విశాలాంధ్ర – కొవ్వూరు : విధి నిర్వహణ లో కనబరిచిన ప్రతిభకు పట్టం లభించింది. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఉత్తమ అధికారి గా కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ముఖ్యంగా కొవ్వూరు డివిజన్లో ఉన్న ఇసుక ర్యాంపులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఇసుక అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించి ఉన్నతాధికారుల మన్నలలను అలాగే తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను తనదైన శైలిలో పరిష్కరించడం తో ప్రజల అభిమానం కూడా అందుకున్నారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ముందుండి అవి సక్రమంగా అర్హులకు అందే విధంగా క్షేత్రస్థాయికి వెళ్లి సేవలందించారు. ఈ అవార్డు అందుకున్న ఆర్డీవో ను డివిజన్ లోని ఎమ్మార్వోలు, ఉద్యోగులు సిబ్బంది అభినందించారు. రాణీ సుస్మిత కు ఉత్తమ అధికారి అవార్డ్ ఇవ్వడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సరైన అధికారికి ఉత్తమమైన అవార్డు అంటున్నారు.
ప్రతిభకు పట్టం.. ఉత్తమ అధికారి అవార్డు
- Advertisement -
RELATED ARTICLES


