Thursday, February 6, 2025
Home Blog Page 141

ఐక్యతతోనే అన్ని విధాలా అభివృద్ధి

-బోరంపల్లి ఆంజనేయులు

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : ఐక్యతతోనే కురుబలు అన్ని విధాలా అభివృద్ధి చెబుతారని కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు అన్నారు. రేపు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న భక్త కనకధాశ జయంతి సందర్భంగా రాప్తాడులో శనివారం కురుబలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమాజంలో ఎక్కువగా ఉన్న కుల వివక్షతను వ్యతిరేకించి సామాజిక సమానత్వం కోసం పోరాడాడన్నారు. తన స్వరకల్పన ద్వారా భక్తి, ఆధ్యాత్మికత అందరికీ అందుబాటులో ఉండాలని నొక్కి చెప్పి కులాల అడ్డుగోడలను చేధించి ఐక్యతను పెంపొందించడానికి కృషి చేశాడన్నారు. అనంతపురం, చిత్తూరు, కర్నూలులో అత్యధికంగా ఉన్న కురుబలు ఐక్యతగా ఉంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా రాణించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కులవృత్తిని కాపాడుకునేందుకు కృషి చేద్దామన్నారు. కురుబలు ఏ పార్టీలో ఉన్నా రాజకీయంగా ఎదగడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు వశికేరి శివ, నియోజకవర్గ అధ్యక్షుడు బిల్లే నరేంద్ర, టీడీపీ కన్వీనర్ పంపు కొండప్ప, గోనిపట్ల శీనా, ఆకుతోటపల్లి రాగే మురళీ, మూలింటి బీరన్న, గంగలకుంట కిష్ట, రెబ్బాల శీనా, గేట్ సత్తి, బోగినేపల్లి వెంకటేష్, కొండూరు బీరన్న, రాగే రామకృష్ణ, దండు నరేంద్ర, గవ్వల మహేష్, కరే ప్రసాద్, బుల్లె నగేష్, తదితరులు పాల్గొన్నారు.

బడి శుభ్రంగా వుంటేనే, సమాజం పరిశుభ్రంగా వుంటుంది….

విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : సమాజం బాగుపడాలంటే బడి పరిశుభ్రంగా ఉండాలని చోడవరం ఎంపీడీవో ఆంజనేయులు అన్నారు స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాలతో కే కాలనీ ఎంపీ యూపీ స్కూల్ చైర్మన్ నేమాల హరి ఆధ్వర్యంలో పాఠశాలలో శనివారం స్వచ్చభారత్ కార్యక్రమం చేపట్టారు పాఠశాలలో జంగిల్ క్లియరెన్స్ తో విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమంలో భాగంగా కె.కాలనీ పాఠశాల, ఇందిరా గాంధీ పార్కు వద్ద కాలువల వెంబడి శుభ్రం చేశారు. దీని వల్ల దోమలు వృద్ధి తగ్గి విధ్యార్ధులు, ప్రజలు ఆరోగ్యంగా ఉంటార ఉంటారని ఎంపీడీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో కె. కాలనీ స్కూల్ హెచ్.ఎం. గొర్లి శ్రీనివాసరావు, ఈ.ఓ.ఆర్.డి. ఓ.మహేష్, ఈవో నారాయణరావు, ఏ.పి. రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు, గోవాడ సుగర్స్ మాజీ చైర్మన్ గూనూరు మల్లు నాయుడు, మాజీ ఎంపీపీ గూనూరు పెదబాబు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ దేవరపల్లి వెంకటప్పారావు, ఎంపీటీసీ పాలేం నాయుడు, వార్డ్ మెంబర్లు నేమాల ధనలక్ష్మి, టీ.శ్రీనివాస్ మరియు టీడీపీ నాయకులు,సకురు కోటేశ్వరరావు, తాడి పనసరెడ్డి, గునూరు ప్రభాకర్, ద్వారపురెడ్డి శ్రీనివాసరావు,గొర్లీ కృష్ణవేణి, విస్సు, పంచాయతి సిబ్బంది సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సేవలను సద్వినియోగం చేసుకోండి..

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ శివప్రసాద్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం : లీగల్ ఎయిడ్ కౌన్సిల్ చేయవలెను ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ శివప్రసాద్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని సబ్ జైలును ఆకస్మికంగా తనకి నిర్వహించారు. అనంతరం ఖైదీలు ఉండే గదులను, వంటగది, స్టోర్ రూమ్ తోపాటు పలు రికార్డులను వారు పరిశీలించారు. అనంతరం ఖైదీలతో సమావేశమై సమస్యలపై వారు ఆరా తీశా రు. అనంతరం సబ్ జైల్లో వసతి సరిగా ఉన్నదా? లేదా? ఆహార నాణ్యత ఎలా ఉంది? వైద్యం అందుతుందా? అన్న వివరాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు, ఆహార నాణ్యత పై ప్రత్యేక శ్రద్ధగా కనపరచాలని అధికారికి ఆదేశించారు. అంతేకాకుండా ఖైదీలకు కోర్టు కేసులో వారిచ్చేందుకు న్యాయవాదులు లేకపోతే లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సేవలను సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. అనంతరం ఖైదీలు పలు సమస్యలను జడ్జి దిష్టికి తీసుకొని వెళ్లారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది బాలసుందరి, సబ్ జైలు సూపర్డెంట్ బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పార్కింగ్ కారణంగా రాకపోకల సమస్యలు పై మంత్రి కార్యాలయం స్పందన

ధర్మవరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించిన మంత్రి కార్యాలయం సిబ్బంది
విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనదారులు రోడ్డుపైనే పార్కింగ్ చేస్తూ ఉండటం, ధర్మవరం నుంచి దర్శినమల గ్రామానికి వెళ్లేందుకు ప్రయాణించే పల్లె వాసులకు, ఇతర రహదారులపై రాకపోకలు సాగించే వారికి పెద్ద ఇబ్బందులు కలిగిస్తున్న విషయం వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యింది. ఈ అంశంపై మంత్రి కార్యాలయం ఇన్చార్జ్ హరీష్ బాబు స్పందించి. ఆయన మాట్లాడుతూ, ఁఈ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు పట్టణ సీఐ, ట్రాఫిక్ ఎస్ఐలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగిందని,. వాహనాల పార్కింగ్ నియమాలు కఠినంగా అమలు చేయడంతో పాటు, దర్శినమల గ్రామం వైపు వెళ్లే వాహనాలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ట్రాఫిక్ నిర్వహణను సక్రమంగా అమలు చేయించుకుంటాం అన్నారు.
ముఖ్యంగా, ఆ ప్రాంతంలో పార్కింగ్ చేస్తున్న ద్విచక్ర వాహనాలపై కఠినమైన చర్యలు తీసుకోని, దారి మార్గాలను సమర్థవంతంగా మల్లించి రాకపోకలు కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని మొదటి మరువ దగ్గర రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడం రాకపోకలకు చాలా ఇబ్బంది కలగడం వలన ప్రజలు, వివిధ పత్రికలు ద్వారా సమాచారం అందుకున్న ఎన్డీఏ కార్యాలయ ఇన్చార్జ్ హరీష్ బాబు, ఎన్డీఏ నాయకులు, మున్సిపల్ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు అక్కడికి వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. తదుపరి 40 లక్షల అంచనా తో రోడ్లను బాగు చేసే పనిని త్వరలో చేపడతామని తెలిపారు.

ప్రతి ఒక్కరూ రక్తపోటు మధుమేహం పరీక్షలు చేసుకోవాలి..

జిల్లా లెప్రసీ, క్షయ నివారణ అధికారి డాక్టర్ తిప్పయ్య
విశాలాంధ్ర ధర్మవరం : గ్రామములో ఉండే ప్రతి ఒక్కరూ రక్తపోటుతోపాటు మధుమేహం పరీక్షలు చేసుకోవాలని జిల్లా లెప్రసీ క్షయ నివారణ అధికారి డాక్టర్ తిప్పయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని పోతుకుంట ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు సేవలు అందిస్తున్న వాటి వివరాలను వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్ సి డి 3.0 కరెక్టుగా నిర్వహించాలని, 18 సంవత్సరాలు దాటిన వారి ఆరోగ్యాలపై శ్రద్ధ నిర్వహించాలని తెలిపారు. అలాగే నోటి క్యాన్సర్ ఆడవారైతే బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ కోసం ఎమ్మెల్యే హెచ్ పి ఏఎన్ఎం ఆశా కార్యకర్త ఇంటిలోని ప్రతి ఒక్కరి పైన తెలిపిన పరీక్షలు నిర్వహించడం ద్వారా ఏ వ్యాధి అయినా తొలి దశలోనే గుర్తించి నయం చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శనమల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పుష్పలత, హెల్త్ సూపర్వైజర్ రాజశేఖర్ రెడ్డి, ఏఎన్ఎం శ్యామల, ఎం.ఎల్.హెచ్.పి గౌతమి, హెల్త్ అసిస్టెంట్ ఆంజనేయులు, ఆశా కార్యకర్తలు ఆదినారాయణమ్మ, లక్ష్మీనరసమ్మ, భాను తదితరులు పాల్గొన్నారు.

నేషనల్ అవార్డు అందుకున్న ఇండియన్ రెడ్ క్రాస్ సేవకుడు సత్య నిర్ధారన్

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సేవకుడు సత్య నిర్ధారణ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి వద్ద మన్ననలు పొందుతున్నాడు. ఈ సందర్భంగా బెంగళూరులోని సోమల రాజు ఫౌండేషన్ 12వ వార్షికోత్సవం సందర్భంగా రాయచోటి నందు చిల్డ్రన్స్ డే సందర్భంగా డాక్టర్ సత్య నిర్ధారణకు సీనియర్ సిటిజన్ హెల్త్ యాక్టివిటీస్ నేషనల్ అవార్డును ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత రాజు మాట్లాడుతూ సత్య నిర్ధారణ సేవా రంగంలో విశేష సేవలను అందించడం వలన వారి యొక్క సేవలను గుర్తించి అవార్డుతో పాటు ఘనంగా సన్మానించడం నిజంగా సంతోషించదగ్గ విషయమని వారు తెలిపారు. సాధారణ వైద్య శిబిరాలు, వృద్ధుల కోసం ఆరోగ్య నిర్వహణ, దీర్ఘకాలిక వ్యాధులు పట్ల ప్రజలకు అవగాహన కల్పించుట, అతి తక్కువ ఫీజుతో ఫిజియోథెరపీని నిర్వహించుట, బత్తలపల్లి లో వృద్ధుల వైద్యాశ్రమమును కూడా నిర్వహించుట లాంటివి చేయడం నిజంగా గర్వించదగ్గ విషయమని తెలిపారు. తెలుగు కవిగా, రచయితగా, వైద్యునిగా అతనకు అతనే సాటి అని తెలిపారు. తదుపరి డాక్టర్ సత్య నిర్ధారణ మాట్లాడుతూ తనకు ఈ అవార్డు లభించడం సంతోషంగా ఉందని, ప్రజలకే అంకితం చేస్తున్నట్లు వారు తెలిపారు.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ సహకరించండి

ఎం ఈ ఓ గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ సహకరించాలని అనంతపురం జిల్లా ఉప కార్మిక కమిషనర్ లక్ష్మీనరసయ్య, ధర్మవరం అసిస్టెంట్ కమిషనర్ సూర్యనారాయణ, ఎంఈఓ లు గోపాల్ నాయక్ ,రాజేశ్వరి దేవిలు తెలిపారు. ఈ సందర్భంగా బాలల దినోత్సవం పురస్కరించుకొని కార్మిక శాఖ విద్యాశాఖ ఇతర శాఖలు ఎన్జీవోలు కలిసి పట్టణంలోని పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అనంతపురం జిల్లా ఉప కార్మిక కమిషనర్ లక్ష్మీనరసయ్య జండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించినప్పుడే అందరికీ చక్కటి విద్య లభిస్తుందని తెలిపారు. అక్షరాస్యతను సాధించుటలో తల్లిదండ్రులు కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. త్వరలో ధర్మవరం బాల కార్మిక రహిత మున్సిపాలిటీగా ప్రకటించే ఏర్పాటు జరుగుతున్నాయని తెలిపారు. చదువుకునే ప్రతి పిల్లవాడు పాఠశాలలోనే ఉండాలని, డ్రాప్ అవుటుగా మారకూడదని తెలిపారు. ఎక్కడైనా బాల కార్మికులుగా విద్యార్థులను షాపులో గాని, మెకానిక్ షాపులో గాని, పెట్టుకున్నట్లయితే వారిపైన కేసులు నమోదు చేసి జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని విద్యార్థులందరికీ ఉచిత విద్యను అభ్యసించడానికి పాటుపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖలతోపాటు ఎన్జీవోలు, ట్రేడ్ అసోసియేషన్ వర్గాలు, సహాయ కార్మిక అధికారి నరేష్ కుమార్, కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్, రెడీమేడ్ క్లాత్ అసోసియేషన్ అధ్యక్షులు ధనుంజయ, మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం..

ఆలయ ఈవో వెంకటేశులు. ఆలయ అర్చకులు
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయంలో కార్తీకమాసమును పురస్కరించుకొని ఆలయ ఈవో వెంకటేశులు, భక్తాదులు, దాతల సహాయ సహకారములతో అంగరంగ వైభవంగా శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కోనేరాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్లు వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ ఆచార సాంప్రదాయాల ప్రకారం స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం ఈవో వెంకటేశులు మాట్లాడుతూ ఈ కళ్యాణ మహోత్సవానికి సేవ, దాత లుగా కీర్తిశేషులు రామయ్య భార్య లక్ష్మమ్మ, కుటుంబ సభ్యులు వసుధాంజలి, గుండాల చంద్రశేఖర్, కుమారుడు హర్షవర్ధన్, సాయి దీప్తి, సాయిల సహకారంతో నిర్వహిస్తూ దాతలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఘనంగా సత్కరించడం జరిగిందని తెలిపారు. అన్నమయ్య సేవా మండలి అధ్యక్షులు పొరాళ్ల పుల్లయ్య ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తాదులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం అన్నమయ్య సేవా మండలి పౌర్ణమి సందర్భంగా దాతలు రామకృష్ణమ్మ, శ్రీరామ రెడ్డి, లక్ష్మీదేవి, గంగిరెడ్డి కుమారులు హేమ్ కుమార్ రెడ్డి ,శ్యామల కరుణాకర్ రెడ్డి, సవిత, హవీష్ రెడ్డి, హనీష్ రెడ్డి, గ్రీష్మారెడ్డి ల దాతల సహకారంతో దాదాపు 1100 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ వేడుకలు భక్తాదుల సందడితో, భక్తి వాతావరణంలో, అందరినీ అలరించింది. అనంతరం సాయంత్రం ఆలయ లోపల దాదాపు 1000 దీపాలతో విష్ణు దీపోత్సవ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోతోపాటు దాతలు, భక్తాదులు, అన్నమయ్య సేవా మండలి బృందం పాల్గొన్నారు.

విద్యార్థుల మంచి చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు .. కరస్పాండెంట్ డోలా పెద్దిరెడ్డి

విశాలాంధ్ర -ధర్మవరం; విద్యార్థుల మంచి చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని కరెస్పాండెంట్ డోలా పెద్దిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సత్య కృపా డిగ్రీ కళాశాల యందు ఫేర్వెల్ డే ను విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా డోలా పెద్ద రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి క్రమశిక్షణతో కూడిన విద్య ఎంతో అవసరమని, విద్యను ఎవరు దొంగలించలేరని, విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపు, ప్రభుత్వ ఉద్యోగము లభిస్తుందని తెలిపారు. తల్లిదండ్రుల కష్టాలను తెలుసుకొని చక్కటి విద్యను ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా చదివినప్పుడే సార్థకత ఏర్పడుతుందని తెలిపారు. విద్యార్థులందరూ కూడా ఐక్యమత్యంతో ఉంటూ చదువు ఎడల మంచి ఆసక్తిని చూపించాలని తెలిపారు. అనంతరం కళాశాలలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు మెమొంటోలను వారు అందజేశారు. తదుపరి విద్యార్థుల ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, బోధ నేతల బృందం తదితరులు పాల్గొన్నారు.

హాస్టల్ విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ చేసిన డాక్టర్ బషీర్

విశాలాంధ్ర- ధర్మవరం;; పట్టణములోని సాయి నగర్ లో గల స్పందన ఆసుపత్రి అధినేత డాక్టర్ బషీర్ 58వ జన్మదిన వేడుకల సందర్భంగా పట్టణములోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు లోగల బీసీ హాస్టల్ బాలికలు, ఎస్సీ హాస్టల్ బాలికలు, కోర్ట్ రోడ్డు లో బాలసదన్, దుర్గా నగర్ హాస్టల్, ఎర్రగుంట బీసీ హాస్టల్, ఎస్బిఐ కాలనీ బీసీ హాస్టల్ లోని విద్యార్థినీ విద్యార్థులకు దాదాపు 450 దుప్పట్లను ఆసుపత్రి మేనేజర్ బాబా ఫక్రుద్దీన్, దిల్దార్ సిబ్బంది చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ వార్డెన్లు, విద్యార్థినీ విద్యార్థులు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా దంపతులకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హాస్టల్ వార్డెన్లు మాట్లాడుతూ పట్టణంలో ఉన్నటువంటి స్పందన హాస్పిటల్ సేవా కార్యక్రమాలలో ముందంజలో ఉందని, ఇటీవల విజయవాడలో వరద బాధితులకు వివిధ రూపాలలో డాక్టర్ బషీర్ డాక్టర్ సోనియాల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేయడం సంతోషదాయకమన్నారు. అదేవిధంగా పట్టణంలో బిపి, షుగర్ పరీక్షలను నిర్వహిస్తూ, అందరికీ అవగాహన కల్పించడంలో మంచి గుర్తింపు కూడా పొంది, మంచి వైద్య చికిత్సలను అందించడంలో పట్టణంలోనే ముందంజలో ఉందని తెలిపారు. ఏది ఏమైనా డాక్టర్ బషీద్ దంపతులు విద్య, వైద్య, తదితర అంశాలను తమదైన శైలిలో మానవతా విలువలను పెంచుతూ, జిల్లా, పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క మన్ననలు పొందడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరు హాస్టల్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.