మతిస్థిమితం లేని వృద్ధుడికి ఆహారం, నీరు అందజేసిన కొండూరు రామాంజినేయులు……
విశాలాంధ్ర -పామిడి : పామిడి పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మతిస్థిమితం లేని గుర్తుతెలియని వృద్ధుడు తీవ్ర బలహీన స్థితిలో కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే మానవతా దృక్పథంతో ముందుకొచ్చిన కొండూరు రామాంజినేయులు వృద్ధుడికి నీరు, ఆహారం అందజేసి ఆదర్శప్రాయమైన సేవా భావాన్ని ప్రదర్శించారు.తీవ్ర బలహీనతతో ఉన్న వృద్ధుడికి అక్కడే ప్రాథమిక చికిత్స అందించగా, తరువాత మరింత వైద్య సహాయం కోసం పామిడి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది చర్యలు ప్రారంభించారు.వృద్ధుడి పట్ల చూపిన సానుభూతి, సేవా తత్పరత పట్ల పామిడి ప్రజలు రామాంజినేయులను అభినందించారు. మానవత్వం ఇంకా సజీవంగా ఉందని ఈ సంఘటన మరోసారి నిరూపించింది…….


