Saturday, May 17, 2025
Homeజిల్లాలుఅనంతపురంఉన్నత విద్యా సంస్కరణలకు నిలయంగా ఏపీ : గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్

ఉన్నత విద్యా సంస్కరణలకు నిలయంగా ఏపీ : గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్

కనుల విందుగా పట్టాల పండుగ.: జేఎన్టీయూ 14 వ స్నాతకోత్సవం..

గౌరవ డాక్టరేట్ను లారస్ ల్యాబ్స్ అధినేత డాక్టర్ సత్యనారాయణ చావాకు 

గవర్నర్ చేతుల41 మందికి  గోల్డ్ మెడల్స్.

విశాలాంధ్ర- జేఎన్టీయూ: ఉన్నత విద్యా సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ నిలయంగా ఉంటుందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు .జవహర్లాల్ నెహ్రూసాంకేతిక విశ్వవిద్యాలయం శనివారం (అనంతపురం)14 స్నాతకోస్తవం ఎన్టీఆర్ ఆడిటోరియంలో కనుల విందుగా పట్టాల పండుగ కార్యక్రమాన్ని వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ ఎస్ కృష్ణయ్య నిర్వహించారు. జేఎన్టీయూ ప్రగతి నివేదికను వీసీ తెలియజేశారు. ఐఐటి కాన్పూర్ సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఎంఆర్ మాధవ్ (మాజీ ఉద్యోగి), జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం గౌరవ డాక్టరేట్ను లారస్ ల్యాబ్స్ అధినేత డాక్టర్ సత్యనారాయణ చావాకు  కులపతి, గవర్నర్ అబ్దుల్ నజీర్ అందజేశారు. 2023-24 సంవత్సరంలో జేఎన్టీయూ, అనుబంధ కళాశాలల్లో బంగారు విద్యార్థులు..పూజిత్కుమార్రెడ్డి ఏకంగా 6 బంగారు పతకాలు, విద్యార్థిని హరిత 3, విద్యార్థి ఫహద్ అలీ 3, వైష్ణవి 2 పత కాలు సాధించారు.  41 మంది బంగారు పతకాలు. వర్సిటీ పరిధిలో 13 మందికి, పులివెందుల జేఎన్టీయూలో ఆరుగురు, అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఆరుగు రికి ఎండోమెంట్, బంగారు పతకాలు 16 మందికి గోల్డ్ మెడల్స్ ను విద్యార్థులకు బంగారు పతకాలును గవర్నర్ ఇచ్చారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. జేఎన్టీయూ విశ్వవిద్యాలయం (అనంతపురం).ఆంధ్రప్రదేశ్‌లో అత్యుత్తమ సాంకేతిక విశ్వవిద్యాలయంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.. విజ్ఞానం, ఆవిష్కరణల, పరిశోదాత్మక విద్య బోధనను అందిస్తూ విద్యార్థుల జీవితాలలో ఉజ్వల ప్రగతికి నాంది పలుకుతూ..యువ ఇంజనీర్లను సమాజ అభ్యున్నతకు తోడ్పాటును అందిస్తూ ఉందన్నారు.స్వర్ణ ఆంధ్ర 2047 అనేది వికసిత్ భారత్ యొక్క జాతీయ మిషన్‌ను పూర్తి చేసే రాష్ట్ర స్వంత విజన్.ఏపీ ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా , పెట్టుబడులకు ప్రాధాన్యతనిచ్చే గమ్యస్థానంగా భావించే భావనను సాధించడానికి ఏపీ రోడ్‌మ్యాప్,. స్వర్ణ ఆంధ్రలో విద్య ఒక ప్రధాన స్తంభం, నైపుణ్యాభివృద్ధి కళాశాలలు, ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.జాతీయ విద్యావిధానంతోవిశ్వవిద్యాలయాలలో నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు, సౌకర్యవంతమైన ప్రవేశ , నిష్క్రమణ ఎంపికలు, బహుళ-క్రమశిక్షణా కోర్సులు,ఆధారిత క్రెడిట్ వ్యవస్థలను ప్రవేశపెట్టింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ,తయారీ, ఆరోగ్య సంరక్షణ , సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ,పరిశ్రమ అనుసంధానం గా వృత్తి శిక్షణ , ఉపాధి నైపుణ్యాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.
సమాజానికి తిరిగి ఇవ్వాలని ప్రధానమంత్రి స్టార్టప్‌లను కోరారు మరియు వారి అంతర్దృష్టులను విద్యార్థులతో పంచుకున్నారు. జేఎన్టీయూ అనంతపురం స్టార్టప్‌లకు ఆవిష్కరణ కేంద్రంగా నిలిచేలా కృషి చేయాలని పేర్కొన్నారు.
అనంతరం రాష్ట్ర గవర్నర్ ను శాలువాతో సత్కరించి మెమెంటోని వైస్ ఛాన్స్లర్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పి.జగదీష్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లు, జేఎన్టీయూ రిజిస్ట్రార్ కృష్ణయ్య, ఎంఎల్సి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డా.పల్లె రఘునాథ్ రెడ్డి, ఆర్డీవో కేశవ నాయుడు, యూనివర్సిటీ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు