Wednesday, February 18, 2026
Homeజిల్లాలుఅనకాపల్లిహెల్మెట్ వినియోగంపై అవగాహన ర్యాలీ

హెల్మెట్ వినియోగంపై అవగాహన ర్యాలీ

- Advertisement -

నర్సీపట్నం; జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి రమేష్ ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగం ఆవశ్యకతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అలా చేయడం ద్వారా ప్రాణనష్టం తగ్గించవచ్చని పేర్కొన్నారు.
రహదారి నియమాలు ప్రతి ఒక్కరి కర్తవ్యం అని, వాటిని పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చని తెలిపారు. ర్యాలీ సందర్భంగా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు, ప్రమాదాల నివారణ మార్గాలు, డ్రైవింగ్ సురక్షా నిబంధనలు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం రహదారి భద్రత నియమాలు పై ప్రతిజ్ఞ చేయించారు .
ఈ కార్యక్రమంలో ఆర్‌టీఓ కార్యాలయ ఇన్స్పెక్టర్లు వెంకట్రావు, అప్పన్న, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ కల్పన తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు