…. ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర -ధర్మవరం;; నియోజకవర్గంలోని తన పర్యటనలో నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమం ప్రజల సమస్యను పరిష్కరించడమే నా లక్ష్యము అని ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని పోతుల నాగేపల్లి గ్రామంలో గ్రీవెన్స్ డే ను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ ప్రజల సమస్యలను వైజ్ఞానికంగా సమీక్షించిన తర్వాత వారి సమస్యల పరిష్కారం కోసం అధికారులకు తగిన ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థుల బోధన ఆహార విధానం పాఠశాల నిర్వహణను వారు సమీక్షించారు. పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన భోజనంలో నాణ్యతను తప్పకుండా పాటించాలని హెడ్మాస్టర్ను కు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహార మందకపోతే కఠిన చర్యలు తప్పమని కూడా హెచ్చరించడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సర్కారు పథకాలను సక్రమంగా అమలు చేస్తోందని తెలిపారు. అనంతరం ధర్మవరం పట్టణంలోని చెరువు కట్ట వద్ద గల శ్రీ అయ్యప్ప భజన మందిరములో వారు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. తదుపరి ఆలయ కమిటీ హరీష్ బాబును ఘనంగా సత్కరించారు.
గ్రీవెన్స్ డే అనేది ప్రజల సమస్యలను పరిష్కరించడమే ముఖ్య లక్ష్యం
ఉపాధ్యాయ వృత్తి కి న్యాయం చేసిన ఆదర్శ ఉపాద్యాయుడు ఎద్దుల తిప్పన్న
విశాలాంధ్ర- ధర్మవరం : కొందరు విద్య ని అభ్యసించడానికి, మరికొందరు వాటి విలువలు శిష్యులకు నేర్పించడానికి పుడతారు, ఆ కోవకు చెందిన వారు ఎద్దుల తిప్పన్న
వీరు అనంతపురం ఆర్ట్స్ కాలేజీ,డిగ్రీ కాలేజీ ధర్మవరం, జూనియర్ కాలేజీ, బుక్కపట్నం లో మాథ్స్ అసిస్టెంట్ గా ఉపాధ్యాయ రంగం లో పలు సేవలు అందించారు.ఎందరినో విద్యార్థులను తీర్చి దిద్దిన ఘనత ఎద్దుల తిప్పన్నకు దక్కుతుంది. ఉపాధ్యాయ రంగం మరువలేని వీరు సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం కనిశెట్టిపల్లి గ్రామం లో ఆదెప్ప, అదెమ్మ దంపతులకు 12.6.1932లో జన్మించారు. బహు ముఖ ప్రజ్ఞావంతుడుగా పేరు పొందిన ఈ ఉపాధ్యాయ వ్యక్తిత్వం కలిగిన మంచి తనం కల మాష్టారు. విద్యార్థుల మనోభావాలు గమనించి ఆయన ఆనాడు విద్యా భోధన చేసే వారని ఆయన శిష్యులు పలువురు పేర్కొనడం విశేషం.తుదకు 17.6. 2017లో తను అందరికీ దూరమై స్వర్గస్తులయ్యారు..తన శిష్యులను అభిమానులను విషాదం లో ముంచారు.తల్లి తండ్రులు ఆదెప్ప,ఆదెమ్మ, దంపతులకు జనించిన మార్గ దర్శకులు ఉపాధ్యాయ వృత్తి కి తగిన న్యాయం చేసిన గురువు ఎద్దుల తిప్పన్న మృతి పట్ల ఎందరో అశ్రు నివాళులు అర్పించారు.ఇప్పటికీ మరువలేని కర్తవ్య పరాయణుడు తిప్పన్న అయ్యవారు అని పిలిచేవారు.ఆయనకు నలుగురు కుమార్తెలు, అనసూయ, దివంగత సుశీలమ్మ, రాజేశ్వరి, సాయి లీల, కుమారులు ఇద్దరు వారిలో విశ్రాంత ఇరిగేషన్ ఇంజనీరు అదిశేషయ్య, బాల మురళి కృష్ణ ఇంజినీర్ అనంతపురం వున్నారు.ధర్మవరం, బుక్కపట్నం,కొత్త చెరువు, అనంతపురం,తదితర ప్రాంతాలలో ఆయన పేరు తెలియని వారు లేరు. వీరి శిష్యులు ఇప్పుడు పెద్ద పెద్ద పదవులను అలంకరించిన వారున్నారు.తన శిష్యులకు ఆయన భోదించే విద్య తో పాటు క్రమశిక్షణ గురించి, పరిసరాల పరిశుభ్రత గురించి, చదువు విలువ, విద్య జ్ఞానం గురించి వివరించేవారు ఎవరినీ విసుగుకునేవారు కాదు. కోపం అనేది తెలియని వారు,అందరికీ సమయ స్ఫూర్తి తో సమాధానం ఇచ్చేవారు ఎద్దుల తిప్పన్న అందరికీ ఆదర్శం అని చెప్పాలి.వీరి సోదరులు శంకర నారాయణ విశ్రాంత హెడ్ మాస్టర్ గా వున్నారు. మరో సోదరులు దివంగత డా ఇ. సూర్య నారాయణ ధర్మవరం లో సాయిబాబా నర్సింగ్ హోమ్ స్థాపించి పేదలకు ఉచిత వైద్యం అశీదించారు. సత్య సాయి బాబా భక్తులు, వీరు తల్లి తండ్రులు జ్ఞాపకార్థం కని శెట్టి పల్లి లో ఉచిత వైద్యం కేంద్రం ఏర్పాటు చేయడం విశేషం. ఇటువంటి వారి మార్గదర్శకంలో ఉపాధ్యాయులు నడవాలి.
వివాద రస్తా స్థలమును పరిశీలించిన ఆర్డిఓ మహేష్..
విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బలో జొన్నల కొత్తపల్లి, సంకేపల్లి వద్దగల రోడ్డు రస్తాను శుక్రవారం ధర్మవరం ఆర్డీవో మహేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జొన్నల కొత్తపల్లి తండావారు మాకు ర స్తా ఇవ్వకుండా కొంతమంది అడ్డుపడుతున్నారన్న ఫిర్యాదు మేరకు తాను రావడం జరిగిందని తెలిపారు. తదుపరి ఎమ్మార్వో నారాయణస్వామి, సర్వేల ద్వారా ఇక్కడ గల స్థలం ప్రభుత్వాన్నిదా.? లేదా ప్రైవేట్ స్థలమా? అన్న విషయాలను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. గ్రామ ప్రజల రస్తా ఆవసరం పూర్తి దశలో విచారణ చేపట్టి, న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. కొంతమంది ఈ రస్తా గుండా వెళ్ళకూడదు అన్న విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని, అసలు ఈ రస్తా విషయంపై పూర్తి దశలో విచారణ చేపడతామని తెలిపారు. తదుపరి పోలీసులు, ఎమ్మార్వో నారాయణస్వామి, మండల సర్వే యర్, విఆర్ఓ ఆధ్వర్యంలో తండావాసులతో మాట్లాడడం జరిగిందని తెలిపారు. ఈ రస్తా విషయమై సరి అయిన నివేదికను తనకు పంపాలని ఎమ్మార్వోను ఆదేశించడం జరిగిందని తెలిపారు. తదుపరి గ్రామస్తులతో మాట్లాడి కలిసిమెలిసి ఉన్నప్పుడే ఏదైనా అభివృద్ధి చెందుతుందని తెలుపుతూ, తగిన సలహాలు సూచనలు గ్రామ ప్రజలకు తెలియజేశారు. అనంతరం నాగిరెడ్డిపల్లి లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సు వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ రైతుల ద్వారా ఏమైనా సమస్యలు ఉన్నాయా.? అంటూ ఆరాధిశారు. అనంతరం రెవెన్యూ సదస్సులో పాల్గొన్న వారి ప్రజలతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ రెవెన్యూ సదస్సులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగిందని, మీ సమస్యలు ఏవైనా ఉన్నాయెడల అర్జీ ద్వారా ఇవ్వాలని, తదుపరి అర్జీలను పరిశీలించి న్యాయం తప్పక చేకూర్చుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సదస్సు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
గోవాడ సుగర్స్ ఫీల్డ్ మేన్ రామారావుకు ఉత్తమ అవార్డు …
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : గోవాడ సుగర్స్ పరిధిలో చెరుకు సాగును ప్రోత్సహించినందుకు గాను అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం వద్ద నిర్వహించిన కిసాన్ మేళాలో ఫ్యాక్టరీ ఫీల్డ్ మేన్ కె.వి.రామారావుకు బెస్ట్ ఎక్స్టెన్షన్ వర్కర్ అవార్డును అందజేశారు. కిసాన్ మేళాలో ప్రతీ ఏడాది అందజేసే కీ.శే. సి. వి. నరసింహారాజు మెమోరియల్ అవార్డును షుగర్ ఫ్యాక్టరీలో పనిచేయుచున్న ఫీల్డ్ మాన్ రామారావుకు బెస్ట్ ఎక్స్టెన్షన్ వర్కర్ గా అందజేశారు. ఈ అవార్డును అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చేతులమీదుగా ప్రశంసా పత్రము, మెమొంటో మరియు శాలువాతో సత్కరించి అవార్డు ప్రధానము చేశారు. అలాగే ఫ్యాక్టరీ పరిధిలో అంబేరుపురానికి చెందిన రిటైర్డ్ ఫీల్డ్ మాన్ దాడి ముత్యాల నాయుడు, ఫ్యాక్టరీ కేన్ సెక్షన్ హెడ్ క్లర్క్ దొడ్డి శీను, గోవాడ కు చెందిన అర్జున్ మాస్టర్ కు ఉత్తమ రైతు అవార్డు అందజేశారు. కొత్త రకముల విత్తనమును అభివృద్ధి చేయుట, జంట చాళుల పద్ధతి మరియు దూరపు చాలుల పద్ధతి లో చెరకు సాగును చేయించుట, చెరకులో అంతర పంటలు వేయించుట, యాంత్రికరణలో భాగముగా చెరకు సాగులో పవర్ వీడర్లు ఉపయోగించుట, చెరకు రైతుల తోనూ, శాస్త్రవేత్తల తోను సత్సంబంధాలు కలిగియుండుట మొదలగు చెరకు అభివృద్ధి కొరకు చేసిన సేవలకు గాను ఈ యొక్క ప్రశిష్ఠాత్మకమైన అవార్డులు అందజేశారు అవార్డు గ్రహీతలు ఫీల్డ్ మేన్ రామారావు, రిటైర్డ్ ఫీల్డ్ మెన్ దొడ్డి ముత్యాల నాయుడు, దొడ్డి శ్రీను లను ఫ్యాక్టరీ ఎండి, సిబ్బంది, పలువురు చెరకు రైతులు అభినందించారు.
ఆజాద్ సెంటర్లో “హిందూ ముస్లిం”లయొక్కఐక్యతను విడదీయొద్దు
విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు: ములముడి బస్టాండ్ ఆజాద్ సెంటర్లో స్థానికుల మనోభావాలకు గౌరవించండి రాజకీయాలకు మా సమస్యలను ముడి పెట్టకండి.అని అంటున్న ఆజాద్ సెంటర్ స్థానికులు నగరంలోని పాత ములముడి బస్టాండ్ ఆజాద్ సెంటర్లో జాతీయ జెండా పై వివాదం జరిగిందిఅసలు ఆజాద్ సెంటర్లో జాతీయ జెండా ముందు పెట్టారా లేదా స్వామి వివేకానంద విగ్రహం ముందు పెట్టారనేదివివరణఇస్తున్నాము. స్థానికులు కులమతాలకు అతీతంగా2008 ఆగస్టు15వ తేదీ అమరవీరుల స్మారక స్థూపం ఏర్పాటు చేసి అందులో జాతీయ జెండాని ఎగరవేయడం జరిగింది. ఈ అమరవీరులు చంద్రశేఖర్ ఆజాద్, అశ్వఖుల్లా ఖాన్, భగత్ సింగ్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లతో స్తూపాన్ని నిర్మించడం జరిగింది. అయితే 2009 జనవరి 12వ తేదీన స్వామి వివేకానందగారి ఒక చిన్న స్తూపాన్ని నిర్మించారు అప్పటినుండి వివాదం లేకుండా మా జాతీయ జెండాని ఆగస్టు15వ తేదీ అదేవిధంగా జనవరి 26 రిపబ్లిక్ డే రోజున వివిధరాజకీయపార్టీ నాయకులనుఆహ్వానించి కుల
మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు అందరూ కలిసిమెలిసి ఈ జాతీయ జెండాను ఎగరవేస్తూ వచ్చాము ఈ జెండా ఆవిష్కరణ అప్పట్లో ఎమ్మెల్యేలు ఆనం వివేకానంద రెడ్డి,ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి,నాటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్,అప్పటి మేయర్ అబ్దుల్ అజీజ్ ప్రముఖులు ఈ జాతీయ జెండాను ఎగరవేసేవారు ఇక్కడ జాతీయ సమైక్యత కాపాడాలనే ఒక ఉద్దేశంతోనే నేటి భారతదేశంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను తెలుసుకోవాలి అనే ఒక మంచిఉద్దేశంతో అమర
వీరుల స్మారక స్థూపాలను ఏర్పాటు చేసి జాతీయ జెండాను ఎగరవేస్తున్నాం ఎవరైతే ఈ అమరవీరులు ఉన్నారో వీరందరి వర్ధంతి జయంతులు కూడా ఇక్కడ తూచాతప్పకుండా కార్యక్ర
మాలు చేస్తూ ఉంటాం కానీ డిసెంబర్2వతేదీ అమరవీరుల స్మారక స్థూపం వర్షాల వల్ల కుంగడంతో దాన్ని మరమ్మతులు చేపట్టే సందర్భంలో ఆర్ఎస్ఎస్,బిజెపి వారుఈ నిర్మాణాన్నిఆపాలని వివాదా
నికి తెర తీశారు స్థానికంగా ఉండే మేమంతాఎంతో శాంతియుతంగా పోలీస్ వారి సమ
క్షంలోసమస్య పరిష్కరించాలంటూ కోరడం జరిగింది
టౌన్ డిఎస్పి సిఐల సమక్షంలో జరిగినసమావేశంలోఈసమస్యపరిష్కారంశాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలని అదే స్థానికులయొక్కఆకాంక్ష అయితే దీనిని స్వార్ధరాజకీయాలకు
ఉపయోగించుకోవాలని కొందరు వ్యక్తులు ప్రవేశించి సమస్యను తప్పదోవ పట్టిస్తున్నారు సామరస్యంగా పరిష్కారాన్ని పోలీసు శాఖ వారు సూచించిన సూచనలను కూడా వారు రాజకీయంగా చేయటాన్ని స్థానికంగా ఉండేటువంటి హిందూ ముస్లింలు అందరూ వ్యతిరేకిస్తున్నారు అని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకు కారణం దాదాపు మూడు శతాబ్దాల నుంచి ఆ ప్రాంతంలో హిందూ ముస్లింలు ఎంతో సఖ్యతగా అన్నదమ్ముల వలే మెలగడం జరుగుతున్నది అయితే ఇప్పటికైనా స్థానికుల యొక్క మనోభావాలను గౌరవిస్తూ స్థానికేతరులు ఆ సమస్యల్లో తలదూర్చకుండా సమస్యను సామరస్యంతో పరిష్కార మార్గానికి పోలీసు వారి సూచించిన సూచనల మేరకు పరిష్కారం చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నారని స్థానిక ప్రజలందరూ సిద్ధంగా ఉన్నామంటున్నారు.
రైతుల ఢిల్లీ ఛలోలో ఉద్రిక్తత.. మరోసారి ర్యాలీ నిలిపివేత
కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్ల సాధనే లక్ష్యంగా రైతులు శనివారం పునఃప్రారంభించిన ఛలో ఢిల్లీ ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతుల పాదయాత్రను భద్రతా సిబ్బంది అనుమతించలేదు. హర్యానా-పంజాబ్ సరిహద్దులో రైతులను చెదరగొట్టేందుకు హర్యానా పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులను ప్రయోగించారు. ఈ పాదయాత్రలో 101 మంది రైతులు పాల్గొనగా దాదాపు 10 మంది రైతులు గాయపడ్డారు. దీంతో మరోసారి ాఛలో ఢిల్లీ యాత్రను నిలిపివేస్తూ రైతులు నిర్ణయించుకున్నారు. కాగా, కాంగ్రెస్ నేత, మాజీ రెజ్లర్ బజరంగ్ పునియా శంభు సరిహద్దులో రైతులను కలిసి మాట్లాడారు. రైతులను అడ్డుకోవడం లేదని చెబుతూనే బాష్పవాయువు ప్రయోగిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. శంభు సరిహద్దును పాకిస్థాన్ సరిహద్దులా వ్యవహరిస్తున్నారని, రైతు నేతలు ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపేందుకు అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. డిసెంబరు 6న రైతులు ఛలో ఢిల్లీ నిరసన ర్యాలీ మొదలుపెట్టారు. అయితే శంభు సరిహద్దులో పోలీసులు అడ్డుకుంటున్నారు. డిసెంబరు 6, 8 తేదీలలో కూడా రైతులను భద్రతా సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఇవాళ మరోసారి ప్రయత్నించారు.
నిజానిజాలు తెలుసుకోండి.. తప్పుడు ప్రచారం చేయొద్దు: మోహన్ బాబు
జర్నలిస్టులపై దాడి కేసులో జరుగుతున్న పరిణామాలను వక్రీకరిస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంచు మోహన్ బాబు ఆరోపించారు. ఈ విషయంపై మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారమవుతున్నాయని ఆయన ట్వీట్ చేశారు. ముందస్తు బెయిల్ కోసం తాను పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు రిజెక్ట్ చేసిందని మీడియాలో వార్తలు వస్తున్నాయని చెబుతూ.. అవన్నీ తప్పుడు కథనాలని కొట్టిపారేశారు. కోర్టు తన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను తన నివాసంలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని మోహన్ బాబు తెలిపారు. నిజానిజాలు తెలుసుకుని, వాస్తవాలను మాత్రమే ప్రజలకు వెల్లడించాలని మీడియాకు మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు.

