Home Blog Page 1456

రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం

రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఎగువ స‌భ‌లో చైర్మన్ వ్యవ‌హ‌రిస్తున్న తీరు ఏక‌ప‌క్షంగా ఉంటోందని ఎంపీలు ఆరోపిస్తున్నారు. రాజ్యసభ నుంచి తాము తరచూ వాకౌట్‌ చేయాల్సిన పరిస్థితికి చైర్మన్‌ ధన్‌ఖర్‌ వైఖరే కారణమని విపక్ష ఎంపీలు విమ‌ర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై ఇండియా కూట‌మి పార్టీలైన తృణమూల్‌, ఆమ్‌ ఆద్మీపార్టీ, సమాజ్‌ వాదీపార్టీ, డీఎంకే, ఆర్జేడీ తదితర పార్టీలకు చెందిన 50 మందికిపైగా ఎంపీలు సంత‌కాలు చేశారు. ఎంపీలు సంతకాలు చేసిన ఈ నోటీసులను రాజ్యసభ సెక్రటేరియట్‌కు సమర్పించారు. చైర్మన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం భారత పార్లమెంటరీ చరిత్రలోనే ఇది మొదటిసారి. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేందుకు లేచి నిలబడినపుడు చైర్మన్‌ ఆయనకు అవకాశం ఇవ్వాలని, కాని కాంగ్రెస్‌ అధ్యక్షుడు, సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే లేచి నిలబడగానే మైక్రోఫోన్‌ను చైర్మన్‌ తరచు కట్‌ చేస్తున్నారని విపక్ష ఎంపీలు వాదిస్తున్నారు. పార్లమెంటరీ నిబంధనలు, సాంప్రదాయాల ప్రకారం సభ నడవాలని, కాని తాము ఫిర్యాదు చేసిన ప్రతిసారి తమను ఛాంబర్‌లోకి పిలిచి సర్దుబాటు చేసేందుకు చైర్మన్‌ ప్రయత్నిస్తున్నారే తప్ప నిబంధనలను పాటించాలని భావించడం లేదని సీనియర్‌ ప్రతిపక్ష నాయకుడు ఒకరు తెలిపారు. దీంతోనే ఆయ‌న‌పై అవిశ్వాస‌తీర్మానం పెట్టిన‌ట్లు విప‌క్షాలు వెల్ల‌డించాయి..

ఇరుకు మధుంపై రక్షణ గోడ నిర్మించకపోతే ఆర్ అండ్ బి కార్యాలయాన్ని ముట్టడిస్తాం …

– ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ అండ్ బి అధికారులు …

– తక్షణమే వెంకన్నపాలెం పెద్ద మదం పై రక్షణ గోడ తక్షణమే నిర్మించాలి ……

– సిపిఐ జిల్లా సమితి సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్….

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : వెంకన్నపాలెం ఇరుకుమదంపై రక్షణ గోడలు నిర్మించకపోతే ఆర్ అండ్ బి కార్యాలయాన్ని ముట్టడిస్తామని సిపిఐ జిల్లా సమితి సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటాలు మాని మండలంలోని వెంకన్నపాలెం సమీపంలో బి.ఎన్. రోడ్డుపై ఇరుకు మదుం పై రక్షణ గోడ తక్షణమే నిర్మించాలని సిపిఐ జిల్లా సమితి సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు మంగళవారం డిమాండ్ చేశారు. అనకాపల్లి – చోడవరం ప్రధాన రహదారిలో గుంతల రోడ్లు వెంకన్నపాలెం సమీపంలో కాలవపైన గల ఇరుకు మధుంపై రక్షణ గోడ నిర్మించకుండా కాలయాపన చేస్తున్న ఆర్ అండ్ బి అధికారులు నిద్రమత్తులో ఉన్నారన్నారు. ప్రధాన రహదారిలో ఇరుకు మధుము పై సేఫ్టీ వాల్ కూలిపోయిన ను ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోక పోవడంతో
నిరంతరం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నిద్రమత్తులో ఉన్న ప్రభుత్వ అధికారులు కనీసం హెచ్చరిక బోర్డులు గాని, నిర్మాణ చర్యలు కాని చేపట్టకుండా నిర్వీర్యం చేస్తున్నారన్నారు.
గతంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి కలెక్టర్ గారికి విషయాన్ని తెలియజేస్తే, తూతూ మంత్రం గా ఇసుక మూటలు, నాలుగు జండాలు పెట్టి చేతులు దులుపుకున్నారు అని తెలిపారు. వెంకన్నపాలెం గోవింద మాస్టారు చాలా సందర్భాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టి ప్రయాణకులకు తెలియజేసే పద్ధతుల్లో జండాలు కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. గుంతల రోడ్లు, ప్రజా సమస్యలు పట్టించుకోని స్థానిక ఎమ్మెల్యే నిద్ర మత్తు విడనాడాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు నిరంతరం ప్రయాణిస్తున్న గుంతల రహదారి, ప్రమాద కల్వర్టులను కనీసం పట్టించుకునే పరిస్థితి, లేకపోయిందని ఎద్దేవా చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు మంగళవారం ప్రమాద రహదారులు, వెంకన్నపాలెం ఇరుకు మదం వద్ద సిపిఐ అనుబంధ ప్రజా సంఘాలతో ఆందోళన నిర్వహించారు.

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతం పెంచడమే సంకల్ప-2025 లక్ష్యం

శ్రీ సత్యసాయి జిల్లా డిఐఈఓ- రఘునాథరెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం:: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతం మంది పెంచడమే సంకల్ప-2025 లక్ష్యము అని శ్రీ సత్యసాయి జిల్లా డిఐఈఓ రఘునాథ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉత్తీర్ణత శాతమును పెంచడం కోసం ఈ వినూత్నమైన కార్యక్రమమును ఇంటర్మీడియట్ ఆదేశాల మేరకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ ఏడెడ్ జూనియర్ కళాశాలలో చదువుతున్న వారిని, చదువులో వెనుకబడిన వారిని మూడు విభాగాలుగా విభజించి వారి కోసం అధ్యాపకులను కేకలుగా నియమించడం జరిగిందన్నారు. ఈనెల రెండవ తేదీ నుంచి ఫిబ్రవరి నెల చివరి వరకు మొత్తం 22 కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ 3,872 మందికి, రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ 3,063 విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. వెనుకబడిన విద్యార్థులను ఏ, బి, సి గ్రూపులుగా విడదీసి ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుండి 5 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. వీరందరికీ ప్రత్యేకంగా టైం టేబుల్ ఏర్పాటు చేసి, ప్రణాళిక ప్రకారం విద్యార్థులకు మంచి అవగాహన విద్య యందు ప్రాధాన్యతను కొనసాగిస్తూ, ఉత్తీర్ణత శాతమును పెంచడానికి తగిన సూచనలు కళాశాల ప్రిన్సిపాల్ కూడా తెలపడం జరిగిందని తెలిపారు. ఈ సంకల్ప-2025 అనే ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రిన్సిపాల్ లు, కళాశాల అధ్యాపకులు చిత్తశుద్ధితో తమ విధులను నిర్వర్తించాలని వారు తెలిపారు.

పాలస్తీనా సంఘీభావ సభ పోస్టర్ విడుదల

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.ఓ), నవ యువ సమాఖ్య (ఎన్ వై ఎస్) విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 12 న గుంటూరులోని అరండల్ పేట లో అమెరికా అండతో ఇజ్రాయిల్ పాలసీనాపై సాగిస్తున్న దుర్మార్గ యుద్ధాన్ని ఖండిస్తూ పాలస్తీనా సంఘీభావ సభను నిర్వహించడం జరుగుతుందన్నారు. పాలస్తీనా సంఘీభావ సభ పోస్టర్ ను మంగళవారం గోవాడ ఎస్టి కాలేజీ బాయ్స్ హాస్టల్ వద్ద అలాగే చోడవరం ఎస్సీ కాలేజీ బాయ్స్ హాస్టల్ వద్ద ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. గల్ఫ్ దేశాలలో ఉన్న చమురు ఆయిల్ నిక్షేపాలను దోచుకోవడం లో భాగంగా పాలస్తీనాపై ఇజ్రాయిల్ ను యుద్ధం చేయటానికి కావలసిన ఆయుధ పరికరాలను, డబ్బును, సైనికుల్ని కూడా అమెరికా సప్లై చేస్తూ ఇజ్రాయిల్ ను తన అవసరాలకు అనుగుణంగా వాడుకుంటుందన్నారు. ఈ యుద్ధాన్ని ఆపాలని అనేక దేశాలు ప్రతిపాదించినను, ఖాతరు చేయడం లేదని, 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా ఇజ్రాయిల్ తోసిపుచ్చిందని తెలియజేశారు. మొత్తం ప్రపంచ యుద్ధ నియమాలను కూడా పాటించకుండా పాఠశాలలు, హాస్పిటల్స్ పైన, ప్రజా సామాన్యం ను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోందన్నారు. ఈ దాడులలో 50,000 మందికి పైగా మరణించగా అందులో 20,000 మంది పసిపిల్లలు, ఆడవాళ్లు ఉన్నారన్నారు. దుర్మార్గంగా సాగిస్తున్న ఈ యుద్ధాన్ని ఆపాలని, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని, యుద్దోన్మాదం నశించాలని, ప్రపంచ శాంతి నెలకొల్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పిడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. భాస్కర్ అధ్యక్షత వహించగా … కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు బి. జమిందార్,
కొత్తపల్లి రవిబాబు, ప్రధాన సంపాదకులు, ప్రజాసాహితి షేక్. జిలాని, ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులు డాక్టర్ సి. విజయ, రాష్ట్ర అధ్యక్షులు స్త్రీ విముక్తి ఎస్.కె.భాష, ఎన్.వై.ఎస్ ప్రధాన కార్యదర్శి
ఏ.సురేష్, పి.డి.ఎస్.ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.భాను తదితరులు మాట్లాడుతారన్నారు. ఈ యొక్క సమావేశానికి విద్యార్థులు, యువకులు, మేధావులు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ మండల నాయకులు ఏ. అఖిల్, పి.రామకృష్ణ, గణేష్, శివ, ఎన్. వై. ఎస్ నాయకులు టి. అర్జున్ , వై రాజు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన రేయిన్ బో పాఠశాల విద్యార్థిని

0

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : జిల్లాలో జరిగిన భగవద్గీత శ్లోకాలను పఠించే జిల్లాస్థాయి పోటీల్లో పెద్దకడబూరులోని రేయిన్ బో ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాల విధ్యార్థిని లావణ్య ప్రతిభ కనబరిచి మూడో స్థానంలో నిలిచింది. రేయిన్ బో పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న లావణ్య భగవద్గీతలోని 47శ్లోకాలను ఏకధాటిగా చెప్పి తృతీయ బహుమతి గెలుపొందారు. దీంతో మంగళవారం విద్యార్థిని లావణ్యను పాఠశాల కరస్పాండెంట్ గోవిందరెడ్డి, ఉపాధ్యాయులు ప్రసాద్, పుల్లయ్య, రామకృష్ణ, పాఠశాల సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ గోవిందరెడ్డి మాట్లాడుతూ భగవద్గీత శ్లోకాలను పఠించే జిల్లాస్థాయి పోటీల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని లావణ్య మూడో స్థానంలో నిలవడం తమ గర్వంగా ఉందని వెల్లడించారు.

మళ్లీ పైపైకి దూసుకెళ్తున్న పసిడి

0

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.750 పెరిగి రూ.72,050కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.820 పెరగడంతో రూ.78,600 పలుకుతోంది. కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ.4వేలు పెరిగి రూ.1,04,000కు చేరింది. గత 10 రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

దాని కోసమే నా పోరాటం: మంచు మ‌నోజ్

త‌న‌ ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్ మ‌రోసారి స్పందించారు. తాను ఆస్తులు, డ‌బ్బు కోసం పోరాటం చేయ‌డం లేద‌ని అన్నారు. తాను కేవ‌లం ఆత్మ‌గౌర‌వం కోస‌మే పోరాడుతున్నాన‌ని తాజాగా మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. తన ఇంటి దగ్గర హైడ్రామా నేపథ్యంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఁనాకు న్యాయం జ‌ర‌గ‌డం లేదు. పోలీసులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పోలీసులను ర‌క్ష‌ణ‌ అడిగితే నా అనుచరులను బెదిరిస్తున్నారు. నాకు న్యాయం జ‌రిగేవ‌ర‌కూ అంద‌రినీ క‌లుస్తా. నా బిడ్డలు ఇంట్లో ఉండగా దాడి చేయడం సరికాదు. నా భార్యాపిల్లలకు రక్షణ క‌ర‌వైంది. నా భార్యాపిల్లల రక్షణ కోసం బౌన్సర్లను తెచ్చుకున్నా. మా బౌన్సర్లను ఎందుకు బయటకు పంపారు. నేను డబ్బు, ఆస్తి కోసం పోరాటం చేయడం లేదు. నా ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానుఁ అని మంచు మ‌నోజ్ చెప్పుకొచ్చారు.

మోహన్‌బాబు ఫాంహౌస్ వద్ద ఉద్రిక్తత..

మంచు కుటుంబంలో గొడవల ఎపిసోడ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జల్లిపల్లిలోని ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంచి మనోజ్ బౌన్సనర్లు మరో వైపు విష్ణు బౌన్సర్లు మధ్య గొడవ జరిగింది. మనోజ్‌ను విష్ణు బౌన్సర్లు బయటకు పంపిస్తున్నారు. మౌనికతో బౌన్సర్లు వీడియో కాల్ మాట్లాడారు. విష్ణు బయటకు వచ్చి బౌన్సర్లుని బయటకు తోసేశారు. మోహన్ బాబు ఫామ్‌హౌస్‌కు పహడి షరీఫ్ పోలీసులు చేరుకున్నారు. మంచు మనోజ్ దాడి ఫుటేజ్ మాయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. తండ్రి మోహన్‌బాబు తనపై చేసిన ఫిర్యాదుపై మంచు మనోజ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని, ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నింటిని విజయ రెడ్డి , కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్లిపోయారని మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదని..ఆస్తుల కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని అన్నారు. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని ఫిర్యాదు చేశానన్నారు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరానన్నారు. కుటుంబ ఆస్తుల కోసం తాను ఎప్పుడూ ఆశ పడలేదని, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానని చెప్పారు. ఈ వివాదాల్లో తన కూతుర్ని తీసుకు రావడం చాలా బాధాకరమని అన్నారు. గత కొన్నాళ్లగా ఆ ఇంటి నుంచి తన కుటుంబంతో దూరంగానే ఉంటున్నామని, తన ముందే తన కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులను తీవ్రంగా తిట్టారని, ఇంటిలో ఉండాల్సిన సిసి ఫుటేజీ కెమెరాలు మాయమయ్యాయని, అన్న విష్ణు దుబాయ్‌కు ఎందుకు వెళ్ళాడో అందరికీ తెలుసునని అన్నారు.

విష్ణు అనుచరులే సిసి ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని, ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటిని విజయరెడ్డి , కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారని మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదని..ఆస్తుల కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని అన్నారు. తాను, తన భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నామని చెప్పారు. విద్యాసంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని, విద్యాసంస్థలోని బాధితులకు తాను అండగా ఉన్నానని.. బాధితుల పక్షాన నిలబడినందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మనోజ్ వ్యాఖ్యానించారు. కాగా మంచు కుటుంబంలో అగ్గి రాజుకుంది. సోమవారం అది ఊహించని మలుపులు తిరిగి పెద్ద మంటలా మారింది. మోహన్‌బాబు, ఆయన తనయుడు మనోజ్‌ .. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లడంతో వివాదం మరింత ముదిరింది. ఆస్తుల పంపకాల విషయంలో మోహన్‌బాబుకు, ఆయన చిన్న కొడుకు మనోజ్‌కు మధ్య గొడవ జరిగినట్లు, ఇద్దరూ కొట్టుకున్నట్లు ఆదివారం మీడియా వర్గాల్లో వార్తలు హల్‌చల్‌ చేశాయి. అదంతా నిజం కాదని, అబద్దపు వార్తలు ప్రచారం చేయొద్దని మోహన్‌బాబు ట్విటర్‌లో ప్రకటించిన కొన్ని గంటలకే బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఎంఎల్‌సీ (మెడికల్‌ లీగల్‌ సర్టిఫికెట్‌) చేయించిన మనోజ్‌ ఆ మెడికల్‌ రిపోర్టులతో సహా.. వెళ్లి పహాడీషరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఆదివారం పది మంది గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంటికి (జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసం) వచ్చి గట్టిగా అరుస్తూ భయబ్రాంతులకు గురిచేశారని, వారిని అడ్డుకునే సమయంలో తన దాడి చేశారనీ, ఇంటి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీలు ఎత్తుకెళ్లారని, దుండగులను పట్టుకొని చట్ట ప్రకారం శిక్షించాలని మనోజ్‌ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

మనోజ్‌, మౌనికపై సీపీకి ఫిర్యాదు చేసిన మోహన్‌బాబు

ఇదిలా ఉంటే తన కొడుకు మనోజ్‌, ఆయన భార్య మౌనిక, వారి అనుచరుల ద్వారా తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని రాచకొండ సీపీకి మోహన్‌బాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీపీకి రాసిన లేఖను మోహన్‌బాబు మీడియాకు విడుదల చేశారు. కొంతమంది సంఘ విద్రోహ శక్తులతో కలిసి తన ఇంటిని, ఆస్తులను లాక్కోవాలని చూస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. తన కొడుకు మనోజ్‌, కోడలు మౌనిక ప్లాన్‌ ప్రకారమే ఇదంతా జరుగుతున్నట్లు నమ్ముతున్నానని వెల్లడించారు. తను 78 ఏళ్ల సీనియర్‌ సిటిజన్‌ననీ, తనకు రక్షణ కల్పించాలని అభ్యర్థిస్తున్నట్లు సీపీకి రాసిన లేఖలో మోహన్‌బాబు పేర్కొన్నారు. తన తండ్రి, అన్న విష్ణు అనుచరులు తనపై దాడిచేశారని మనోజ్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లడం, మనోజ్‌ దంపతులు వల్లనే తనకు ప్రాణహాని ఉందని మోహన్‌బాబు సీపీకి లేఖ రాయడం.. వంటి ఊహించని మలుపులతో కథ క్లైమాక్స్‌కు చేరింది. అసలు మోహన్‌ బాబు ఇంట్లో ఏం జరుగుతోందని అటు సినీ అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతోంది.

వచ్చే సంక్రాంతి నుంచే ఉచిత బస్సు ప్రయాణం ..

వివరాలు వెల్లడించిన టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ

కొత్త బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకం అమలుపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట రావు ట్విట్టర్ లో కీలక ప్రకటన చేశారు. వచ్చే సంక్రాంతి నుంచే ఫ్రీ జర్నీ అమలు చేస్తామని, దీనికోసం ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోందని ట్వీట్ చేశారు. పథకం అమలు వల్ల బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో కొత్త బస్సులు కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించిందని చెప్పారు. ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపించారని, సీఎం వాటిని పరిశీలిస్తున్నారని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా ఆటో డ్రైవర్లు నష్టపోకూడదని ప్రభుత్వం భావిస్తోందని, దీనికి అనుగుణంగా పథకం విధివిధానాలు రూపొందిస్తున్నామని యార్లగడ్డ పేర్కొన్నారు.

రామ్ గోపాల్ వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు

వివాదస్ప‌ద‌ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో భారీ ఊరట లభించింది. సోష‌ల్ మీడియాలో టిడిపి,జ‌న‌సేన నేత‌లపై ఆయ‌న పోస్ట్ లు పెట్ట‌డంపై ఎపిలో వివిధ పోలీస్ స్టేష‌న్ ల‌లో ఆయ‌నపై కేసులు న‌మోద‌య్యాయి.. దీనిపై ఆయ‌న హైకోర్టులో ముంద‌స్తు బెయిల్ కోసం పిటిష‌న్ ను దాఖ‌లు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు మొత్తం మూడు కేసులు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎప్పుడు పిలిస్తే అప్ప‌డు పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని, పోలీసుల‌కు పూర్తిగా స‌హ‌క‌రించాల‌ని కండిష‌న్ విధించింది కోర్టు. ఇది ఇలా ఉంటే 2022 సంవత్సరంలో వ్యూహం సినిమా ప్రమోషన్స్లో భాగంగా టీడీపీ, జనసేన అధినేతలతో పాటు నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టారని పలువురు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఫిర్యాదులు రాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆర్జీవీ ని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. విచార‌ణ‌కు గైర్హాజ‌రైన ఆర్జీవి తనపై నమోదైన కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయ‌న‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు.