రాష్ట్రవ్యాప్తంగా 95 సెంటర్లలో నిర్వహణ
హైదరాబాదులోను సెంటర్ ఏర్పాటు
పరీక్షలు రాయనున్న 33,751 మంది విద్యార్థులు
పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసిన జేఎన్టీయూ అధికారులు
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఏపీ ఈసెట్ పరీక్ష 23న జరగనుంది. సెట్ చైర్మన్ ఉపకులపతి ప్రొఫెసర్ సుదర్శన్ రావు, రిజిస్టార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్, ప్రొఫెసర్ భానుమూర్తి పేర్కొన్నారు. మంగళవారం జేఎన్టీయూ ఆర్యభట్టు ఆడిటోరియంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేశామని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమన్నారు. పరీక్ష కేంద్రాలలోకి గంట ముందే అనుమతిస్తామని తెలిపారు.అనంతపురం జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 33751 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పాలిటెక్నిక్ అనంతరం బీటెక్ మూడవ సంవత్సరంలో ప్రవేశాలను ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్ష మొత్తం రెండు సెషన్స్ లో జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు తిరిగి రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 95 సెంటర్లలో ఈ పరీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాదులో కూడా విద్యార్థుల సౌకర్యార్థం ఒక సెంటర్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజన జేఎన్టీయూ ఎనిమిదవ సారి ఈ పరీక్ష నిర్వహిస్తోంది. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి ఉదయం ఏడున్నర గంటలకే అనుమతిస్తారు.ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతించరు. జిల్లాలోని ఏడు కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనున్నదని విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని సూచించారు.


