హైదరాబాద్ శివారు మణికొండ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. పుప్పాలగూడలోని ఈఐపీఎల్ అపార్ట్‌మెంట్ 9వ అంతస్తులో మంటలు చెలరేగడంతో అపార్ట్‌మెంట్ వాసులు భయంతో పరుగులు తీశారు. ఈ అపార్ట్‌మెంట్‌లోని తొమ్మిదో ఫ్లోర్‌లో గల ఒక ప్లాట్‌లో మూడు రోజుల క్రితం గృహప్రవేశం జరిగింది. ఆ సందర్భంగా ఫ్లాట్‌లో వెలిగించిన దీపం బుధవారం కిందపడటంతో మంటలు అంటుకున్నాయని సమాచారం. ఆపార్ట్‌మెంట్ వాసుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫ్రాన్స్‌లో సామూహిక అత్యాచార ఘటన.. ప్రతిష్ఠాత్మక లౌవ్రే పిరమిడ్ వద్ద వేలాదిమంది మహిళల టాప్‌లెస్ నిరసన!
లైంగిక హింస, అసమానతలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో వేలాదిమంది మహిళలు, పురుషులు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా ప్రతిష్ఠాత్మక లౌవ్రే పిరమిడ్ ముందు మహిళలు టాప్‌లెస్‌గా ప్రదర్శన నిర్వహించారు. లైంగిక దాడులు, అసమానతలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. లైంగిక నేరాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని, పునరుత్పత్తి హక్కులను రక్షించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ామహిళలపై యుద్ధాలు ఆపండి్ణ, ామహిళలకు జీవన స్వేచ్ఛ కల్పించండి్ణ అని నినదిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. మహిళల నిరసన ప్రదర్శనను పోలీసులు నిశ్శబ్దంగా తిలకించారు తప్పితే అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. గిసెల్ పెలికాట్ అనే మహిళపై ఆమె మాజీ భర్త సహా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. లైంగిక హింసకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. కాగా, మహిళలకు మద్దతుగా పురుషులు కూడా ఈ నిరసన ప్రదర్శనల్లో పాలు పంచుకున్నారు. లైంగిక ఆధారిత హింసపై సమష్టిగా పోరాడాల్సిన బాధ్యత అందిరిపైనా ఉందని ఈ సందర్భంగా వారు నొక్కి చెప్పారు.
లక్ష అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కార్ల మైలురాయికి చేరిన టీకేఎం
బెంగుళూరు: టొయోటా కిర్లోస్కర్ మోటర్ (టికెఎం) తాజాగా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ భారతదేశంలో 1,00,000-యూనిట్ అమ్మకాల మైలురాయిని అధిగమించిందని ప్రకటించింది. ఈ విజయం బి-ఎస్యువి బలమైన మార్కెట్ అంగీకారాన్ని, హైబ్రిడ్ టెక్నాలజీకి పెరుగుతున్న భారతీయ కస్టమర్ల ఆదరణను నొక్కి చెబుతుంది. జూలై 2022లో విడుదల చేయబడిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టొయోటా ప్రపంచ-స్థాయి హైబ్రిడ్ సాంకేతికతను డైనమిక్ డిజైన్, ప్రీమియం సౌలభ్యం,అసాధారణమైన పనితీరుతో సజావుగా మిళితం చేస్తుంది. ఇది మూడు పవర్‌ట్రెయిన్‌లలో లభిస్తుంది- సెల్ఫ్-చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్‌హెచ్‌ఈవీ, నియో డ్రైవ్ మరియు సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌లు.
డిఫెండర్ జర్నీ మూడో ఎడిషన్ ప్రారంభం
ముంబయి: ప్రతిష్టాత్మకమైన డిఫెండర్ జర్నీస్ మూడో ఎడిషన్ ప్రారంభమైంది. ‘డిఫెండర్ జర్నీస్’ పేరుతో నిర్వహించే ఈ రైడ్… నవంబర్ 2024 నుంచి భారతదేశం మొత్తం 21 ప్రత్యేక ప్రాంతాల్లో జరుగుతుంది. డిఫెండర్ ఎస్‌యూవీలలో ఇది మొదటి-రకం, ఏకైక లగ్జరీ, సెల్ఫ్-డ్రైవ్, అనుభవపూర్వక ప్రోగ్రామ్. డిఫెండర్ వెహికల్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఆఫ్-రోడ్ వెహికల్. ఈ వెహికల్ ద్వారా భారతదేశంలోని అత్యంత సుందరమైన ప్రదేశాల అన్వేషించే అద్బుతమైన ప్రయాణమే ఈ డిఫెండర్ జర్నీస్ కార్యక్రమం. ఈ డిఫెండర్ జర్నీస్ లో ప్రతీ ప్రయాణం ఆలోచనాత్మకంగా రూపొందింది. ఈ ప్రయాణంలో మీకు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, విభిన్న సంస్కృతులతో ముఖాముఖి, నోరూరించే వంటకాలు, ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ స్టేలు ఉంటాయి. కూర్గ్ లాంటి అద్భుతమైన కళ్లు తిప్పుకోనివ్వని సుందర దృశ్యాల నుంచి సువిశాలమైన తీర ప్రాంతాల వరకు లేదా హిమాలయాలలోని మంచుతో కప్పబడిన శిఖరాల వరకు, అలాగే థార్ ఎడారిలో ఉండే ఇసుక తిన్నెలు… ఇలా ప్రతీ ప్రయాణం అద్భుతంగా, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయబడిరది.
ఈప్యాక్ ప్రి ఫ్యాబ్ నూతన ప్రమాణాలు
మంబట్టు (ఏపీ): భారతదేశంలోని ప్రముఖ ప్రీ-ఇంజనీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) తయారీదారులలో ఒకరైన ఈప్యాక్ ప్రిఫ్యాబ్ , కేవలం 150 గంటల రికార్డు సమయంలో భారతదేశపు అత్యంత వేగవంతమైన నిర్మాణాన్ని చేయటం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లోని మంబట్టులో పూర్తయిన ఈ ప్రాజెక్ట్, వినూత్నమైన, వేగవంతమైన నిర్మాణం పట్ల ఈ ప్యాక్ ప్రిఫ్యాబ్ నిబద్ధతకు నిదర్శనం. మొత్తం 151,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం పూర్తిగా అధునాతన ప్రిఫ్యాబ్రికేషన్, పీఈబీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబడిరది. ఈ ప్యాక్ ప్రిఫ్యాబ్ వేగవంతమైన పురోగతిని సాధించడానికి ప్రతి దశ నిర్మాణాన్ని నిశితంగా ప్లాన్ చేసింది. ప్రాథమిక నిర్మాణం 48వ గంటకు పూర్తయింది, ఆ తర్వాత 90వ గంటకు రూఫింగ్ చేయబడిరది మరియు 120వ గంటకు క్లాడిరగ్ చేయబడిరది, నిర్ణీత కాలక్రమంలో పూర్తిగా పనిచేసే భవనం తీర్చిదిద్దబడిరది.
హింద్వేర్ వారి ‘’బిల్డ్ ఎ టాయిలెట్, బిల్డ్ హర్ ఫ్యూచర్’ కార్యక్రమం
ముంబయి: భారతదేశపు ప్రముఖ బాత్వేర్ బ్రాండ్ హింద్వేర్ లిమిటెడ్ వారు తమ ‘‘బిల్డ్ ఎ టాయిలెట్, బిల్డ్ హర్ ఫ్యూచర్’’ కార్యక్రమం ద్వారా యువతులను శక్తివంతం చేయడానికి మరియు వారి కమ్యూనిటీలను ఉద్ధరించడానికి వారి మిషన్ కొనసాగిస్తున్నారు. 2020లో ‘హైజీన్ దట్ ఎంపవర్స్’ సిఎస్‌ఆర్ ప్రయత్నంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ‘డేర్ టు డ్రీమ్’ థీమ్‌తో కొత్త కోణాన్ని తీసుకువచ్చింది. బాలికలు పాఠశాలలో కొనసాగేలా, వారి కలలను నిజం చేసుకొని ఉజ్వల భవిష్యత్తును నిర్మించడానికి సురక్షితమైన మరియు అందుబాటులో ఉన్న శానిటేషన్‌ని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో తగినంత శానిటేషన్ సౌకర్యాలు లేకపోవడం ఒక క్లిష్టమైన సమస్యగా ఉంది. పరిశుభ్రమైన, హైజీనిక్ పారిశుద్ధ్య సౌకర్యాలకు అందించడానికి హింద్వేర్ ‘బిల్డ్ ఎ టాయిలెట్, బిల్డ్ హర్ ఫ్యూచర్’ కార్యక్రమంలో భాగంగా పుణెకు చెందిన ఎన్జీవో మానస్ ఫౌండేషన్, స్థానిక కమ్యూనిటీలతో చేతులు కలిపింది.
‘మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్’ ఆవిష్కరణ
ముంబై: మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ (ఎంఓఎంఎఫ్) తన సరికొత్త ఫండ్ ఆఫర్ ‘మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్’ను ప్రారంభించింది. భారతదేశంలో క్యాపిటల్ మార్కెట్ థీమ్ కింద జాబితా చేయబడిన స్టాక్స్ వృద్ధి సామర్థ్యాన్ని ఈ ఫండ్ అందిస్తుంది. నిఫ్టీ 500లో భాగమైన 15 కంపెనీలు కూడా ఉన్నాయి. ఎన్‌ఎఫ్‌ఓ పీరియడ్‌ను 26 నవంబర్ 2024 నుండి 10 డిసెంబర్ 2024 వరకు నిర్ధారించారు. ట్రాకింగ్ దోషానికి లోబడి నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ సూచించిన సెక్యూరిటీల మొత్తం రాబడులకు అనుగుణంగా ఖర్చులకు ముందు రాబడులను అందించడమే ఈ పథకం పెట్టుబడి లక్ష్యం. అయితే, ఈ పథకం పెట్టుబడి లక్ష్యం నెరవేరుతుందనే గ్యారంటీ లేదా హామీ లేదని మోతీలాల్ ఓస్వాల్ అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ లిమిటెడ్ బిజినెస్ పాసివ్ ఫండ్స్ చీఫ్ ప్రతీక్ ఓస్వాల్ తెలిపారు.
సరికొత్త బ్యాటరీ టెక్నాలజీతో తొలి ఆల్-టెర్రైన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విడుదల
హైదరాబాద్: గ్రావ్టన్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫుల్-స్టాక్ కంపెనీ, సస్టైనబుల్ మొబిలిటీలో అగ్రగామిగా ఉంది, హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ క్వాంటాను విడుదల చేసింది. క్వాంటా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర రూ.1.2లీ. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాచే ఆమోదించబడినది, ఇది వాణిజ్యపరమైన ఉపయోగం కోసం సిద్ధంగా ఉంది, క్వాంటా హైదరాబాద్‌లోని చెర్లపల్లిలోని గ్రావ్‌టన్ అత్యాధునిక సౌకర్యంలో రూపొందించి, తయారు చేయబడిరది. భారతదేశంలో లిథియం మాంగనీస్ ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలను అనుసంధానం చేసిన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ క్వాంటా. ఈ పురోగతి ఆవిష్కరణ మెరుగైన బ్యాటరీ జీవితం, ఉన్నతమైన ఉష్ణ స్థిరత్వం, విస్తరించిన శ్రేణిని నిర్ధారిస్తుంది, పట్టణ ప్రయాణికులు మరియు సాహస ఔత్సాహికుల కోసం క్వాంటాను నమ్మదగిన, సమర్థవంతమైన ఎంపికగా చేస్తుంది.
సామ్యవాద,లౌకిక పదాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం
సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్
విశాలాంధ్ర – అనంతపురం : సామ్యవాద,లౌకిక పదాలు తొలగించాలన్న పిటిషన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ వ్యక్తం చేస్తూ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 75 వ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఇటువంటి సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించడం అభినందనీయమన్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితులు అమలు ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా పీటికలో సామ్యవాద, లౌకిక పదాలను అదనంగా చేర్చడం జరిగిందన్నారు. 1976 లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన అంశాలను ఆమోదం తెలిపింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చి లౌకిక, సామ్యవాద పదాలను సమర్థించిందన్నారు. లౌకిక సామ్యవాద పదాలపై అభ్యంతరాలు తెలుపుతూ బిజెపి రాజ్యసభ మాజీ సభ్యులు సుబ్రహ్మణ్యస్వామి, బిజెపి అశ్విన్ ఉపాధ్యాయ, బలరాం సింగ్ విడివిడిగా పిటీషన్లు దాఖలు చేశారన్నారు. ఈ పిటిషన్ లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్న, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ఈనెల 22న రిజర్వ్ ఉంచిన తీర్పును సోమవారం తోసి పుచ్చుతూ కీలకతీర్పు ను వెలవరించిందన్నారు. ఈ తీర్పుపై సిపిఐ జిల్లా సమితి మద్దతు పలుకుతోందన్నారు.
డాక్టర్ హేమలతకు జాతీయ స్థాయి అవార్డు
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఆర్.ఎం.ఓ(రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్) డాక్టర్ జి.హేమలత జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) జాతీయ స్థాయి అవార్డుకు డాక్టర్ హేమలతను ఎంపిక చేశారు. ఈ మేరకు ఐఎంఏ సెక్రెటరీ డాక్టర్ అనిల్ కుమార్ జె నాయక్ మంగళవారం ప్రకటించారు.
డిసెంబర్ 27న హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరిగే నేషనల్ కాన్ఫరెన్స్ – ఉత్సవ్-2024 వేదికపై ఆమె ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్.వి.అశోకన్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.
అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ హేమలత.జి. విధి నిర్వహణలో నీతి, నిజాయతీ, నిబద్ధతతో వ్యవహరిస్తారు. ఆస్పత్రి అభివృద్ధితో పాటు రోగులు, వారి సహాయకుల కోణంలో ఆలోచిస్తూ మెరుగైన సేవలందించేందుకు పరితపిస్తారు.
ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రికి వచ్చే వారంతా పేద, మధ్య తరగతి వర్గాల వారే కావడంతో వారికి ఆస్పత్రిలో సకాలంలో మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారి సాదకబాధకాలను మానవీయ కోణంలో ఆలోచించి, వాటి పరిష్కారానికి కృషి చేసారు. చేస్తున్నారు.
ఐఎంఏలోనూ ఇప్పటికే వివిధ హోదాల్లో అందించిన సేవలను గుర్తించిన ఐఎంఏ పెద్దలు జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక చేయడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.

