Home Blog Page 1484

జాతీయ సాహస శిబిరంలో మెరిసిన మెడికోలు

0

విశాలాంధ్ర – అనంతపురం : అనంత వైద్య కళాశాల 2023వ బ్యాచ్ కి చెందిన మెడికోలు మచ్చ సాయి సుష్మ శ్రీ, జెన్నీ తానియా, హేమంత్ చౌదరి లు ఈనెల 10 నుంచి 19 వ తారీకు వరకు పది రోజులపాటు హిమాచల్ ప్రదేశ్ లో గల మనాలి లోని అటల్ బిహారీ వాజ్ పేయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ ఎలియడ్ స్పోర్ట్స్ లో భారతదేశ క్రీడా మంత్రిత్వ శాఖ ఆధీనంలోని జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సాహస శిబిరానికి వెళ్లి సాహస యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకు వచ్చిన సందర్భంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు తన చాంబర్లో విద్యార్థులను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. మెడికల్ సర్ ప్రిన్సిపల్ ఆచారి డాక్టర్ ఎస్ మాణిక్యరావు మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం పదిమంది విద్యార్థులు మాత్రమే ఎంపికవగా ఇందులో ముగ్గురు మా మెడికల్ కళాశాలకు చెందినవారు కావడం మాకు గర్వకారణంగా ఉందని, ఎన్ఎస్ఎస్ ద్వారా ఇలాంటి సాహస శిబిరాలలో పాల్గొనడం ద్వారా ఆత్మవిశ్వాసం, ధైర్యం, మానసిక వికాసం, భిన్నత్వంలో ఏకత్వం వంటి లక్షణాలు విద్యార్థులలో అలవాడతాయని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రమాదాల బారిన ప్రజలను రక్షించడానికి ఈ శిబిరంలో శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. పది రోజులలో విద్యార్థులు రాక్ క్లైమ్బింగ్, రివర్ క్రాసింగ్, ట్రిక్కింగ్, రివర్ రాఫ్టింగ్ లాంటి క్రీడలలో శిక్షణను, శిక్షణ పత్రాన్ని తీసుకోవడం విద్యార్థులకు ఒక వరమని తెలిపారు. విద్యార్థులను మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ లు ఆచార్య డాక్టర్ నవీన్ కుమార్, ఆచార్య డాక్టర్ తెలుగు మధు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు తదితరులు అభినందించారు.

సమ్మిళిత రాజ్యకీయాలే భారత రాజ్యాంగత భావన

0

కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎస్ ఏ కోరి
విశాలాంధ్ర – అనంతపురం : సమ్మిళిత రాజ్యకీయాలే భారత రాజ్యాంగత భావన అని కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎస్ ఏ కోరి పేర్కొన్నారు. మంగళవారం
ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర విభాగం, స్టూడెంట్ సెమినార్ సిరీస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ నిబంధనలు: వాగ్దానాలు (రాజకీయ) మరియు ప్రజల అనుభవాలు అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్ ఏ కోరి మాట్లాడుతూ… ప్రపంచంలో ఎన్నో దేశాలతో సమానమైనటువంటి రాష్ట్రాలు కలిగిన దేశం భారతదేశం అని పార్టీ దేశానికి దృఢమైన రాజ్యాంగాన్ని లికించిన రాజ్యాంగ సభ సభ్యులు వారి సిద్ధాంతాలు మనకు ఆదర్శాలన్నారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆచార్య జి.రామ్ రెడ్డి మాట్లాడుతూ… భారతదేశ “ప్రజలమైన మేము” మొదలయ్యే రాజ్యాంగ పీఠిక యొక్క విశిష్టతను, ప్రజాస్వామ్య దేశంలో పార్టీల పాత్రను, వీటిని కాపాడటంలో నేటి పౌరుల పాత్రను వివరించారు. డీన్ ఆచార్య షీలా రెడ్డి అందరూ రాజ్యాంగ అంశాలను వాటి అంతరార్ధాన్ని అవగతం చేసుకొని వైవిధ్యమైనటువంటి భారత ప్రజల అవసరాలు, ఆశయాలకు కనుగుణంగా ఉపయోగించుకోవాలన్నారు. సమావేశంలో భాగంగా అందరూ రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ చేశారు.
సమావేశంలో మొదటి సాంకేతిక సదస్సుకు రాజనీతి శాస్త్ర విభాగ సహప్రాచార్యులు డా. బాబు గోపాల్ అధ్యక్షత వహించగా, అలహాబాద్ లోని జిబిపిఎస్ఎస్ఐ లో సహప్రాచార్యులైన డాక్టర్ చంద్రయ్య గోపాన్ని ముఖ్య కొత్తగా విచ్చేసి ప్రాథమిక హక్కుల విశిష్టతను వివరించారు. రెండవ సాంకేతిక సదస్సుకు అర్థశాస్త్ర విభాగ సహప్రాచార్యులు డా. కేశవరెడ్డి అధ్యక్షత వహించగా, రాజస్థాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయనుంచి డా జీవన్ కుమార్ ముఖ్య వక్తగా మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు మరియు సంక్షేమ విధానం గురించి చర్చించారు. మూడవ సాంకేతిక సభను సహాయచార్యులు డా. సందీప్ నిర్వహించగా, మిజోరాం కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ సుమన్ దమేరా ముఖ్య ప్రసంగాన్ని సమ్మిళిత రాజకీయాలపై ప్రసంగించారు. నాలుగవ సాంకేతిక సదస్సును డాక్టర్ రాజేష్ కోట నిర్వహించగా, హైదరాబాద్ నల్సార్ విశ్వవిద్యాలయం నుండి డా. విగేషన్ రాజ్యాంగ విధులు మరియు న్యాయశాఖ బాధ్యతలు అనే అంశంపై విపులంగా చర్చించారు. సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆచార్య వి.వి.ఎన్ రాజేంద్రప్రసాద్ విద్యార్థులందరూ రాజ్యాంగ విలువల పట్ల అవగాహన కలిగి భవిష్యత్తు అవసరాలకు ఆచరించే విధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గౌరవ అతిథిగా విచ్చేసిన ఆచార్య హనుమాన్ కెనడి ఈ సదస్సును జరిపి రాజ్యాంగ స్వరూపం పై విద్యార్థులకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొని తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. రాజనీతి శాస్త్ర విభాగ అధ్యాపకులు
డాక్టర్ దీపాంకర్ డే, రామకృష్ణారెడ్డి, ప్రణతి తదితరులు పాల్గొన్నారు.

జి జి హెచ్ లో క్యాన్సర్ నిర్ధారణ పై ఓపి ప్రారంభం

0

విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నందు క్యాన్సర్ ను త్వరగా నిర్ధారించుటకు రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రత్యేకమైన ఓ.పి ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ మాణిక్యరావు , సూపరింటెండెంట్ డాక్టర్ కె.ఎస్.ఎస్ వెంకటేశ్వర్ రావు , కమ్యూనిటీ మెడిసిన్ నోడల్ ఆఫీసర్, హెచ్ ఓ డి అఫ్ జనరల్ సర్జరీ, గైనిక్, పేథాలజీ, రేడియోతెరప రేడియో డయాగ్నస్టిక్ డెపార్ట్మెంట్స్ మరియు ఆర్ ఎం ఓ లు డాక్టర్ హేమలత ,పద్మజ పాల్గొన్నారు. ఈ ఓ.పి ప్రతి మంగళవారం మరియు గురువారం నందు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు జరుగుతుంది. ఓ.పి నందు రొమ్ము క్యాన్సర్, నోటి యందు క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ ప్రారంభ దశలోనే గుర్తించి వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవలసినదిగా కోరుతున్నారు.

రాజ్యాంగంలోని పీఠిక  ఒక పవిత్ర గ్రంథం

0

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో  మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం  ఆధ్వర్యంలో నిర్వహించిన  భారత రాజ్యాంగ దినోత్సవం  సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  చిత్రపటానికి  జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగంలోని పీఠిక  ఒక పవిత్ర గ్రంథం అని,భారతదేశంలో  మనం పుట్టామంటే ఎన్నో జన్మల పుణ్యఫలం,మన తల్లిదండ్రులు  చేసిన పుణ్యంతో మనం జన్మించామని అన్నారు.
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని   జిల్లాలు పర్యటించానని భారతదేశంలో  24 రాష్ట్రాలు పర్యటించానని, ఐదు నుండి ఏడు దేశాలను పర్యటించాలని వేరే దేశాలలో పర్యటించినప్పుడు  మనం గమనిస్తే వివిధ రకాల ఆంక్షలు  ఉంటాయని, అది మన భారతదేశంలో  మనం ఎంత  స్వేచ్ఛతో, ఆనందంగా  ఉన్నామని తెలుస్తుందని అన్నారు.  హక్కుల,స్వేచ్ఛగా,ఆనందంగా ఉండ కలిగి మన భారత దేశం అని అన్నారు.  దానికి కారణం మన భారతదేశ రాజ్యాంగం అని అదేవిధంగా ఈరోజు   రాజ్యాంగంలో రాసినటువంటి అంశాలను నేరుగా జిల్లా కలెక్టర్ గా ఆ బాధ్యతలను నిర్వర్తించడంలో ఆ దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చాడని,  ఈ విషయంలో గర్వపడే విధంగా ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా  డిఆర్ఓ ఏ.మలోల మాట్లాడుతూ… భారత దేశం లక్షలాదిమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమని స్వతంత్రం వచ్చిన మనం మనలను పాలించుకోవడానికి అవకాశం వచ్చిందని అన్నారు.  గతంలో చాలా దేశాలలో వివిధ రకాల పాలనలను గమనించి,  పరిశీలించడం జరిగిందని ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి  న్యాయ,  స్వేచ్ఛ,సమానత్వం హక్కులు   కల్పించాలని ఉద్దేశంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తయారు చేసినది  భారత రాజ్యాంగం పీఠిక  అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న వారి చేత  ప్రతిజ్ఞ చేయించారు . ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ.మలోల,డిపిఎం ఆనంద్, కలెక్టర్ కార్యాలయం ఏ ఓ అలెగ్జాండర్,కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ యుగేశ్వరి,  ఈ సెక్షన్ సూపరింటెండెంట్ రియాజుద్దీన్, జిల్లా టూరిజం అధికారి  జయ కుమార్ బాబు , ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ పి.గురుస్వామి శెట్టి, మెజిస్టీరియల్ విభాగం సూపరింటెండెంట్ వసంతలత, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసిల్దార్ కనకరాజు, కలెక్టరేట్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగ నిర్మాణం కోసం డాక్టర్ అంబేద్కర్ ముద్ర

0

విశాలాంధ్ర-రాప్తాడు : రాజ్యాంగ నిర్మాణం కోసం డాక్టర్ అంబేద్కర్ఆ ధ్వర్యంలో ముసాయిదా కమిటీ చేసిన రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26న ఆమోదించారని నాటి గుర్తుగా 2015 సంవత్సరం నుంచి భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని రాప్తాడు తహశీల్దార్ పి.విజయకుమారి అన్నారు. రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీటీ చెన్నకేశవులు, ఈడీటీ సువర్ణ, సీనియర్ అసిస్టెంట్ రామాంజినేయులు, ఆర్ఐ కరుణాకర్, వీఆర్ఓలు, సిబ్బంది ఉన్నారు.

పార్టీ సభ్యత్వం కోసం విరాళం

0

విశాలాంధ్ర-రాప్తాడు : తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలకు సభ్యత్వం చేయించడానికి మండలంలోని బొమ్మేపర్తి వైస్ సర్పంచ్ బోయ అశ్వర్థప్ప టీడీపీ మండల ఇంఛార్జి ధర్మవరపు మురళీకి మంగళవారం రూ.10వేలు నగదును అందజేశారు. రోజూవారీ కూలిపని పనిచేసుకునే నిరుపేద టీడీపీ కార్యకర్తల సభ్యత్వ నమోదుకు పార్టీ కోసం తన వంతుగా విరాళం ఇచ్చానని అశ్వర్థప్ప అన్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ టీడీపీ , పరిటాల కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని మండల ఇన్చార్జి మురళీ అన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షుడు రెడ్డివాండ్ల రాజశేఖర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ ఎం.శీనా, పాలచెర్ల ముత్యాలప్ప, ఎర్రిస్వామి, అక్కులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టిడిపి భీమా… సభ్యులకు ధీమా…

0

విశాలాంధ్ర – కొయ్యలగూడెం : టిడిపి సభ్యత్వం తీసుకోవడంతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘాలా దేవి తెలిపారు.దిప్పకాయలపాడు గ్రామంలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నిఆమె చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో టిడిపి సభ్యత్వం తీసుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారన్నారు.సభ్యత్వం తీసుకోవడంతో ప్రమాద బీమా వర్తిస్తుందని ఆమె తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో నూతన సిసి రహదారుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చొరచూపుతోందని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిద్దు,ఆకుమర్తి. సురేష్,కొత్త రమ,తదితరులు పాల్గొన్నారు.

కార్మికులకు,రైతులకు ద్రోహం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

-కలెక్టరేట్ మహా ధర్నాలో కార్మిక,రైతు నేతలు

విశాలాంధ్ర -అనంతపురం : కార్మిక చట్టాలను కొనసాగించాలని ,వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేసిన రైతు,కార్మిక సంఘాల నేతలు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక,రైతు,ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక,రైతు సంఘాల పిలుపులో భాగంగా మంగళవారం స్థానిక లలిత కళా పరిషత్ నుండి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించి అక్కడ మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ చట్టాలను తుంగలోతొక్కి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు,కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి 44 కార్మిక చట్టాలను కొనసాగించాలన్నారు,కనీస వేతనాలు 26 వేలుకు పెంచుతున్నామని కేంద్రం ప్రకటించినా అమలుకుమాత్రం నోచుకోవడం లేదన్నారు,ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ… రైతుల నల్ల చట్టాలను రద్దు చేయాలని 13 నెలలు పాటు దేశ రాజధాని డిల్లీలో ఉద్యమం నిర్వహించి 750 మంది రైతులు ప్రాణత్యాగం చేసిన ఓక్క రైతుకు కూడా పారితోషికంగా ఓక్క రుపాయ కూడా ఇవ్వలేదన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం వలన ప్రతి ఏడాది రైతులు 3 లక్షల కోట్లు నష్టపోతున్నారన్నారు,రైతులకు పంట రుణాలు రద్దు చేయని కేంద్ర ప్రభుత్వం గడిచిన 10 సం,,ల్లో కార్పొరేట్ కంపెనీలకు 19 లక్షల కోట్లు రద్దు చేయడం దుర్మార్గమన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు మాట్లాడుతూ… అసంఘటిత రంగ కార్మికులు అయిన ఆటో,హమాలీ,వీధి వ్యాపారస్తులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలన్నారు,అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు,కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయకుండా నిలుపుదల చేసే భాధ్యత కూటమి ప్రభుత్వానిదేనన్నారు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఇండ్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నిత్యావసర ధరలు మాత్రం ఆకాశాన్ని అంతే విధంగా ఉన్నాయన్నారు దీనిమీద ప్రభుత్వాలు చర్యలు సూన్యమని ఎద్దేవా చేశారు, విద్యుత్తు రంగానికి సంబంధించినవన్నీ ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పచెప్పాలని చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టి రైతులు,ప్రజల నడ్డివిరచాలని చూస్తున్నారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవన్నారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ లు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక,రైతు వ్యతిరేక విధానాలకు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వంతపాడుతూ కేంద్రం తానా అంటే రాష్ట్ర ప్రభుత్వం తందానా అనే పద్ధతిలో ఉందన్నారు, వెంటనే కార్మిక రైతాంగ సమస్యలు పరిష్కరించాలన్నారు,
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఏసురత్నం, ఏఐకేకేఎంఎస్ జిల్లా కార్యదర్శి నాగముత్యాలు,చేతివృత్తుల సంఘం రాష్ట్ర నాయకులు లింగమయ్య,వ్య.కా.సం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ జిల్లా కార్యదర్శి పద్మావతి,గిరిజన సమాఖ్య రాష్ట్ర నాయకులు వై. ఎల్ రామాంజినేయులు, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణుడు,జిల్లా కార్యదర్శులు చిరంజీవి,రాజు,ఉపాధ్యక్షులు నాగవేణి,శ్రీనివాసులు,ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున,కౌలు రైతు సంఘం నాయకులు రామాంజి,మల్లయ్య, నాగేంద్రబాబు వేణుగోపాల్ శివ కృష్ణ ఎర్రప్ప ప్రసాద్ హసేన్ వెంకటేష్ భార్గవి లక్ష్మి కృష్ణా నాయక్ నాగేంద్ర సాయి తిమ్మప్ప, సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పరమేష్, మహిళా సమైక్య నాయకులు సావిత్రమ్మ, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి వీరేంద్ర,కౌల్ సంఘం జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామాంజనేయులు, ఇన్సప్ నాయకులు చాంద్ భాష,కాజా, చేతి వృత్తిదారుల జిల్లా నాయకులు హరి, నాగప్ప, శ్రీనివాసులు, మహిళా సమైక్య నగర కార్యదర్శి జానకమ్మ, హమాలీలు అక్బర్ వలి బాబు రాము అశోక్, ఏఐటియుసి సిఐటియు రైతు సంఘాలు అన్ని ప్రజా సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.

కృషి ,పట్టుదల ఉంటే జీవితంలో దేనినైనా సాధించవచ్చు..

బుచ్చేశ్వరరావు, ఆనంద్
విశాలాంధ్ర ధర్మవరం : కృషి పట్టుదల అకుంఠిత దీక్ష ఉన్నవారు ఎవరైనా సరే జీవితంలో దేనినైనా కూడా సాధిస్తారని లిటిల్ చాంప్స్ అకాడమీ ఆఫ్ ఇండియా కార్యదర్శి బుచ్చేశ్వరరావు, రంగస్థల సకల వృత్తి కళాకారుల సంక్షేమం రాష్ట్ర అధ్యక్షులు పెద్ది పోగు ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాంస్కృతిక మండలి లో సకల ఆర్ట్స్ అకాడమీ అండ్ ఎల్ సి ఈ ఎస్ ఫౌండేషన్ ఏపీ వారి జాతీయ నాట్య కళా రత్న పురస్కారాల సభకు వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ధర్మవరం ఎస్బిఐ కాలనీలో గల కూచిపూడి నాట్య గురువుగా ఆర్. మానసకు వారు హోప్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డు వారి గౌరవ డాక్టరేట్ ను వారి చేతులమీదుగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గురువు మానస అతి చిన్న వయసులోనే కూచిపూడి నాట్యం నేర్పడం జిల్లాలకు రాష్ట్రాలకు వెళ్లి తన నాట్యాన్ని తోపాటు నేర్పించిన చిన్నారులతో ప్రదర్శన ఇవ్వడం గర్వించదగ్గ విషయమని వారు తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు తమ బాల బాలికలను చదువుతోపాటు నృత్యమును కూడా నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ఇనుమడింప చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అనంతరం మానస శిష్యులు నిర్వహించిన నిత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తదుపరి ముఖ్య అతిథులను గురువు మానస, వారి తల్లిదండ్రులు కూడా ఘనంగా సత్కరించారు. ఇటువంటి కార్యక్రమాన్ని ధర్మవరంలో నిర్వహించడం నిజంగా గర్వించదగ్గ విషయమని వారు మరోసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత, సమాజ సేవకులు పవన్ కుమార్, రాఘవ, వడ్డే రాము, దాసరి శ్వేత తో పాటు కూచిపూడి నాట్యం నేర్చుకున్న శిష్యుల యొక్క తల్లిదండ్రులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం శిష్య బృందానికి షీల్డ్ ను అందజేశారు.

ధర్మవరంలో కవితోత్సవ వేడుకలు..

నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు జయసింహ,సత్య నిర్ధారన్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని బత్తలపల్లి రోడ్ పోలా ఫంక్షన్ హాల్ లో డిసెంబర్ ఒకటవ తేదీ ఉదయం 9:30 గంటలకు శ్రీ సత్య సాయి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ధర్మవరం కవితోత్సవ వేడుకలను(కవి సమ్మేళనం) నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ అధ్యక్షులు జయసింహ, ప్రధాన కార్యదర్శి సత్య నిర్ధారన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రచయితల సంఘం దాదాపుగా రెండు సంవత్సరాల నుండి దేశభక్తి ,మతసామరస్యం, పర్యావరణ పరిరక్షణ అంశాలపై సాహితీ సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఇందులో భాగంగానే ధర్మవరంలో కవితా ఉత్సవాన్ని 100 మంది కవులతో నిర్వహిస్తున్నందుకు వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జాబిలి చాంద్బాషా నేతృత్వంలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కవితోత్సవములో చేనేత కష్టాలు, వృద్ధాప్య జీవిత అంశంపై 20 లైన్లకు మించని కవితలను పాటలను వినిపించవచ్చునని వారు తెలిపారు. ఈ కవితోత్సవానికి జాతీయ స్థాయిలో పేరు పొందిన సాహితీవేత్తలు, సామాజికవేత్తలు దాదాపుగా నూరు మంది కవులు కళాకారులు పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి కలవారు సెల్ నెంబర్ 9440929894 గాని 9494018465కు గాని సంప్రదించవచ్చునని తెలిపారు. కావున ఇటువంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.