Home Blog Page 1482

మామిడి సాగు చేసిన రైతులకు అవగాహన సదస్సు..

జిల్లా ఉద్యాన అధికారి చంద్రశేఖర్
విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని ఏలుకుంట్ల గ్రామములో గల రైతు సేవ కేంద్రం నందు మామిడి సాగు చేసిన రైతులకు అవగాహన సదస్సును జిల్లా ఉద్యాన అధికారి చంద్రశేఖర్, డివిజన్ ఉద్యాన అధికారిని అమరేశ్వరి నిర్వహించారు. మామిడి చిగుళ్ళు మొగ్గ రావడానికి 0.52:34(మూడు గ్రాములు), సూపర్ కాన్ఫిడర్ అర్ధ మిలిటరీ, ఆగ్రోమిన్ మాల్స్ రిక్సోలిన్ ఒక గ్రామం, కాంటాక్ట్ భావిస్టిక్ షాపు మూడు గ్రాములు కలిపి స్ప్రే చేయడం ద్వారా చిగుళ్ళు మొగ్గ రావడానికి అనుకూలమైన సమయం ఏర్పడుతుందని తెలిపారు. తదుపరి స్ప్రే చేశాక డిసెంబర్లో 8వ రోజు లేదా 10వ తేదీ వర్షం పడకపోతే తప్పక నీరు పెట్టాలని తెలిపారు. నీరు పెట్టేటప్పుడు సల్ఫర్ లిక్విడ్ ను నాలుగు లీటర్ల డ్రిప్ ద్వారా పంపాలని తెలిపారు. స్ప్రే చేసేటప్పటికీ పూత రాకపోతే డబుల్ ఒక ఎం ఎల్తో పాటు విపుల్ 3 ఎం ఎల్ లేదా ఫ్రాన్పిక్స్ 10 లీటర్లు, సైటు జైమ్ 20 ఎంఎల్ కలిపి స్ప్రే చేయాలని తెలిపారు. అలాగే పురుగు గురుడు చెట్టు మొదలు లో ఉన్నట్లయితే కరాటే డిసిసెస్ అర్ధా ఎమ్మెల్, స్ప్రే చేయాలని తెలిపారు. అనంతరం రైతులకు వచ్చిన అనుమానాలను కూడా నివృత్తి చేయడం జరిగిందని తెలిపారు. పంటల ఎడల తగిన శ్రద్ధ తప్పనిసరి ఉండాలని. ఎప్పటికప్పుడు అధికారుల సలహా సూచనలతో పంట దిగుబడి వచ్చే విధంగా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకములు ప్రజలు సద్వినియోగం చేసుకోండి..

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకములను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని రేగాటిపల్లి గ్రామంలో హౌసింగ్ ఏఈ. భార్గవి, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులతో కలిసి సమావేశాన్ని ఏర్పరిచారు. అనంతరం చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 1.5 లక్షలు రూపాయలు, రాష్ట్ర షేర్ కింద లక్ష రూపాయలు, అలాగే జాబ్ కార్డు ఉంటే అదనంగా 30 వేల రూపాయలు మొత్తం వెరసి రూ .2,80,000, స్థలము ఉండి ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మిస్తుందని వారు తెలిపారు. పేదలకు ఇల్లు నిర్మించడమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని తెలిపారు. తదుపరి అర్హులైన లబ్ధిదారులతో దరఖాస్తులను ప్రాసెసింగ్ మొదలు పెట్టాలని హౌసింగ్ ఏఈ, సచివాలయ సిబ్బందికి సూచించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా సచివాలయం కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ బాస్కెట్ బాల్ రాష్ట్ర జట్టుకు ధర్మవరం బాలిక ఎంపిక

సెట్టిపి జయచంద్రారెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం : జాతీయ స్థాయిలో ఈ నెల నవంబర్ 29 తేదీ నుండి డిసెంబర్ 05 తేదీ వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తా నగరంలో జరిగే 39వ యూత్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టు నందు ధర్మవరం పట్టణానికి చెందిన కిరణ్మయి బాస్కెట్బాల్ క్రీడాకారిణి ఎంపికయ్యారని ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టిపి జయ చంద్రా రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం మే 21వ తేదీ నుండి 24 వరకు విజయవాడ నగరంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల నందు ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టు నందు ఎంపికై ఉమ్మడి జిల్లా జట్టులో చక్కగా రాణించి రాష్ట్ర జట్టుకి ఎంపిక అవడం హర్షనీయమని అభినందనీయమని వీరి ఎంపిక పట్ల అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామి రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రా రెడ్డి కార్యదర్శి వాయల్పాడు హిదయ తుల్లా, కోచ్ సంజయ్, హర్షం వ్యక్తం చేశారు . కిరణ్మయి జాతీయ స్థాయిలో రాణించి ధర్మవరం పట్టణమునకు పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారు… బాలికల ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టులో కిరణ్మయి ఒక్కరే జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ జట్టుకి ఎంపిక కావడం ధర్మవరం పట్టణానికి గర్వకారణం అని అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు.

దేశ ప్రజల సర్వతో ముఖాభివృద్ధిని కాంక్షించే సమున్నత ఆశయమే భారత రాజ్యాంగం

ఆర్డిఓ మహేష్
విశాలాంధ్ర ధర్మవరం : దేశ ప్రజల సర్వతో ముఖాభివృద్దిని కాంక్షించే సమున్నత ఆశయమే భారత రాజ్యాంగం అని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ దినోత్సవం (75 వసంతాల రాజ్యాంగం) పురస్కరించుకొని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో మహేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కార్యాలయ అధికారులు సిబ్బంది పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆర్డీవో మహేష్ మాట్లాడుతూ రాజ్యాంగానికి ఆమోదం లభించిన రోజు అంటే నవంబర్ 26న ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. భారత రాజ్యాంగము అంటే కేవలం దేశ పరిపాలనకు సంబంధించిన నియమాలు సూత్రాల సమాహారం కాదు అని స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలు ,మూల స్తంభాలుగా ఉన్నావని తెలిపారు. ఈరోజు మనమందరము అనుభవిస్తున్న స్వేచ్ఛ సమానత్వం రాజ్యాంగం నుంచి సక్రమించినదేనని తెలిపారు. ప్రజా ప్రయోజనానికి అనుగుణంగా నడుచుకోవాలని రాజ్యాంగం నిర్దోషిస్తుందని తెలిపారు. ఈ రాజ్యాంగం చేసిన నిర్మాతలకు వారు వందనాలు తెలిపారు. అనంతరం కార్యాలయ సిబ్బంది చేత ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో డిఏఓ- కతి జూన్ కుప్రా, లక్ష్మీదేవి తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

ధర్మవరంలో మున్సిపాలిటీ రిజర్వ్ స్థలాన్ని కాపాడండి…

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి-మధు
విశాలాంధ్ర ధర్మవరం: ధర్మవరం మున్సిపాలిటీ రిజర్వు స్థలాలను కాపాడాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యదర్శి మధు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో మున్సిపాలిటీ రిజర్వ్ స్థలాల్లో చాలావరకు ఇప్పటికే అక్రమాలు జరుగుతున్నాయి అని, సర్వే నంబర్లు 31,649, 650,ఇలా చాలా సర్వే నంబర్లు మన మున్సిపాలిటీ రిజర్వ్ స్థలాన్ని అక్రమార్కులు కబ్జాకి గురి చేయడం జరిగిందన్నారు. తదుపరి వైస్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, కేతిరెడ్డి కాలనీ, తుంపర్తి కాలనీ ల లో కూడా అన్యాక్రాంతం కావడం జరిగిందన్నారు..ఇప్పటికే ధర్మవరం పట్టణంలో చాలా చోట్ల రిజర్వ్ స్థలాల్ని కబ్జాకి గురికావడం జరిగిందని, విచారణ జరిపి ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్యక్రాంతం కాకుండా కాపాడాలని వారు తెలిపారు. అదేవిధంగా మున్సిపాలిటీ ప్లానింగ్ అప్రూవల్ లేకుండా భవంతులు నిర్మిస్తున్నారని, మున్సిపాలిటీకి రావలసిన ఆదాయాన్ని గండి కొడుతున్నారని తెలిపారు. కానీ అధికారులు మాత్రం చూసి చూస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు అని తెలిపారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఈ కార్యక్రమం లో సిపిఐ పట్టణ కార్యదర్శి, పి.రవికుమార్,సహాయ కార్యదర్శి వై.రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు వెంకట నారాయణ, వెంకటస్వామి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు, రాజా,,పట్టణ నాయకులు,శ్రీధర్,బాల రంగయ్య, భుజంగం,శ్రీనివాసులు,ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి…

విశాలాంధ్ర – కొయ్యలగూడెం : తెలుగుదేశం పార్టీలో సభ్యత్వ కార్యక్రమానికి అనూహ్యస్పందన లభిస్తుందని టిడిపి పట్టణ అధ్యక్షులు జేష్ఠ రామకృష్ణారావు తెలిపారు. మండల కేంద్రం కొయ్యలగూడెం పట్టణంలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జేష్ట రామకృష్ణారావు మాట్లాడుతూ ప్రజలు, టిడిపి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. టిడిపి సభ్యత్వం తీసుకోవడం సమాజంలో ఒక గౌరవం, గుర్తింపుగా మారిందన్నారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇచ్చిన రాజకీయ విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ అన్నారు. కేవలం 100 రూపాయల సభ్యత్వంతో రూ.5 లక్షల భీమా సౌకర్యం కల్పించేలా టిడిపి సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. టిడిపి సభ్యత్వం తీసుకోవడంతో పేద,బడుగు, బలహీన,వర్గాల ప్రజలందరికీ ప్రమాద బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వానికే సాధ్యమని అన్నారు. టిడిపి కార్యకర్తలు, ప్రజలందరూ టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు దొడ్డపనేని దుర్గాదేవి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

వర్మపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 కేసుల నమోదు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన రామ్ గోపాల్ వర్మపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 కేసులు నమోదయ్యాయి. ఒంగోలు పోలీసులు ఆయనకు రెండు సార్లు నోటీసులు జారీ చేసినా ఆయన విచారణకు హాజరు కాలేదు. అంతేకాదు, అరెస్ట్ భయంతో ఆయన అజ్ఞాతంలోకి వెల్లిపోయారు. వర్మ కోసం 6 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళలో పోలీసులు గాలిస్తున్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని నిన్న ఒక వీడియోను వర్మ విడుదల చేశారు. మరోవైపు వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తుందా? లేదా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.

నేడు తమిళనాడును తాకనున్న ఫెంగల్ తుపాను.. స్కూళ్లు మూత

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి నేడు తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ తుపానుకు ాఫెంగల్్ణగా నామకరణం చేసింది. సైక్లోన్ ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మయిలాదుతురై, తిరువారూర్, నాగపట్టణం, చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్‌పేట్, కడలూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్ఎంసీ) పేర్కొంది. దీంతో చెన్నై, చెంగల్‌పట్, కడలూర్, మయిలాదుతురై ప్రాంతాల్లో ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. నాగపట్టణం, మయిలాదుతురై, తిరువారూర్‌ ప్రాంతాల్లోనూ తుపాను ప్రభావం చూపే అవకాశం ఉండడంతో స్కూళ్లు, కాలేజీలు మూతపడనున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా రేపటి వరకు ఓ మాదిరి వర్షాలతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కడలూర్, మయిలాదుతురైలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ నిన్ననే రెడ్ అలెర్ట్ జారీచేసింది. చెన్నైలో నేటి వరకు ఎల్లో అలెర్ట్ జారీచేయగా, పొరుగున ఉన్న కాంచీపురం, తిరువళ్లూర్, చెంగల్‌పట్‌లకు బుధ, శనివారాల మధ్య ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది.

ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ

ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం భేటీ అయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో పవన్ సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన అంశాల పైన చర్చించారు. ఇదే సమయంలో పార్లమెంట్ కు వెళ్లిన పవన్ కల్యాణ్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు సమస్యలపై 20నిమిషాలు చర్చించారు.

హిజ్బుల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సమ్మతి

ఇజ్రాయెల్ -హిజ్బుల్లా మద్య కాల్పుల విరమణ
కాల్పుల విరమణపై ఎక్స్ వేదికగా వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్
ఇజ్రాయెల్ ఉ హిజ్బుల్లా మధ్య కాల్పులకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ాశుభవార్త. నేను ఇజ్రాయెల్ ఉ లెబనాన్‌ల ప్రధానులతో మాట్లాడాను. టెల్‌అవీవ్ ఉ హిజ్బుల్లాల మధ్య విధ్వంసకర ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని ఆమెరికా చేసిన ప్రతిపాదనను వారు అంగీకరించారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయం్ణ అని బైడెన్ పేర్కొన్నారు.

ఆమెరికా దౌత్యంతో లెబనాన్‌లో యుద్ధానికి ముగించడానికి మార్గం సుగమమయింది. ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం ఆమోదించడంతో లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆగిపోయాయి. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య జరిగిన యుద్ధంలో లెబనాన్‌లో సుమారు 3,800 మంది మరణించగా, 16వేల మందికిపైగా గాయపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్ నుంచి వైదొలగవలసి ఉండగా, లెబనాన్ సైన్యం తమ సరిహద్దులోని భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకుంటుంది.

ఇక ఈ కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. రానున్న రోజుల్లో గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలకు ఆమెరికా, టర్కీ, ఈజిప్ట్, ఖతార్ దేశాల నాయకులతో చర్చలు జరుపుతామన బైడెన్ వివరించారు. కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షించారు. లెబనాన్ తాత్కాలిక ప్రధాని నజీబ్ మికాలి ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. మరో వైపు ఈ పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యూహు కూడా స్పందించారు. ఈ ఒప్పందం ఎన్ని రోజులు ఉంటుందనేది లెబనాన్ పైనే ఆధారపడి ఉందన్నారు. తాము ఒప్పందాన్ని అమలు చేస్తామని, కానీ ఉల్లంఘనలు జరిగితే మాత్రం బలంగా ప్రతిస్పందిస్తామని పేర్కొన్నారు.