Wednesday, December 11, 2024
Homeజిల్లాలుఅనంతపురంసమ్మిళిత రాజ్యకీయాలే భారత రాజ్యాంగత భావన

సమ్మిళిత రాజ్యకీయాలే భారత రాజ్యాంగత భావన

కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎస్ ఏ కోరి
విశాలాంధ్ర – అనంతపురం : సమ్మిళిత రాజ్యకీయాలే భారత రాజ్యాంగత భావన అని కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎస్ ఏ కోరి పేర్కొన్నారు. మంగళవారం
ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర విభాగం, స్టూడెంట్ సెమినార్ సిరీస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ నిబంధనలు: వాగ్దానాలు (రాజకీయ) మరియు ప్రజల అనుభవాలు అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్ ఏ కోరి మాట్లాడుతూ… ప్రపంచంలో ఎన్నో దేశాలతో సమానమైనటువంటి రాష్ట్రాలు కలిగిన దేశం భారతదేశం అని పార్టీ దేశానికి దృఢమైన రాజ్యాంగాన్ని లికించిన రాజ్యాంగ సభ సభ్యులు వారి సిద్ధాంతాలు మనకు ఆదర్శాలన్నారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆచార్య జి.రామ్ రెడ్డి మాట్లాడుతూ… భారతదేశ “ప్రజలమైన మేము” మొదలయ్యే రాజ్యాంగ పీఠిక యొక్క విశిష్టతను, ప్రజాస్వామ్య దేశంలో పార్టీల పాత్రను, వీటిని కాపాడటంలో నేటి పౌరుల పాత్రను వివరించారు. డీన్ ఆచార్య షీలా రెడ్డి అందరూ రాజ్యాంగ అంశాలను వాటి అంతరార్ధాన్ని అవగతం చేసుకొని వైవిధ్యమైనటువంటి భారత ప్రజల అవసరాలు, ఆశయాలకు కనుగుణంగా ఉపయోగించుకోవాలన్నారు. సమావేశంలో భాగంగా అందరూ రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ చేశారు.
సమావేశంలో మొదటి సాంకేతిక సదస్సుకు రాజనీతి శాస్త్ర విభాగ సహప్రాచార్యులు డా. బాబు గోపాల్ అధ్యక్షత వహించగా, అలహాబాద్ లోని జిబిపిఎస్ఎస్ఐ లో సహప్రాచార్యులైన డాక్టర్ చంద్రయ్య గోపాన్ని ముఖ్య కొత్తగా విచ్చేసి ప్రాథమిక హక్కుల విశిష్టతను వివరించారు. రెండవ సాంకేతిక సదస్సుకు అర్థశాస్త్ర విభాగ సహప్రాచార్యులు డా. కేశవరెడ్డి అధ్యక్షత వహించగా, రాజస్థాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయనుంచి డా జీవన్ కుమార్ ముఖ్య వక్తగా మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు మరియు సంక్షేమ విధానం గురించి చర్చించారు. మూడవ సాంకేతిక సభను సహాయచార్యులు డా. సందీప్ నిర్వహించగా, మిజోరాం కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ సుమన్ దమేరా ముఖ్య ప్రసంగాన్ని సమ్మిళిత రాజకీయాలపై ప్రసంగించారు. నాలుగవ సాంకేతిక సదస్సును డాక్టర్ రాజేష్ కోట నిర్వహించగా, హైదరాబాద్ నల్సార్ విశ్వవిద్యాలయం నుండి డా. విగేషన్ రాజ్యాంగ విధులు మరియు న్యాయశాఖ బాధ్యతలు అనే అంశంపై విపులంగా చర్చించారు. సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆచార్య వి.వి.ఎన్ రాజేంద్రప్రసాద్ విద్యార్థులందరూ రాజ్యాంగ విలువల పట్ల అవగాహన కలిగి భవిష్యత్తు అవసరాలకు ఆచరించే విధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గౌరవ అతిథిగా విచ్చేసిన ఆచార్య హనుమాన్ కెనడి ఈ సదస్సును జరిపి రాజ్యాంగ స్వరూపం పై విద్యార్థులకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొని తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. రాజనీతి శాస్త్ర విభాగ అధ్యాపకులు
డాక్టర్ దీపాంకర్ డే, రామకృష్ణారెడ్డి, ప్రణతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు