ప్రస్తుతం ఈమెయిల్ మార్కెట్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న యాపిల్ మెయిల్, రెండోస్థానంలో జీమెయిల్
సెర్చింజన్ దిగ్గజం గూగుల్, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు షాక్ ఇచ్చేందుకు ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ రెడీ అవుతున్నారు. ాఎక్స్ మెయిల్్ణ పేరుతో ఈమెయిల్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ాఎక్స్ మెయిల్్ణ కూడా ఉంటే బాగుంటుందన్న ఓ ఎక్స్ యూజర్ సూచన మేరకు మస్క్ ఈ ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. ఎక్స్ మెయిల్ లాంచ్ అయితే అది నేరుగా జీమెయిల్, ఇతర ఈమెయిల్ సర్వీసులకు పోటీ ఇస్తుందని మస్క్ ఆ యూజర్‌కు సమాధానం ఇచ్చారు. సెప్టెంబర్ 2024 నాటికి గ్లోబల్ ఈమెయిల్ మార్కెట్‌లో యాపిల్ మెయిల్ ప్రస్తుతం 53.67 శాతంతో ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. 30.70 శాతంతో జీమెయిల్ రెండోస్థానంలో ఉండగా, అవుట్‌లుక్ (4.38 శాతం), యాహూ మెయిల్ (2.64 శాతం), గూగుల్ ఆండ్రాయిడ్ (1.72 శాతం) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడీ విషయంలోనూ పోటీకి మస్క్ రెడీ అవుతున్నట్టు ఆయన కామెంట్‌ను బట్టి అర్థం అవుతోంది. దీంతో ఎక్స్ యూజర్లు మరింత ఉత్సాహంగా.. ఎక్స్ ఫోన్్ణ గురించి కూడా ఆలోచించాలని కోరుతున్నారు.
గూగుల్, మైక్రోసాఫ్ట్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు ఎలాన్ మస్క్ రెడీ!
జాకీర్ హుసేన్ మృతిపై చంద్రబాబు, నారా లోకేశ్ సంతాపం
ప్రముఖ తబలా విద్వాంసులు జాకీర్ హుస్సేన్ మృతి చెందడంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు.భారతీయ శాస్త్రీయ సంగీతంలో మహోన్నత వ్యక్తి అయిన తబలా మ్యాస్ట్రో జాకీర్ హుస్సేన్ ను కోల్పోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. మంత్రముగ్ధులను చేసే ఆయన ప్రదర్శనలు సంగీత ప్రియులను ఎంతగానో అలరించాయని కొనియాడారు. ఆయన వారసత్వం రానున్న తరాల్లో సంగీత ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటుందని పేర్కొంటూ, జాకీర్ హుస్సేన్ మృతికి సంతాపాన్ని ప్రకటించారు.సంగీత ప్రపంచం ఒక లెజెండరీని కోల్పోయిందని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. మ్యూజికల్ జీనియస్ ను కోల్పోవడం బాధాకరమని అన్నారు. జాకీర్ హుస్సేన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
జాకీర్ హుసేన్ మృతిపై చంద్రబాబు, నారా లోకేశ్ సంతాపం
ప్రముఖ తబలా విద్వాంసులు జాకీర్ హుస్సేన్ మృతి చెందడంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు.భారతీయ శాస్త్రీయ సంగీతంలో మహోన్నత వ్యక్తి అయిన తబలా మ్యాస్ట్రో జాకీర్ హుస్సేన్ ను కోల్పోవడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. మంత్రముగ్ధులను చేసే ఆయన ప్రదర్శనలు సంగీత ప్రియులను ఎంతగానో అలరించాయని కొనియాడారు. ఆయన వారసత్వం రానున్న తరాల్లో సంగీత ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటుందని పేర్కొంటూ, జాకీర్ హుస్సేన్ మృతికి సంతాపాన్ని ప్రకటించారు.సంగీత ప్రపంచం ఒక లెజెండరీని కోల్పోయిందని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. మ్యూజికల్ జీనియస్ ను కోల్పోవడం బాధాకరమని అన్నారు. జాకీర్ హుస్సేన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
సీనియర్ లెక్చరర్ వీరస్వామికి అరుదైన గౌరవం
విశాలాంధ్ర, కదిరి.కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో సీనియర్ లెక్చరర్ డా.వి వీరాస్వామి కి అరుదైన గౌరవం దక్కిందని ఆయన తెలిపారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న దేశ విదేశాల్లోని ప్రముఖ వ్యక్తులను గుర్తించి లీడర్ షిప్ ఎక్సలెన్సెస్ అవార్డు 2024″ తో సత్కరించారన్నారు.ప్రత్యేకంగా అవార్డు విజేతల జీవిత వివరాలతో కూడిన ఓ పుస్తకాన్ని ప్రచురించగా సదరు పుస్తకంలో డా వీరాస్వామికి చోటు లభించడం తమ కళాశాలకు ఇంతటి గౌరవం రావడంతో తోటి అధ్యాపకులు ఆయనను అభినందించారు
దేశం కోసం ప్రాణాలు డిన్న వెంకటసుబ్బయ్యకు నివాళులు
విశాలాంధ్ర ధర్మవరం : దేశం కోసం ప్రాణాలు వొడ్డిన వెంకటసుబ్బయ్యకు ఆదర్శ సేవా సంఘం పార్కు సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి, గౌరవాధ్యక్షులు చేన్న ప్రకాష్, కార్యదర్శి నాగార్జున, మారుతి, హెమ్ కుమార్, మాజీ సైనికులు పవన్ కుమార్, నాగభూషణం, ఎన్ఎస్ రెడ్డి, శ్రీధర్ లు పట్టణంలోని పిఆర్టి వీధిలోగల పార్కులో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మృతుడు నార్పల గ్రామానికి చెందిన సైనికుడని, సైన్యంలో కూడా మంచి గుర్తింపు పొందడం జరిగిందని తెలిపారు. వెంకటసుబ్బయ్య మృతి చెందడం బాధాకరమని, వారి త్యాగం ఎందరికో స్ఫూర్తిని ఇస్తుందని తెలిపారు. 30 మంది తోటి జవాన్ల ప్రాణాలను కాపాడి వారు వీర మరణం పొందడం దేశం గర్వించదగ్గ విషయమని తెలిపారు.
విద్యలో నైతిక విలువల ప్రాముఖ్యత కార్యక్రమ పై అవగాహన.. ప్రిన్సిపాల్ ప్రశాంతి
విశాలాంధ్ర ధర్మవరం;; విద్యలో నైతిక విలువల ప్రాముఖ్యత అనే కార్యక్రమం పై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని ప్రిన్సిపాల్ ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు భగవాన్ భాయ్ , రాధా సిస్టర్ లు విద్యార్థులకు అవగాహన చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ తమ జీవితం లో విద్యతో పాటు నైతిక విలువలు కూడా పెంపొందించుకోవాలని తెలియచేసారు. ఇంకా విద్యార్థులే భారతదేశ భవిష్యత్తు అని, వారి విద్యార్థి జీవితంలో వారికి అందించిన విలువలపై మన దేశ భవిష్యత్తు చాలా ఆధారపడి ఉంటుందని తెలిపారు. నైతిక విలువలు జీవితంలో వారి అన్ని నిర్ణయాలకు మార్గం సుగమం చేస్తాయి అని, ఈ విలువలు లేకుండా, పిల్లలకు ఎటువంటి మార్గదర్శకత్వం ఉండదు అని,వారి జీవితం దిక్కులేనిదిగా అనిపించవచ్చు అని, సమాజంచే ఆమోదించబడటానికి మరియు గౌరవించబడటానికి, తల్లిదండ్రులు, సంరక్షకులు ఈ బలమైన నైతిక విలువలను పిల్లలలో ఒక జీవనశైలి వలె నింపేలా చూసుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, అధ్యాపకులు తల్లితండ్రులు,, ఎన్ఎస్ఎస్ఆఫీసర్.. కుళ్లాయిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
జాతీయ సమైక్యత అవార్డుకు ఎంపికైన ధర్మవరం వాసులు
విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ దర్గా కమిటీ వారు జాతీయ సమైక్యత అవార్డుకు ధర్మవరం పట్టణానికి చెందిన జయసింహ, పోలా ప్రభాకర్, నరేందర్ రెడ్డి ఏపీకి కావడం జరిగిందని సౌత్ ఇండియా స్వచ్ఛంద సంస్థల స్వచ్ఛంద కార్యకర్త, రెడ్ క్రాస్ కోశాధికారి, ధర్మవరం నియోజకవర్గ రచయితల సంఘం కార్యదర్శి డాక్టర్. సత్య నిర్ధారన్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ముగ్గురితోపాటు సోమల రాజు ఫౌండేషన్ అధినేత శివరాజు కూడా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లా రచయితల సంఘం ద్వారా స్వచ్ఛంద సంస్థల ద్వారా హిందూ పురానికి చెందిన ఉమర్, కదిరి బాబా ఫక్రుద్దీన్ లు సాహిత్య రంగంలో సేవా రంగంలో చేసిన సేవలు మరుపురానివని తెలిపారు. వారిని కూడా ఎంపిక చేయడం ఆనందదాయకమని తెలిపారు. ఎంపిక చేసిన చాంద్ భాషా కు హృదయపూర్వక కృతజ్ఞతలను వారు తెలియజేశారు. వీరందరూ కూడా ఈనెల 13వ తేదీ పెనుకొండ లో అవార్డులను అందుకుంటారని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రికి టోల్ కిట్టు ప్రదానం
చైర్మన్ తల్లం నారాయణమూర్తి
విశాలాంధ్ర ధర్మవరం;;పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి టోల్ కిట్టును(విలువ 5000 రూ .లు)పట్టణంలోని మానవతా స్వచ్ఛంద సంస్థ కమిటీ వారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉదయ్ భాస్కర్ కు చైర్మన్ తల్లం నారాయణమూర్తి, కార్యదర్శి మంజునాథ్ అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్, కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోని వార్డులకు, వివిధ మరమ్మత్తులకు, వివిధ రూపాలలో ఈ టూల్ కిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మున్ముందు ప్రభుత్వ ఆసుపత్రికి మరిన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ .మాధవి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్ స్వచ్ఛంద సేవా సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పెద్దకోట్ల రవికుమార్, గట్టు వెంకటేశులు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేయుత..
బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు జింకా చంద్రశేఖర్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని 39 వార్డులో గల పూజారి శ్రీనివాసులు కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు జింకా చంద్రశేఖర్ స్వయంగా వారి ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆరువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. మీ కుటుంబానికి అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు దాము, రాజు, మల్లికార్జున ,రామకృష్ణ, షీలా గంగా ప్రసాద్, భాస్కర, గడ్డం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
విలేకరుల దాడులకు కారకులైన మోహన్ బాబును వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ రమేష్.
విశాలాంధ్ర ధర్మవరం;; విలేకరుల దాడులకు కారణమైన మోహన్ బాబును వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ రమేష్, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చౌడప్ప డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మీడియాపై దాడులు చేయడం అతి దారుణమైన హేయమైన చర్య అని, ఈ దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజల కోసం సమస్యలను పరిష్కరించే విలేకరులపై ఇటువంటి దాడులు జరగడం దారుణమని, భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం గట్టి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిజాలను నిర్భయంగా రాసి సమాజంలో జరుగుతున్న అవినీతిని ప్రజలకు తెలియజేయు విలేకరులపై ఇటువంటి దాడులు మున్ముందు జరిగితే, తమ ఊరుకునేది లేదని వారు స్పష్టం చేశారు. సమాజం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మీడియా వారికి భద్రత కల్పించాలని తెలిపారు. అదేవిధంగా ప్రైవేట్ భవనర్సపై కేసు బుక్ చేయాలని, సినిమా విద్యకు సంబంధించిన కార్యక్రమాలపై వార్తలను 10 సంవత్సరాల పాటు బహిష్కరణ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, సాకే వీరనారప్ప, రామాంజనేయులు, మల్లెల పెద్దన్న ,కుల్లాయప్ప, ఆంజనేయులు ,సాకే సుబ్బరాయుడు, దేవరకొండ నరసింహులు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

