Wednesday, November 19, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరాష్ట్రస్థాయి పోటీలకు గొట్లూరు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు

రాష్ట్రస్థాయి పోటీలకు గొట్లూరు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం; మండల పరిధిలోని గొట్లూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు పట్టణములోని ఆర్డిటి క్రీడామైన రమనందు జరిగిన శ్రీ సత్య సాయి జిల్లా స్థాయి సబ్ జూనియర్ కబడి బాలబాలికల జట్టుల ఎంపికలో పాల్గొని ప్రతిభ ఘనపరిచి జిల్లా జట్టుకు ముగ్గురు విద్యార్థులు స్టాండ్ పైగా ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ జగన్నాథం ఫిజికల్ డైరెక్టర్ రమేష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంపికైన ముగ్గురు విద్యార్థులలో కుమార్ పదవ తరగతి, జాకీర్ పదవ తరగతి, మహమ్మద్ తొమ్మిదవ తరగతి ఉన్నారన్నారు. అదేవిధంగా స్టాండ్ బాయ్స్ గా కె విజయ్ పదవ తరగతి వ్యూహిత వర్షిని పదవ తరగతి ఎంపికైనారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ హెడ్మాస్టర్ జగన్నాథం, ఫిజికల్ డైరెక్టర్ రమేష్ బాబు, పాఠశాల కమిటీ, తల్లిదండ్రులు, పాఠశాల విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఎంపికైన విద్యార్థులు కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి కబాడీ టోర్నమెంటులో శ్రీ సత్యసాయి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు