Sunday, December 7, 2025
Homeజిల్లాలుఅనకాపల్లిశ్రీ నూకాంబిక సన్నిధిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

శ్రీ నూకాంబిక సన్నిధిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

- Advertisement -

విశాలాంధ్ర- అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెంలో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారిని బుధవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమ్మవారి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి వచ్చిన ఆయనకు మాజీమంత్రి స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీలు (గొల్ల బాబు) ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ఆయనను ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, మాడుగులు శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి,తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, ఏపీ యుఎఫ్ ఐ డిసి చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, ఆలయ సహా కమిషనర్ కే ఎల్ సుధారాణి, మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీష్, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్, దాడి రవికుమార్ పొలిమేర స్వాతి, మారిశెట్టి శంకర్రావు,కాండ్రేగుల రాజారావు ,మజ్జి జానకి,కొడుకుల శ్రీకాంత్,వడ్డాది మంగ,కోనేటి సూర్యలక్ష్మి,
యర్రవరపు సంతోష్ కుమారి,కూటమి పార్టీ నాయకులు భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు