విశాలాంధ్ర – తాళ్లపూడి : రాష్ట్రంలో ఇసుక, మద్యం ఇలా అన్నింటా దోచుకో దాచుకో అన్న చందంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని కొవ్వూరు నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. తాళ్లపూడి మండలంలోని పోచవరంలో ఆదివారం బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కొవ్వూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ , మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు , మండల నాయకులు కలిసి గ్రామంలో బాబు షూరిటీ…. మోసం గ్యారంటీ పై రచ్చబండ నిర్వహించి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకుని వచ్చి రాష్ట్రానికి ఆదాయం లేకుండా చేసిందని అన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఏటా ఆదాయం వచ్చేదని అన్నారు. సూపర్ సిక్స్ ఫథకాలు అమలు చేకుండా ఉండడం మోసం కాదా అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జొన్నకూటి పోశిరాజు, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కాకర్ల వెంకటేశ్వరావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కంఠమణి రమేష్‌బాబు, రాష్ట్ర రైతువిభాగం కార్యదర్శి పరిమి సోమరాజు, రాష్ట్ర ఎస్సీ సెల్‌కార్యదర్శి పిట్టా శ్రీనివాస్, గ్రామకమిటీ అధ్యక్షుడు మద్దుకూరి దొరబాబు, వైస్ ఎంపీపీ కోదాటి కనకయ్య, పార్టీ ముఖ్య నాయకులు తోట రామకృష్ణ, వంబోలు పోశిబాబు, ఉప్పలపాటి మోహన్, గండి రాంబాబు, వల్లభశెట్టి శ్రీనివాస్, మమత, కవలనాగేశ్వరరావు తదితర నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పోచవరం లో బాబు ష్యురిటీ, మోసం గ్యారెంటీ
- Advertisement -
RELATED ARTICLES


