విశాలాంధ్ర- అనంతపురం : అనంత జిల్లా వైష్ణ సంఘ ఆధ్వర్యంలో లక్ష్మీ హయగ్రీవ లక్ష్మీ వెంకటేశ్వర గోదా రంగనాథ్ స్వామి దేవస్థానం శ్రీ క్షేత్రం తపోవమ్ నందు డిసెంబర్ 16 నుంచి జనవరి 13 వరకు జరుగు ధనుర్మాస వ్రత మహోత్సవ గోదా రంగనాథ తిరు కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను సోమవారం ఆలయ కమిటీ అధ్యక్షులు జ్వాలాపురం శ్రీకాంత్ ఆలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి అంబళం రఘునాథ్, పిటి శేషాచార్యులు, రాళ్లపల్లి, లక్ష్మణ్ , అర్చకులు రంగ భరణి, రాఘవేంద్ర చారి మహిళా సభ్యులు సంధ్య , హరిప్రియ,విష్ణు ప్రియ, చేతన మరియు విష్ణు సహస్రనామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
నేత్రదానం రెండు జీవితాలలో వెలుగు నింపుతుంది….
రోటరీ క్లబ్ జిల్లా అధికారి నరేందర్ రెడ్డి.
విశాలాంధ్ర ధర్మవరం:: నేత్రదానం రెండు జీవితాలలో వెలుగు నింపుతుందని రోటరీ క్లబ్ జిల్లా అధికారి నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేత్రదానం చేసి, అందత్వాన్ని నివారించాలని, అప్పుడే కంటి చూపు లేని వారికి కంటి వెలుగు రావడం జరుగుతుందని తెలిపారు. ప్రతి వ్యక్తి రక్త దానం ,నేత్రదానమును అలవర్చుకోవాలని తెలిపారు. అదేవిధంగా కంటిపట్ల ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సొంత వైద్యం కంటికి ప్రమాదం అవుతుందని తెలిపారు. ఇప్పటికే మా రోటరీ క్లబ్ ద్వారా ప్రతినెల నిర్వహించే ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం వేలాదిమందికి కంటి చూపును ఇవ్వడం జరిగిందని తెలిపారు. నేత్రదానంపై, కంటి పట్ల భద్రతపై, రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని తెలిపారు. అప్పుడే మానవతా విలువలు పెరిగి, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. పుట్టినప్పుడు ఎలా వస్తామో, మరణించినప్పుడు కూడా అలాగే వెలుతామని తెలిపారు. మానవసేవే మాధవసేవ అని పెద్దలు అన్నారని, మనము పేదల పట్ల అభిమానం, ఆప్యాయత, గౌరవంతో పాటు వారిని తమకున్న స్తోమత లో ఆదుకోవాలని తెలిపారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలలో మా రోటరీ క్లబ్ మంచి గుర్తింపు రావడం మాకు ఎంతో తృప్తిని, సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు. దాతల సహాయ సహకారంతో శిబిరాలను నిర్వహించడం మాకెంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. కాబట్టి నేత్రదానం విషయంలో అందరూ కూడా మంచి హృదయంతో ముందుకు వెళ్లాలని తెలిపారు.
అవయవ దానం అరుదైన అవకాశం.. యువర్స్ ఫౌండేషన్
అవయవ దానం అరుదైన అవకాశం.. యువర్స్ ఫౌండేషన్
విశాలాంధ్ర ధర్మవరం:: అవయవ దానం అరుదైన అవకాశం అని యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి బండి నాగేంద్ర, పి.ఆర్.ఓ రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేత్రదానం నేడు మహాదానం అవుతుందని, నేత్ర ధానముతో ఇరువురికి కంటి వెలుగును ప్రసాదించవచ్చునని తెలిపారు. కళ్లదానం చేయాలి అనుకుంటే మరణానంతరం మాత్రమే నేత్రాలను దానం చేసే అవకాశం ఉందని తెలిపారు. మరణించిన నాలుగు నుంచి ఆరు గంటల లోపు కళ్ళను దానం చేయవచ్చునని తెలిపారు. వయసు లింగభేదం లేకుండా ఎవరైనా కూడా నేత్రదానం చేయవచ్చునని, ఆ నేత్రదానం అనేది అంతక్రియల లాంచనాలకు ఆలస్యం చేయదని తెలిపారు. నేత్ర ధానమును కేవలం 10 లేదా 15 నిమిషాలలో మాత్రమే సమయం పడుతుందని తెలిపారు. ఒక కంటి దాత ఇద్దరు కార్నియల్ అందవ్యక్తులకు దృష్టిని అందించగలుగుతారని తెలిపారు. అందమైన కళ్ళను మట్టిలో కలపడం అగ్నికి ఆహుతి చేసి బూడిదగా మార్చడం కంటే ప్రపంచమే చీకటిగా బ్రతుకుతున్న చూపులేని వారి కోసం, మీ కళ్ళను దానం చేసి మానవతా విలువను పెంచుకోవాలని తెలిపారు. కళ్లను దానం చేసి, చీకట్లకి వెలుగును నింపే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన కలిగినప్పుడే చూపు లేని వారికి కంటి వెలుగును ప్రసాదించే అవకాశం ఎంతైనా ఉందని వారు తెలిపారు.
సజావుగా ఎన్ఎంఎంఎస్ పరీక్షలు.. జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ లాజర్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో, కొత్తపేట మున్సిపల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల (3 పరీక్షా కేంద్రాలు) ల పరీక్షా కేంద్రాలలో ఎన్ఎంఎంఎస్ ప్రవేశ పరీక్షలు సజావుగా నిర్వహించడం జరిగిందని జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ లాజర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ధర్మవరంలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ముగ్గురు చీఫ్ ఆఫీసర్లు, ముగ్గురు డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో పాటు ఇన్విజిరేటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 240 మంది విద్యార్థులకు గాను 234 మంది పరీక్షలకు హాజరు హాజరు కావడం జరిగిందని, అదేవిధంగా ప్రభుత్వ జడ్పీ గర్ల్స్ హై స్కూల్ లో 168 మంది విద్యార్థులకు గాను 162 మంది విద్యార్థులు హాజరు, తదుపరి పట్టణములోని కొత్తపేటలో గల మున్సిపల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 153 మందికి గాను 147 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం జరిగిందని తెలిపారు. మొత్తం మూడు పరీక్ష కేంద్రాలలో561 మంది 543 మంది విద్యార్థులు హాజరుకాగా 96.8 శాతము నమోదు కావడం జరిగిందన్నరు. పరీక్ష ఫలితాలు మరో రెండు నెలలు రాగలవని తెలిపారు. మూడు పరీక్షా కేంద్రాలలో తాను ఆకస్మికంగా పరిశీలించడం జరిగిందని, పరీక్షా విధి విధానాల్లో తగిన సలహాలను సూచనలను పరీక్ష కేంద్ర ఇన్విజిలేటర్లకు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పరీక్ష చీప్ అధికారులు సుమన, రమేష్, శైలజ, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు ప్రమీల, ఉమాపతి, అనంత పద్మనాభులు, పరీక్షా సిబ్బంది పాల్గొన్నారు.
పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యం
అధ్యక్షులు జయసింహ, కోశాధికారి సుదర్శన గుప్తా
విశాలాంధ్ర ధర్మవరం : పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యము అని అధ్యక్షలు జయ సింహా, కోశాధికారి సుదర్శన్ గుప్తా క్యాంపు చైర్మన్ పెరుమాళ్లదాస్ తెలిపారు.తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని కోట మున్సిపల్ పాఠశాలలో ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి-బెంగళూరు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ అనంతపురం జిల్లా వారి సహకారంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు దాసరి కేశమ్మ, కీర్తిశేషులు దాసరి పెద్ద వెంకటేశులు జ్ఞాపకార్థం కోడలు దాసరి రమాదేవి, కుమారుడు డివి.వెంకటేశులు (చిట్టి) అండ్ సన్స్ వారు వ్యవహరించడం జరిగిందని తెలిపారు. ఈ ఉచిత శిబిరంలో 134 మంది రోగులకు కంటి వైద్య పరీక్షలను నిర్వహించగా అందులో 82 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. వీరికి ఉచిత వసతి, ఉచిత రవాణా సౌకర్యం, ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామని తెలిపారు. బెంగుళూరు శంకరా కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అపేక్ష రోగులకు కంటి వైద్య పరీక్షలను నిర్వహించి, కంటిపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వారు వివరించడం జరిగిందని తెలిపారు. అనంతరం డాక్టర్ అపేక్ష మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ కంటిని కనీసం సంవత్సరానికి ఒకసారి పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. నేడు చిన్న పిల్లలతో మొదలుకొని పెద్దలు వరకు కంటి పట్ల వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపారు. కన్ను కనపడకపోవడం అనేది ఒక అద్దాలతో మాత్రమే సరికాదని, కంటిలో నరం సమస్య కానీ పొర సమస్య కాని ఉండవచ్చునని తెలిపారు. తదుపరి ముఖ్యంగా షుగరు, బిపి ఉన్నవారు కచ్చితంగా ప్రతి సంవత్సరం ఒకసారి అయినా రెటీనా పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. చిన్నపిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్లు, టీవీలు చూడరాదని, అలా చూస్తే కంటికి గ్లాస్ పవర్ అనేటువంటిది రావడం జరుగుతుందని తెలిపారు. డాక్టర్ని సంప్రదించకుండా మెడికల్ స్టోర్ లో ఎటువంటి కంటి డ్రాప్స్ తీసుకోకూడదని తెలిపారు. అలా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా సోకుతుందని తెలిపారు. అనంతరం రోటరీ క్లబ్ కమిటీ వారు హాస్పిటల్ డాక్టర్ను, క్యాంపు దాతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, సత్రశాల ప్రసన్నకుమార్, సోలిగాళ్ళ వెంకటేశులు, రమేష్ బాబు, రామకృష్ణ, శివయ్య, కొండయ్య, శ్రీనివాస్ రెడ్డి, గట్టు హరినాథ్, ఇన్నర్ వీల్ క్లబ్బు రాజేశ్వరి, అంబిక, వాలంటీర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
క్యాన్సర్ వ్యాధిగ్రస్తునికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేయుత
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని కేతిరెడ్డి కాలనీలో నివాసముంటున్న కానాల హరీష్-31 సంవత్సరాలు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మంచానికి పరిమితమైనాడు. సమాచారం అందుకున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు వ్యాధిగ్రస్తుని ఇంటికి చేరుకొని, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున రూ.35,000 నగదును అందజేశారు. హరీష్ తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దాతలు ఎవరైనా ఇంకను ఆర్థిక సహాయము సహాయము అందించాలని కోరారు. హరీష్ కు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు కూడా కలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తల్లం నారాయణమూర్తి,ఉపాధ్యక్షులు జగ్గా వేణుగోపాల్, కార్యదర్శి మంజునాథ్, డైరెక్టర్లు సాయి ప్రసాద్, రామకృష్ణ ,రవి తదితరులు పాల్గొన్నారు.
దంతాల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి..
దంత వైద్యులు వివేక్, విక్రమ్
విశాలాంధ్ర- ధర్మవరం : దంతాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని దంత వైద్యులు వివేక్, విక్రమ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల డాక్టర్ కుళ్లాయప్ప గారి ఆషా హాస్పిటల్ లో దంతముల కొరకు “ఉచిత దంత వైద్య శిబిరమును” నిర్వహించారు. ఆషా హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కుళ్లాయప్ప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం దంత వైద్యులు వివేక్ ,విక్రమ్ మాట్లాడుతూ విద్యార్థులకు కూడా ఉచిత దంత ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ప్రతి ఆదివారం ఈ ఉచిత క్యాంపు నిర్వహించబడుతుందని తెలిపారు, విద్యార్థులు తప్పనిసరిగా గుర్తింపు కార్డు వెంట తీసుకొని రావాలని తెలిపారు. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికీ దంత వైద్య పరీక్షలను నిర్వహించడంతోపాటు, దంతాల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 30 మందికి దంత వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ప్రతి సోమవారం ఉచిత చర్మ వైద్య శిబిరము కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రత్యేక చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ నీరజ చే వైద్య చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కుళ్లాయప్ప, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
రాయచోటి ఉపాధ్యాయుని మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి
– యుటిఎఫ్ డిమాండ్
విశాలాంధ్ర- ధర్మవరం ; రాయచోటి ఉపాధ్యాయుని మృతికి కారకులైన వారిని వెలువెంటనే కఠినంగా శిక్షించాలని యూత్ జిల్లా అధ్యక్షులు సెట్టిపి జయ చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇజాజ్ అహమ్మద్ కుటుంబాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి అని తెలిపారు. రాయచోటి పట్టణం లోని కొత్తపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఇజాజ్ అహమ్మద్ మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోందని తెలిపారు. తొలుత పట్టణంలోని స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో ఆయన మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.42 సంవత్సరాలు ఉన్న ఇజాజ్ అహ్మద్ ఇంకా 20 సంవత్సరాలు సర్వీస్ ఉండగానే ఇలా దురదృష్టంగా మరణించడం వారి కుటుంబానికి తీవ్ర నష్టమని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారి కుటుంబానికి నష్ట పరిహారం అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే పాఠశాలలో నైతిక విలువలు పెంపొందించే చర్యలు అధికారికంగా చేపట్టే విధంగా మేధావులు, ఉపాధ్యాయ సంఘాలతోను, ప్రజా సంఘాలతో చర్చించి, తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా పాఠశాలలో జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ చేసి బాద్యులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం జోన్ యుటిఎఫ్ నాయకులు హనుమంతరావు, రామకృష్ణ నాయక్, లక్ష్మయ్య, అమర్ నారాయణరెడ్డి, సకల చంద్రశేఖర్ ,పెద్దకోట్ల సురేష్, సాయి గణేష్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
చెన్నమనేని రమేశ్ కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు
బీఆర్ఎస్ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఆయన జర్మనీ పౌరుడేనని తేల్చింది. జర్మన్ పౌరుడిగా కొనసాగుతూనే తప్పుడు పత్రాలతో ఎమ్మెల్యేగా గెలిచారని పేర్కొంది. తప్పుడు పత్రాలతో పదిహేనేళ్లుగా కోర్టును తప్పుదోవ పట్టించారంటూ చెన్నమనేనిపై మండిపడింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. కోర్టును, ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు 30 లక్షలు జరిమానా విధించింది. అందులో రూ.25 లక్షలు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కు, మిగతా 5 లక్షలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి నెల రోజుల్లోపు చెల్లించాలని ఆదేశించింది.చెన్నమనేని రమేశ్ బాబు జర్మన్ పౌరుడని, ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు. 2014లో బీఆర్ఎస్ పార్టీ తరఫున వేములవాడ నియోజకవర్గం నుంచి రమేశ్ బాబు అసెంబ్లీకి పోటీ చేయగా.. కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆది శ్రీనివాస్ పై 5 వేల ఓట్ల మెజారిటీతో రమేశ్ బాబు గెలుపొందారు. దీనిపై ఆది శ్రీనివాస్ కోర్టుకెక్కారు. రమేశ్ బాబు దాఖలు చేసిన అఫిడవిట్ తప్పుల తడక అని, రమేశ్ బాబుకు జర్మనీ పౌరసత్వం ఉందని ఆరోపించారు. ఈ కారణంగా రమేశ్ బాబు ఎన్నిక చెల్లదని వాదించారు. ఈ కేసు విచారణలో ఉండగానే 2018 లో మరోసారి అసెంబ్లీ ఎన్నికలు జరగగా రమేశ్ బాబు వేములవాడ నుంచి మళ్లీ గెలుపొందారు. తాజాగా ఈ కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది.
నటి జెత్వానీ కేసు.. కుక్కల విద్యాసాగర్ కు బెయిల్
ముంబై సినీ నటి జెత్వానీ కేసులో నిందితుడు కుక్కల విద్యాసాగర్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. జెత్వానీ, పోలీసుల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్, విద్యాసాగర్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదలను వినిపించారు.వాదనల సందర్భంగా నర్రా శ్రీనివాస్ తన వాదనలను వినిపిస్తూ… విద్యాసాగర్ కు బెయిల్ మంజూరు చేస్తే కేసును ప్రభావితం చేస్తాడని చెప్పారు.ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా తాతా, విశాల్ గున్నీ, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ లతో పాటు అధికారులందరిపైనా సస్పెన్షన్ వేటు పడింది.

