Wednesday, December 11, 2024
Homeజిల్లాలుఅనంతపురంజాతీయ సాహస శిబిరంలో మెరిసిన మెడికోలు

జాతీయ సాహస శిబిరంలో మెరిసిన మెడికోలు

విశాలాంధ్ర – అనంతపురం : అనంత వైద్య కళాశాల 2023వ బ్యాచ్ కి చెందిన మెడికోలు మచ్చ సాయి సుష్మ శ్రీ, జెన్నీ తానియా, హేమంత్ చౌదరి లు ఈనెల 10 నుంచి 19 వ తారీకు వరకు పది రోజులపాటు హిమాచల్ ప్రదేశ్ లో గల మనాలి లోని అటల్ బిహారీ వాజ్ పేయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ ఎలియడ్ స్పోర్ట్స్ లో భారతదేశ క్రీడా మంత్రిత్వ శాఖ ఆధీనంలోని జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సాహస శిబిరానికి వెళ్లి సాహస యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకు వచ్చిన సందర్భంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు తన చాంబర్లో విద్యార్థులను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. మెడికల్ సర్ ప్రిన్సిపల్ ఆచారి డాక్టర్ ఎస్ మాణిక్యరావు మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం పదిమంది విద్యార్థులు మాత్రమే ఎంపికవగా ఇందులో ముగ్గురు మా మెడికల్ కళాశాలకు చెందినవారు కావడం మాకు గర్వకారణంగా ఉందని, ఎన్ఎస్ఎస్ ద్వారా ఇలాంటి సాహస శిబిరాలలో పాల్గొనడం ద్వారా ఆత్మవిశ్వాసం, ధైర్యం, మానసిక వికాసం, భిన్నత్వంలో ఏకత్వం వంటి లక్షణాలు విద్యార్థులలో అలవాడతాయని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రమాదాల బారిన ప్రజలను రక్షించడానికి ఈ శిబిరంలో శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. పది రోజులలో విద్యార్థులు రాక్ క్లైమ్బింగ్, రివర్ క్రాసింగ్, ట్రిక్కింగ్, రివర్ రాఫ్టింగ్ లాంటి క్రీడలలో శిక్షణను, శిక్షణ పత్రాన్ని తీసుకోవడం విద్యార్థులకు ఒక వరమని తెలిపారు. విద్యార్థులను మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ లు ఆచార్య డాక్టర్ నవీన్ కుమార్, ఆచార్య డాక్టర్ తెలుగు మధు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు తదితరులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు