ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన రామ్ గోపాల్ వర్మపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 కేసులు నమోదయ్యాయి. ఒంగోలు పోలీసులు ఆయనకు రెండు సార్లు నోటీసులు జారీ చేసినా ఆయన విచారణకు హాజరు కాలేదు. అంతేకాదు, అరెస్ట్ భయంతో ఆయన అజ్ఞాతంలోకి వెల్లిపోయారు. వర్మ కోసం 6 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళలో పోలీసులు గాలిస్తున్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని నిన్న ఒక వీడియోను వర్మ విడుదల చేశారు. మరోవైపు వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తుందా? లేదా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.
నేడు తమిళనాడును తాకనున్న ఫెంగల్ తుపాను.. స్కూళ్లు మూత
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి నేడు తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ తుపానుకు ాఫెంగల్్ణగా నామకరణం చేసింది. సైక్లోన్ ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మయిలాదుతురై, తిరువారూర్, నాగపట్టణం, చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్‌పేట్, కడలూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎంసీ) పేర్కొంది. దీంతో చెన్నై, చెంగల్‌పట్, కడలూర్, మయిలాదుతురై ప్రాంతాల్లో ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. నాగపట్టణం, మయిలాదుతురై, తిరువారూర్ ప్రాంతాల్లోనూ తుపాను ప్రభావం చూపే అవకాశం ఉండడంతో స్కూళ్లు, కాలేజీలు మూతపడనున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా రేపటి వరకు ఓ మాదిరి వర్షాలతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కడలూర్, మయిలాదుతురైలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ నిన్ననే రెడ్ అలెర్ట్ జారీచేసింది. చెన్నైలో నేటి వరకు ఎల్లో అలెర్ట్ జారీచేయగా, పొరుగున ఉన్న కాంచీపురం, తిరువళ్లూర్, చెంగల్‌పట్‌లకు బుధ, శనివారాల మధ్య ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది.
ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ
ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం భేటీ అయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో పవన్ సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన అంశాల పైన చర్చించారు. ఇదే సమయంలో పార్లమెంట్ కు వెళ్లిన పవన్ కల్యాణ్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు సమస్యలపై 20నిమిషాలు చర్చించారు.
హిజ్బుల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సమ్మతి
ఇజ్రాయెల్ -హిజ్బుల్లా మద్య కాల్పుల విరమణ
కాల్పుల విరమణపై ఎక్స్ వేదికగా వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్
ఇజ్రాయెల్ ఉ హిజ్బుల్లా మధ్య కాల్పులకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ాశుభవార్త. నేను ఇజ్రాయెల్ ఉ లెబనాన్‌ల ప్రధానులతో మాట్లాడాను. టెల్‌అవీవ్ ఉ హిజ్బుల్లాల మధ్య విధ్వంసకర ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని ఆమెరికా చేసిన ప్రతిపాదనను వారు అంగీకరించారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయం్ణ అని బైడెన్ పేర్కొన్నారు.
ఆమెరికా దౌత్యంతో లెబనాన్‌లో యుద్ధానికి ముగించడానికి మార్గం సుగమమయింది. ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం ఆమోదించడంతో లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆగిపోయాయి. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య జరిగిన యుద్ధంలో లెబనాన్‌లో సుమారు 3,800 మంది మరణించగా, 16వేల మందికిపైగా గాయపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్ నుంచి వైదొలగవలసి ఉండగా, లెబనాన్ సైన్యం తమ సరిహద్దులోని భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకుంటుంది.
ఇక ఈ కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. రానున్న రోజుల్లో గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలకు ఆమెరికా, టర్కీ, ఈజిప్ట్, ఖతార్ దేశాల నాయకులతో చర్చలు జరుపుతామన బైడెన్ వివరించారు. కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షించారు. లెబనాన్ తాత్కాలిక ప్రధాని నజీబ్ మికాలి ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. మరో వైపు ఈ పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యూహు కూడా స్పందించారు. ఈ ఒప్పందం ఎన్ని రోజులు ఉంటుందనేది లెబనాన్ పైనే ఆధారపడి ఉందన్నారు. తాము ఒప్పందాన్ని అమలు చేస్తామని, కానీ ఉల్లంఘనలు జరిగితే మాత్రం బలంగా ప్రతిస్పందిస్తామని పేర్కొన్నారు.
మణికొండలో అగ్నిప్రమాదం ..9వ అంతస్తు నుంచి ఎగసిపడిన మంటలు
హైదరాబాద్ శివారు మణికొండ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. పుప్పాలగూడలోని ఈఐపీఎల్ అపార్ట్‌మెంట్ 9వ అంతస్తులో మంటలు చెలరేగడంతో అపార్ట్‌మెంట్ వాసులు భయంతో పరుగులు తీశారు. ఈ అపార్ట్‌మెంట్‌లోని తొమ్మిదో ఫ్లోర్‌లో గల ఒక ప్లాట్‌లో మూడు రోజుల క్రితం గృహప్రవేశం జరిగింది. ఆ సందర్భంగా ఫ్లాట్‌లో వెలిగించిన దీపం బుధవారం కిందపడటంతో మంటలు అంటుకున్నాయని సమాచారం. ఆపార్ట్‌మెంట్ వాసుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫ్రాన్స్‌లో సామూహిక అత్యాచార ఘటన.. ప్రతిష్ఠాత్మక లౌవ్రే పిరమిడ్ వద్ద వేలాదిమంది మహిళల టాప్‌లెస్ నిరసన!
లైంగిక హింస, అసమానతలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో వేలాదిమంది మహిళలు, పురుషులు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా ప్రతిష్ఠాత్మక లౌవ్రే పిరమిడ్ ముందు మహిళలు టాప్‌లెస్‌గా ప్రదర్శన నిర్వహించారు. లైంగిక దాడులు, అసమానతలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. లైంగిక నేరాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని, పునరుత్పత్తి హక్కులను రక్షించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ామహిళలపై యుద్ధాలు ఆపండి్ణ, ామహిళలకు జీవన స్వేచ్ఛ కల్పించండి్ణ అని నినదిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. మహిళల నిరసన ప్రదర్శనను పోలీసులు నిశ్శబ్దంగా తిలకించారు తప్పితే అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. గిసెల్ పెలికాట్ అనే మహిళపై ఆమె మాజీ భర్త సహా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. లైంగిక హింసకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. కాగా, మహిళలకు మద్దతుగా పురుషులు కూడా ఈ నిరసన ప్రదర్శనల్లో పాలు పంచుకున్నారు. లైంగిక ఆధారిత హింసపై సమష్టిగా పోరాడాల్సిన బాధ్యత అందిరిపైనా ఉందని ఈ సందర్భంగా వారు నొక్కి చెప్పారు.
లక్ష అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కార్ల మైలురాయికి చేరిన టీకేఎం
బెంగుళూరు: టొయోటా కిర్లోస్కర్ మోటర్ (టికెఎం) తాజాగా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ భారతదేశంలో 1,00,000-యూనిట్ అమ్మకాల మైలురాయిని అధిగమించిందని ప్రకటించింది. ఈ విజయం బి-ఎస్యువి బలమైన మార్కెట్ అంగీకారాన్ని, హైబ్రిడ్ టెక్నాలజీకి పెరుగుతున్న భారతీయ కస్టమర్ల ఆదరణను నొక్కి చెబుతుంది. జూలై 2022లో విడుదల చేయబడిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టొయోటా ప్రపంచ-స్థాయి హైబ్రిడ్ సాంకేతికతను డైనమిక్ డిజైన్, ప్రీమియం సౌలభ్యం,అసాధారణమైన పనితీరుతో సజావుగా మిళితం చేస్తుంది. ఇది మూడు పవర్‌ట్రెయిన్‌లలో లభిస్తుంది- సెల్ఫ్-చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్‌హెచ్‌ఈవీ, నియో డ్రైవ్ మరియు సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌లు.
డిఫెండర్ జర్నీ మూడో ఎడిషన్ ప్రారంభం
ముంబయి: ప్రతిష్టాత్మకమైన డిఫెండర్ జర్నీస్ మూడో ఎడిషన్ ప్రారంభమైంది. ‘డిఫెండర్ జర్నీస్’ పేరుతో నిర్వహించే ఈ రైడ్… నవంబర్ 2024 నుంచి భారతదేశం మొత్తం 21 ప్రత్యేక ప్రాంతాల్లో జరుగుతుంది. డిఫెండర్ ఎస్‌యూవీలలో ఇది మొదటి-రకం, ఏకైక లగ్జరీ, సెల్ఫ్-డ్రైవ్, అనుభవపూర్వక ప్రోగ్రామ్. డిఫెండర్ వెహికల్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఆఫ్-రోడ్ వెహికల్. ఈ వెహికల్ ద్వారా భారతదేశంలోని అత్యంత సుందరమైన ప్రదేశాల అన్వేషించే అద్బుతమైన ప్రయాణమే ఈ డిఫెండర్ జర్నీస్ కార్యక్రమం. ఈ డిఫెండర్ జర్నీస్ లో ప్రతీ ప్రయాణం ఆలోచనాత్మకంగా రూపొందింది. ఈ ప్రయాణంలో మీకు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, విభిన్న సంస్కృతులతో ముఖాముఖి, నోరూరించే వంటకాలు, ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ స్టేలు ఉంటాయి. కూర్గ్ లాంటి అద్భుతమైన కళ్లు తిప్పుకోనివ్వని సుందర దృశ్యాల నుంచి సువిశాలమైన తీర ప్రాంతాల వరకు లేదా హిమాలయాలలోని మంచుతో కప్పబడిన శిఖరాల వరకు, అలాగే థార్ ఎడారిలో ఉండే ఇసుక తిన్నెలు… ఇలా ప్రతీ ప్రయాణం అద్భుతంగా, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయబడిరది.
ఈప్యాక్ ప్రి ఫ్యాబ్ నూతన ప్రమాణాలు
మంబట్టు (ఏపీ): భారతదేశంలోని ప్రముఖ ప్రీ-ఇంజనీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) తయారీదారులలో ఒకరైన ఈ
ప్యాక్ ప్రిఫ్యాబ్ , కేవలం 150 గంటల రికార్డు సమయంలో భారతదేశపు అత్యంత వేగవంతమైన నిర్మాణాన్ని చేయటం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లోని మంబట్టులో పూర్తయిన ఈ ప్రాజెక్ట్, వినూత్నమైన, వేగవంతమైన నిర్మాణం పట్ల ఈ ప్యాక్ ప్రిఫ్యాబ్ నిబద్ధతకు నిదర్శనం. మొత్తం 151,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం పూర్తిగా అధునాతన ప్రిఫ్యాబ్రికేషన్, పీఈబీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబడిరది. ఈ ప్యాక్ ప్రిఫ్యాబ్ వేగవంతమైన పురోగతిని సాధించడానికి ప్రతి దశ నిర్మాణాన్ని నిశితంగా ప్లాన్ చేసింది. ప్రాథమిక నిర్మాణం 48వ గంటకు పూర్తయింది, ఆ తర్వాత 90వ గంటకు రూఫింగ్ చేయబడిరది మరియు 120వ గంటకు క్లాడిరగ్ చేయబడిరది, నిర్ణీత కాలక్రమంలో పూర్తిగా పనిచేసే భవనం తీర్చిదిద్దబడిరది.
హింద్వేర్ వారి ‘’బిల్డ్ ఎ టాయిలెట్, బిల్డ్ హర్ ఫ్యూచర్’ కార్యక్రమం
ముంబయి: భారతదేశపు ప్రముఖ బాత్వేర్ బ్రాండ్ హింద్వేర్ లిమిటెడ్ వారు తమ ‘‘బిల్డ్ ఎ టాయిలెట్, బిల్డ్ హర్ ఫ్యూచర్’’ కార్యక్రమం ద్వారా యువతులను శక్తివంతం చేయడానికి మరియు వారి కమ్యూనిటీలను ఉద్ధరించడానికి వారి మిషన్ కొనసాగిస్తున్నారు. 2020లో ‘హైజీన్ దట్ ఎంపవర్స్’ సిఎస్‌ఆర్ ప్రయత్నంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ‘డేర్ టు డ్రీమ్’ థీమ్‌తో కొత్త కోణాన్ని తీసుకువచ్చింది. బాలికలు పాఠశాలలో కొనసాగేలా, వారి కలలను నిజం చేసుకొని ఉజ్వల భవిష్యత్తును నిర్మించడానికి సురక్షితమైన మరియు అందుబాటులో ఉన్న శానిటేషన్‌ని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో తగినంత శానిటేషన్ సౌకర్యాలు లేకపోవడం ఒక క్లిష్టమైన సమస్యగా ఉంది. పరిశుభ్రమైన, హైజీనిక్ పారిశుద్ధ్య సౌకర్యాలకు అందించడానికి హింద్వేర్ ‘బిల్డ్ ఎ టాయిలెట్, బిల్డ్ హర్ ఫ్యూచర్’ కార్యక్రమంలో భాగంగా పుణెకు చెందిన ఎన్జీవో మానస్ ఫౌండేషన్, స్థానిక కమ్యూనిటీలతో చేతులు కలిపింది.