల్లిదండ్రులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.


