- Advertisement -
టూ టౌన్ సీఐ రెడ్డప్ప
విశాలాంధ్ర ధర్మవరం; హైకోర్టు ఆదేశాలు, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టూ టౌన్ పరిధిలో గల ఇందిరమ్మ కాలనీ కేతిరెడ్డి కాలనీ, ఎల్ వన్, ఎల్ టు, ఎల్ 3 ప్రదేశాలలో గోడలపై పోస్టర్లు, ముఖ్యమైన ప్రధాన కూడలి వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని రెడ్డప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ కూడా చట్టపరిధిలో జీవించాలని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తెలిపారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ పై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


