Thursday, February 6, 2025
Home Blog Page 145

ఘనంగా ప్రారంభమైన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

విశాలాంధ్ర, ఉరవకొండ( అనంతపురం జిల్లా) : 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఉరవకొండ గ్రంథాలయంలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మండల విద్యాశాఖ అధికారి ఈశ్వరప్ప, ప్రభుత్వ సెంట్రల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి, గ్రంథాలయ అధికారి ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. బాలుల దినోత్సవం పురస్కరించుకొని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో గ్రంథాలయాల పాత్ర చాలా కీలకమని, అటువంటి గ్రంథాలయ వ్యవస్థకు మరలా పూర్వ వైభవం రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం పుస్తకాలు చదువుతున్న వారి సంఖ్య తగ్గిందని ఇది మరింత పెరగాలని అన్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు అందుబాటులో వున్న గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని, పుస్తక పఠనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు మారుతి ప్రసాద్,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు

ఆలయ ఈవో వెంకటేశులు
విశాలాంధ్ర ధర్మవరంబీబీ పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఈనెల 15వ తేదీ శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటేశులు, అన్నమయ్య సేవామండలి కమిటీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సేవాకర్తలుగా కీర్తిశేషులు రామయ్య భార్య లక్ష్మమ్మ వారి కుటుంబ సభ్యులు, వసుధాంజలి, గుండాల చంద్రశేఖర్, కుమారులు హర్షవర్ధన్, సాయి, దీప్తి సాయిలు వ్యవహరిస్తారని తెలిపారు. అదేవిధంగా ఇదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమం సేవాదాతలుగా రామకృష్ణమ్మ, శ్రీరామిరెడ్డి ,లక్ష్మీదేవి, గంగిరెడ్డి, కుమారులు హేమకుమార్ రెడ్డి, శ్యామల, కరుణాకర్ రెడ్డి ,సవిత, హరీష్ రెడ్డి, హనీష్ రెడ్డి, గ్రీష్మారెడ్డి లతోపాటు ఆలయ భక్తాదుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున భక్తాదులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని వారు తెలిపారు.

విద్యార్థుల అల్పాహారం కు విరాళం అందించిన దాతలు

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని సంజయ్ నగర్ లో గల పొరపాలక బాలికల ఉన్నత పాఠశాల గత కొన్ని సంవత్సరాలుగా పదవ తరగతి ఉత్తీర్ణత లో నూటికి నూరు శాతం ఫలితాలను అందిస్తూ, పట్టణంలో మంచి గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ ఉమాపతి తనదైన శైలిలో డీఈఓ ఆదేశాల మేరకు పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం పూట అదనపు తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ అదనపు తరగతులు నిర్వహణకు ఏదో కొంత అల్పాహారం ఇవ్వాలన్న తలంపుతో గత కొన్ని సంవత్సరాలుగా దాతల సహకారంతో విద్యార్థినీలకు అల్పాహారాన్ని ఇవ్వగలుగుతున్నారు. ఇందులో భాగంగానే దాతలు బాబావాలి, హరీష్ ,పార్థ, శివప్రసాద్, చౌడయ్య, హేమ్రాజ్, వెంకట్ నారాయణ, శివ అనే దాతలు తమ వంతుగారూ .10,500 విరాళంగా హెడ్మాస్టర్ ఉమాపతికి అందజేశారు. దాతలు మాట్లాడుతూ మా వంతుగా విద్యార్థినీలు మంచి ఉత్తీర్ణత సాధించాలన్న తలంపుతోనే ఈ విరాళం ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం హెడ్మాస్టర్ ఉమాపతి దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహణ.. రోటరీ క్లబ్

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలలోని 163 మందికి రక్త పరీక్షలను నిర్వహించడం జరిగిందని అధ్యక్షులు జయ సింహ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ క్యాంపు దాతగా క్లబ్బు ఉపాధ్యక్షులుగా నరేందర్ రెడ్డి సహాయ సహకారాలను అందించడం జరిగిందని, ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ నుంచి కార్యదర్శి శివయ్య ,సత్య నిర్ధారణ, రోటరీ మెంబర్లు కొండయ్య సహాయ సహకారాలను అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పట్ల వారు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ రక్త పరీక్షల యొక్క నిర్వహణ వల్ల విద్యార్థుల యొక్క రక్తం యొక్క గ్రూపు తెలుస్తుందని, తద్వారా ఎప్పుడైనా అవసరమైన సమయంలో రక్తము దానం చేయవచ్చును లేదా తీసుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఈ అనంతరం హెడ్మాస్టర్ శైలజ, హిందీ పండిట్ వేణుగోపాల్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు రోటరీ క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ నిర్వహణ పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ హరీష్ బాబు, అసిస్టెంట్లు సాహితీ సోఫియా, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధ నేతల సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు..

గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గ్రంధాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి, పాఠకులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ ఈ గ్రంథాలయ వారోత్సవాలు 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఏడు రోజులపాటు నిర్వహించబడునని తెలిపారు. పాఠశాల విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తామని, ఇందులో భాగంగా జూనియర్ విభాగంలో ఆరవ, ఏడవ, తరగతి లకు, అదేవిధంగా సీనియర్ విభాగములో ఎనిమిదవ, తొమ్మిదవ, పదవ తరగతి లకు పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ పోటీలలో మంచి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఈనెల 20వ తేదీన బహుమతులను అందజేస్తామని తెలిపారు. తదుపరి 14వ తేదీన బాలల దినోత్సవం, 15న పుస్తక ప్రదర్శన, 16న గ్రంథాలయ ఉద్యమాల్లో పాల్గొన్న ప్రముఖులు, 17న కవి సమ్మేళనం, 18న చిత్రలేఖనం, 19న ఉమెన్స్ డే ,20న గ్రంథాలయ డే ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున విద్యార్థులు పాఠకులు పాఠశాల ఉపాధ్యాయులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రమణ నాయక్ ,సత్యనారాయణ, శివమ్మ, గంగాధర్ లతోపాటు పాఠకులు పాల్గొన్నారు.

గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

విశాలాంధ్ర-తాడిపత్రి (అనంతపురం జిల్లా) : స్థానిక శాఖా గ్రంథాలయములో గురువారం గ్రంథాలయాధికారి బి.రవి కుమార్ నాయుడు ఆధ్వర్యంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, నెహ్రూ జయంతి, పిల్లల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ నాగరాజు హాజరయ్యారు. మొదటగా ఎంఈఓ నాగరాజు నెహ్రూ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ నాగరాజు మాట్లాడుతూ నెహ్రు భారతదేశ తొలి ప్రధాని, నెహ్రు దేశానికి చేసిన సేవలను గూర్చి పిల్లలకు వివరించి చెప్పారు. నేటి పిల్లలే రేపటి దేశానికి నిజమైన శక్తి స్వరూపాలని తెలిపారు. అనంతరం పిల్లలతో గ్రంథాలయ ప్రతిజ్ఞ చేయించి, విద్యార్థినీ, విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల తెలుగు పండిట్ కే. శివరామిరెడ్డి రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు వి. సూర్యనారాయణ రెడ్డి రిటైర్డ్ ఉపాధ్యాయులు వీరారెడ్డి ప్రభుత్వ గవర్నమెంటు హైస్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రంథాలయ పాఠకులు, ప్రజలు పాల్గొన్నారు.

ఈనెల 15న కార్తీక పౌర్ణమి..వివిధ ఆటలు, సాంస్కృతి కార్యక్రమాలు…

కార్యవాహ అన్నం అరవింద్
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బి ఎస్ ఆర్ బాలికల ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 15వ తేదీ శుక్రవారం రాత్రి 9 గంటలకు కోజా గిరి ఉత్సవములు నిర్వహిస్తున్నట్లు కార్యవాహ అన్నం అరవింద్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము నిర్వహించే కార్తీక పౌర్ణమి ( కోజా గిరి) ను ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో వివిధ రకాల ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కావున ఈ కార్యక్రమములో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.

ధర్మవరంలో గురుకుల పాఠశాల భవన నిర్మాణం చేపట్టండి..

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ లేఖ

విశాలాంధ్ర -ధర్మవరం: ధర్మవరంలో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల భవన సముదాయ నిర్మాణానికి సంబంధించిన పనులు చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మంగళవారం లేఖ రాశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో అత్యధిక వెనుకబడిన తరగతుల విద్యార్థులు నివసిస్తున్నారని, వీరు గురుకుల పాఠశాలలో విద్యాభ్యసించాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జీవో నెంబర్ 12 ద్వారా ధర్మవరానికి మంజూరైన మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రారంభించడానికి అనుగుణంగా భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేసేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రిను కోరడం జరిగిందన్నారు.పాఠశాల నిర్మాణం కోసం గతంలో కేటాయించిన రూ.36 కోట్ల నిధులకు అదనంగా తాజా అంచనాలకు అనుగుణంగా నిధులు కేటాయించి వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న కూటమి ప్రభుత్వ ఆకాంక్షను నెరవేర్చాల్సిందిగా మంత్రికోరారు.

విద్యార్థినిలకు భోజన పంపిణీ నా అదృష్టంగా భావిస్తాను..

.
విశాలాంధ్ర- ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిలకు తన వంతుగా భోజన పంపిణీ చేయడం నా అదృష్టంగా భావిస్తానని లాయర్ గుంటప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గత కొన్ని సంవత్సరాలుగా కళాశాల చైర్మన్ బండి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తోంది. ఇందులో భాగంగానే లాయర్ గుంటప్ప తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విరాళంగా నగదును ఇచ్చి, భోజన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పట్టణంలోని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప తెలిపారు. 430 మంది బాలికలకు స్వయంగా లాయర్ గుంటప్ప చైర్మన్ వేణుగోపాల్ స్వయంగా వడ్డించారు. అనంతరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ లాయర్ గుంటప్పకు, కళాశాల చైర్మన్ బండి వేణుగోపాలకు, ప్రిన్సిపాల్ లక్ష్మీకాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

నేత్రదానం చేసిన వృద్ధుడు. విశ్వదీప సేవా సంఘం

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని శాంతి నగరకు చెందిన మచ్చా వెంకటేశ్వర్లు (74) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు విశ్వదీప సేవా సంఘమునకు సమాచారం అందించగా, వారు కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి కుటుంబ సభ్యుల అంగీకారము తో నేత్రదానమును స్వీకరించారు. జిల్లా అంతత్వ నివారణ సంస్థ, హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి టెక్నీషియన్ శ్రీకాంత్ ద్వారా నేత్రాలను స్వీకరించడం జరిగిందని వారు తెలిపారు. నేత్రదానానికి సహకరించిన దాత యొక్క కుమారులు రాంబాబు, తేజ మూర్తి, కూతురు సువర్ణ, అల్లుడు విజయ సారధి కు విశ్వ దీప సేవా సంఘం వారు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమములో ఉపాధ్యక్షులు శేఖర్ రెడ్డి ,వెంకటేష్, రఘు, మాధవ, అక్కులప్ప తదితర సభ్యులు పాల్గొన్నారు.